రాజా రిత్విక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజా రిత్విక్
జననం
రాజవరం రాజా రిత్విక్

2004
తల్లిదండ్రులుదీపిక, శ్రీనివాస్‌

రాజవరం రాజా రిత్విక్ భారతదేశానికి చెందిన చెస్‌ క్రీడాకారుడు. ఆయన 2021లో గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) హోదా అందుకొని దేశంలో 70వ గ్రాండ్​మాస్టర్​గా, తెలంగాణ రాష్ట్రం నుంచి మూడో గ్రాండ్​మాస్టర్​గా నిలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

రాజా రిత్విక్ కుటుంబం పెద్దపల్లి జిల్లా, మంథనికి చెందినవారు, ఆయన తండ్రి ఆర్‌.శ్రీనివాసరావు ఉద్యోగరీత్యా కుటుంబంతో వరంగల్‌లో స్థిరపడ్డారు. రాజా రిత్విక్ 2004లో ఆర్‌.శ్రీనివాసరావు, దీపిక దంపతులకు జన్మించాడు.రిత్విక్ జూబ్లీ హిల్స్ లోని ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ లో పదవ తరగతి పూర్తి చేసి, ప్రస్తుతం సికింద్రాబాద్‌ సైనిక్‌పురిలోని భవాన్స్‌ శ్రీ రామకృష్ణ విద్యాలయంలో 12వ తరగతి చదువుతున్నాడు.[2]

క్రీడా జీవితం[మార్చు]

రాజా రిత్విక్ ఆరేళ్ల వయసులో తన తండ్రి చదరంగం ఆడుతుంటే చూసి చెస్‌ ఆట పట్ల ఆకర్షితుడయ్యాడు. వరంగల్‌లో స్థానిక కోచ్‌ బొల్లం సంపత్‌ వద్ద ఓనమాలు నేర్చుకొని మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్‌లోని ‘రేస్‌ చెస్‌ అకాడమీ’లో కె.నరసింహా రావు వద్ద తన ఆటతీరుకు మెరుగులు దిద్దుకున్నాడు. ప్రస్తుతం రిత్విక్ ఎన్‌.వి.ఎస్‌. రామరాజు వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు.[3]

సాధించిన విజయాలు
  1. 2009లో భీమవరంలో జరిగిన అండర్‌-7 చెస్‌ పోటీల్లో చాంపియన్‌షిప్‌ గెలిచాడు
  2. 2012లో కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో అండర్‌–8 విభాగంలో రజతం పతకం
  3. 2013లో, 2015లో ఆసియా స్కూల్స్‌ టోర్నమెంట్ లో స్వర్ణ పతకం
  4. 2017 జూన్‌లో జాతీయ అండర్‌–13 చాంపియన్‌
  5. 2017 అక్టోబర్‌లో జరిగిన జాతీయ అండర్‌–17 చాంపియన్‌
  6. 2018లో ఆసియా యూత్‌ చాంపియన్‌షిప్‌లో 5 స్వర్ణ పతకాలు

ఇవి కూడా చుడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Eenadu (19 September 2021). "రాజా.. ది గ్రాండ్‌మాస్టర్‌". Archived from the original on 14 November 2021. Retrieved 14 November 2021.
  2. Namasthe Telangana (21 September 2021). "నా మాస్టర్‌.. అమ్మ! 'గ్రాండ్‌మాస్టర్‌' రిత్విక్‌". Archived from the original on 22 November 2021. Retrieved 14 November 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 22 సెప్టెంబరు 2021 suggested (help)
  3. Sakshi (19 September 2021). "'గ్రాండ్‌మాస్టర్‌' రాజా రిత్విక్". Archived from the original on 14 November 2021. Retrieved 14 November 2021.