మర్రి రాజశేఖర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మర్రి రాజశేఖర్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 మార్చి 2023 - 29 మార్చి 2029
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

ఎమ్మెల్యే
పదవీ కాలం
2004-2009
ముందు పత్తిపాటి పుల్లారావు
తరువాత పత్తిపాటి పుల్లారావు
నియోజకవర్గం చిలకలూరిపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1957
తిక్కిరెడ్డిపాలెం , ప్రత్తిపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

మర్రి రాజశేఖర్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పని చేసి, ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి మార్చి 2023లో జరిగిన ఎన్నికలకు ఎమ్మెల్యే కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించింది.[1]

రాజకీయ జీవితం[మార్చు]

మర్రి రాజశేఖర్ 2004లో చిలకలూరిపేట నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఆయన ఆ తరువాత 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటి చేసి ఓడిపోయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం 2010లో వైసిపిలో చేరాడు. మర్రి రాజశేఖర్ 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు, ఆ తరువాత ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా వైసిపి జిల్లా అధ్యక్షులుగా పని చేసి 2018లో వైఎస్‌జగన్‌ చేసిన పాదయాత్రలో కీలకంగా పని చేశాడు.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి మార్చి 2023లో జరిగిన ఎన్నికలకు ఎమ్మెల్యే కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించగా ఆయన ఎమ్మెల్సీగా గెలిచాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (20 February 2023). "వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. మర్రి రాజశేఖర్‌కు ఎన్నాళ్లకెన్నాళ్లకు ! లిస్ట్ ఇదే." Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
  2. Prajasakti (24 March 2023). "ఎమ్మెల్సీలుగా ఏసురత్నం, రాజశేఖర్‌" (in ఇంగ్లీష్). Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
  3. Sakshi (24 March 2023). "ముగ్గురూ గెలిచారు". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.