బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బి.వి.ఆర్ సుబ్రహ్మణ్యం (భమ్మిడిపాటి వెంకట రామ సుబ్రహ్మణ్యం) 1987 బ్యాచ్ (ఛత్తీస్ గఢ్ క్యాడర్) ఐఏఎస్ అధికారి.[1][2] ప్రభుత్వ మేధో సంస్థ నీతి ఆయోగ్ సీఈఓ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ )గా తెలుగు అధికారి బీవీఆర్ సుబ్రమణ్యం నియమితులయ్యాడు.[3]

వృత్తి జీవితం[మార్చు]

లండన్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందాడు.[4] లాల్ బహుదూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడమీకి డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో స్విట్జర్లాండ్ లోని వరల్డ్ ట్రేడ్ ఇన్స్టిట్యూట్లో లా అండ్ ఎకనామిక్స్ లో మాస్టర్ డిగ్రీ చేశాడు. 2004 2008 2012 2015 మధ్య కాలంలో మన్మోహన్ సింగ్ నరేంద్ర మోడీల హయాంలో ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసాడు.[5] ప్రపంచ బ్యాంకు లోను సేవలందించాడు. 2018 జూన్ 20న అతనిని కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ జమ్మూ కాశ్మీర్ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2019లో రాష్ట్ర విభజన సమయంలో ఇతను ప్రధాన కార్యదర్శి హోదాలో కీలక పాత్ర పోషించాడు. ఇతను సిఎస్ గా ఉన్నప్పుడే ఆర్టికల్ 370 రద్దు జరిగింది.[6]

కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేసాడు. ప్రభుత్వ మేధో సంస్థ నీతి ఆయోగ్ సీఈఓ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ )గా బీవీఆర్ సుబ్రమణ్యం నియమితులయ్యాడు. ఇతను ఈ పదవిలో రెండు సంవత్సరాలు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు కొనసాగుతాడు.[7]

మూలాలు[మార్చు]

  1. "B V R Subrahmanyam, senior Chhattisgarh bureaucrat, sent to J&K; tipped to be next chief secretary". The Financial Express (in అమెరికన్ ఇంగ్లీష్). PTI. 2018-06-20. Retrieved 2020-08-14.{{cite web}}: CS1 maint: others (link)
  2. "J-K chief secy B V R Subrahmanyam among 26 IAS officers empanelled in rank of Secretary at Centre". Business Standard India. PTI. 2019-10-09. Retrieved 2020-08-14.
  3. "BVR Subrahmanyam takes charge as NITI Aayog's Chief Executive Officer". 2023-02-25. Retrieved 2023-08-12.
  4. Ghose, Debobrat (2018-06-20). "BVR Subrahmanyam could be J&K's chief secretary: IAS officer's experience in dealing with insurgency makes him ideal choice". Firstpost. Retrieved 2020-08-14.
  5. "Senior Chhattisgarh cadre bureaucrat B.V.R. Subrahmanyam posted to J&K". The Hindu (in Indian English). PTI. 2018-06-20. ISSN 0971-751X. Retrieved 2020-08-14.{{cite news}}: CS1 maint: others (link)
  6. Bureau, The Hindu (2023-02-20). "B.V.R. Subrahmanyam is new CEO of Niti Aayog, Parameswaran Iyer to go to World Bank". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-08-30.
  7. "NITI Aayog welcomes B.V.R. Subrahmanyam as its CEO". pib.gov.in. Retrieved 2023-08-30.

వెలుపలి లంకెలు[మార్చు]