ప్రచండ భైరవి (1965 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రచండ భైరవి
(1965 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సి.యస్.రావు
నిర్మాణ సంస్థ జయభేరి పిక్చర్స్
భాష తెలుగు

ప్రచంద భైరవి 1965 అక్టోబరు 22న విడుదలైన తెలుగు సినిమా. జయభేరి పిక్చర్స్ పతాకంపై టి.రంగారావు, టి.త్రివిక్రమరావులు నిర్మించిన ఈ సినిమాకు సి.ఎస్.రావు దర్శకత్వం వహించాడు. కాంతారావు, రాజసులోచన, రాజనాల లు ప్రధాన తారాగనంగా నటించిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: సి.ఎస్.రావు
  • స్టూడియో: జయభేరి పిక్చర్స్
  • నిర్మాత: టి.రంగారావు, టి. త్రివిక్రమ రావు;
  • ఛాయాగ్రాహకుడు: పి. దత్తు;
  • ఎడిటర్: సి.హెచ్. వెంకటేశ్వరరావు;
  • స్వరకర్త: పెండ్యాల నాగేశ్వరరావు;
  • గేయ రచయిత: అరుద్ర, సి.నారాయణ రెడ్డి, దాశరథి, వీటూరి
  • కథ: ఎస్.ఆర్. రాజు;
  • సంభాషణ: అరుద్ర, బి.వి.ఎన్. ఆచార్య
  • గాయకుడు: పి.బి. శ్రీనివాస్, పి.సుశీల, ఎస్.జానకి, కె.జె. జేసుదాస్, వెంకట్రావు, బి. వసంత
  • ఆర్ట్ డైరెక్టర్: ఎస్.వాలి;
  • డాన్స్ డైరెక్టర్: కె.ఎస్. రెడ్డి, పసుమర్తి కృష్ణ మూర్తి

పాటల జాబితా[మార్చు]

1.కొండలలో నేనే కొనలలో నేనే, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పులపాక సుశీల

2. నగుమోము ముద్ధుల మూట చురుకైన , రచన: ఆరుద్ర , గానం.శిష్ట్లాజానకి

3.నాలోని అందాలన్నీ నీకోసమే నీలోని, రచన : సి నారాయణ రెడ్డి, గానం.ఎస్.జానకి , ప్రతివాద భయంకర శ్రీనివాస్

4.బావలూ బావలూ బావలూ సయ్యా అందగాడు , రచన: ఆరుద్ర , గానం.పి.సుశీల బృందం

5. ఓ ఓ ఓ సుందర బాలా నీదిరా నిన్నే , రచన: దాశరథి, కృష్ణమాచార్య, గానం.ఎస్.జానకి బృందం

6.ఓ పూలరంగడా ఓ పొద్దుపోయేరా , రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి, గానం.ఎస్.జానకి

7.నీదానరా నన్నేలరా ఓ ధీరా, రచన: వీటూరి , గానం.ఎస్.జానకి , బి.వసంత , కె.జె.జేసుదాసు , వెంకట్రావు

మూలాలు[మార్చు]

  1. "Prachanda Bhairavi (1965)". Indiancine.ma. Retrieved 2021-05-31.

2.ఘంటసాల గళామ్రుతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.

బాహ్య లంకెలు[మార్చు]