బీనాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బీనాదెవి అనేది కలంపేరు మాత్రమే. వ్రాసిన వారు ఇద్దరు. ఒకరు రచయిత్రి మరొకరు రచయిత. ఇద్దరూ భార్యా భర్తలు. భర్తగారు న్యాయమూర్తి, భార్య గృహిణి. కథల్లో ఎక్కువగా న్యాయమూర్తిగా చూసిన ఆయన చూసిన కేసులే ఎక్కువ ప్రేరణ. "బీనాదేవి" జంటలో భార్య గారి పేరు భాగవతుల త్రిపురసుందరమ్మ (జ: 1935 ఫిబ్రవరి 11) భర్తగారి పేరు భాగవతుల నరసింగరావు. భార్యభర్తా ఇద్దరూ కలిసి బీనాదేవి అనే కలం పేరుతో రచనలు చేసారు. భార్యాభర్తలు బీనాదెవి అనేది కలంపేరు పేరు తో రచనలు చేశారు

జీవిత విశెషాలు[మార్చు]

బీనాదేవి విశాఖపట్నంలో చోడవరంలో 1935 ఫిబ్రవరి 11 న జన్మించింది. బి.ఏ ఉత్తీర్ణురాలైంది. ఈమెపై రాచకొండ విశ్వనాథశాస్త్రి ప్రభావం ఎక్కువ.[1]ఆమె 1965 నుండి రచనలు కొనసాగిస్తుంది. ఆమె రాధమ్మ పెళ్ళి ఆగిపోయింది అనే కథానిక సంకలనాన్ని ప్రచురించింది. ఆమె భర్త భాగవతుల నరసింగరావు సబ్‌జడ్జి, రచయిత.

భర్త మరణం తర్వాత 1990 నుండి స్వయంగా కథలూ, వ్యాసాలూ రాస్తూ బీనాదేవి కథలూ-కబుర్లూ సంపుటిని వెలువరించింది.

బీనాదేవి కథల్లోని పాత్రల వస్తౌచిత్యం  విస్మయం కలిగించే తీరులో సాగుతుంది.  రావి శాస్త్రి ప్రభావం నీడలా వెన్నాడుతుంటుంది. పుణ్యభూమీ కళ్లు తెరు, మార్క్సిజం ప్రభావంతో రాసిన హేంగ్ మీ క్విక్ లాంటి ఎన్నో రచనల్లో ప్రతీ అక్షరం ప్రజల తరుఫున వకాల్తా పుచ్చుకొని సమాజాన్ని, పాలకులను బోనెక్కిస్తుంటుంది. రావి శాస్త్రి రచనా వ్యక్తిత్వానికి  బీనాదేవి కేవలం వారసత్వ ప్రతిరూపం అని అంటారు కొడవటిగంటివారు.

నరసింగరాజు ఆగస్టు 25, 1924లో జన్మించాడు. న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డాడు. త్రిపురసుందరి ఫిబ్రవరి 11, 1935న జన్మించింది. 1990లో నరసింగరావుగారి మరణానంతరమూ అదేపంథాలో రచనలు కొనసాగించింది.

ఆమె చనల్లో ఎక్కువ ఉత్తరాంధ్ర పలుకుతుంటుంది. ఆమె పేరు వినగానే చప్పున స్ఫురించేది 'పుణ్యభూమీ  కళ్లు తెరు'. 'హేంగ్ మీ క్విక్' పై మార్క్సిజం ప్రభావం కనిపిస్తుంది.[2]

1972 లో వీరికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

ఇంతవరకూ బీనాదేవి పేరిట వెలువడిన కథలు, నవలలు, వ్యాసాలూ లభ్యమైనంతవరకూ సేకరించి డా. ఎల్‌. నరేంద్రనాధ్‌ గారి ప్రత్యేక సహకారంతో మనసు ఫౌండేషన్‌ ఈ సర్వస్వాన్ని తెలుగు పాఠకులకి "బీనాదేవి సమగ్ర రచనలు" అనే పుస్తకం ద్వారా అందిస్తున్నారు.[3]

రచనలు[మార్చు]

బీనాదేవి పేరుతో వచ్చిన రచనలు[మార్చు]

  1. ఫస్ట్ స్టోరీ  ఫస్ట్ కేఫ్ 1960
  2. ఏ మేటరాఫ్ నో ఇంపార్టెన్స్ 1972
  3. రాధమ్మపెళ్లి ఆగిపోయింది
  4. డబ్బు డబ్బు డబ్బు 1975
  5. హరిశ్చంద్రమతి 1980
  6. ‘కథలు – కబుర్లు’ భర్త పోయిన తర్వాత భార్య ఒంటిగా ప్రకటించిన రచన.

మూలాలు[మార్చు]

  1. "బీనాదేవి". Archived from the original on 17 Jun 2019.
  2. "బీనాదేవి". Teluguone. 2020-07-27. Retrieved 2020-07-27.
  3. బీనాదేవి సమగ్ర రచనలు(Beenadevi Samagra Rachanalu) By Beenadevi - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2020-07-27. Retrieved 2020-07-27.
"https://te.wikipedia.org/w/index.php?title=బీనాదేవి&oldid=4218906" నుండి వెలికితీశారు