రాబర్ట్ ఫికో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాబర్ట్ ఫికో (; 1964 సెప్టెంబర్ 15) రాబర్ట్ ఫికో స్లోవేకియా దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. రాబర్ట్ ఫికో 2006 నుండి 2010 వరకు మొదటిసారి స్లోవేకియా ప్రధానమంత్రిగా పనిచేశాడు. 2012 నుండి 2018 వరకు రెండవసారి ప్రధానమంత్రిగా పనిచేశాడు. అతను 2023 నుండి ప్రస్తుతం స్లోవేకియా ప్రధాన మంత్రిగా ఉన్నాడు. రాబర్ట్ ఫికో 1999లో డైరెక్షన్ - సోషల్ డెమోక్రసీ పార్టీని స్థాపించాడు స్థాపించినప్పటి నుండి ఆ పార్టీకి నాయకత్వం రాబర్ట్ ఫికో నాయకత్వం వహిస్తున్నాడు. మొత్తం 10 సంవత్సరాలకు పైగా పనిచేసిన స్లోవేకియా దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా 1992లో మొదటిసారిగా రాబర్ట్ ఫికో స్లోవేకియాపార్లమెంటుకు ఎన్నికయ్యారు, చెకోస్లోవేకియాలో ఉండగా, అతను మరుసటి సంవత్సరం కౌన్సిల్ ఆఫ్ యూరప్‌కు పార్లమెంటరీ సభ్యుడిగా నియమించబడ్డాడు. 2006 స్లో వేకియా పార్లమెంటరీ ఎన్నికలలో పార్టీ విజయం సాధించిన తర్వాత రాబర్ట్ ఫికో తొలిసారి స్లోవేకియా ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యాడు.[1][2]

2010 స్లోవేకియా పార్లమెంటరీ ఎన్నికల్లో రాబర్ట్ ఫికో పోటీ చేసి ఓడిపోయాడు. ఇవెటా రాడికోవా క్యాబినెట్‌పై అవిశ్వాస తీర్మానం తరువాత, 2012 పార్లమెంటరీ ఎన్నికలలో రాబర్ట్ ఫికో రెండవ సారి స్లోవేకియా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు. 2014 స్లోవేకియా అధ్యక్ష ఎన్నికల్లో రాబర్ట్ ఫికో పోటీ చేసి ఓడిపోయాడు. 29 మార్చి 2014న జరిగిన స్లోవేకియా అధ్యక్ష ఎన్నికల్లో రాబర్ట్ ఫికో తన రాజకీయ ప్రత్యర్థి ఆండ్రెజ్ కిస్కా చేతిలో ఓడిపోయాడు [3]

2018 మార్చి 15న, జాన్ కుసియాక్ హత్య తర్వాత ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా, రాబర్ట్ ఫికో స్లోవేకియా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశాడు, రాబర్ట్ ఫికో స్లోవేకియా ఉప ప్రధాన మంత్రి పీటర్ పెల్లెగ్రిని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరాడు. [4] [5]

2024 మే 15న, రాబర్ట్ ఫికో పై హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నం తరువాత రాబర్ట్ ఫికో అత్యవసర చికిత్స చేయించుకున్నాడు., [6] [7]. [8]

[9]

మూలాలు[మార్చు]

  1. "Robert Fico: స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్‌ ఫికో?". EENADU. Retrieved 2024-05-16.
  2. Telugu, TV9 (2024-05-15). "Robert Fico: స్లొవేకియా ప్రధాని రాబ‌ర్ట్ ఫికోపై దుండగుల కాల్పులు.. పరిస్థితి విషమం." TV9 Telugu. Retrieved 2024-05-16.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Kiska becomes president (UPDATED)". The Slovak Spectator. Archived from the original on 16 March 2018. Retrieved 15 March 2018.
  4. "Fico podá demisiu, novým premiérom môže byť Pellegrini (minúta po minúte)". Sme (in స్లోవక్). 15 March 2018. Archived from the original on 15 March 2018. Retrieved 15 March 2018.
  5. Heijmans, Philip (15 March 2018). "Slovakia's PM Robert Fico resigns amid public outcry". Al Jazeera. Archived from the original on 15 March 2018. Retrieved 15 March 2018.
  6. "Slovakia PM shooting live: Robert Fico in surgery and 'fighting for his life' – minister". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 15 May 2024. Archived from the original on 15 May 2024. Retrieved 15 May 2024.
  7. https://www.reuters.com/world/europe/shooting-after-slovak-government-meeting-tasr-agency-reports-2024-05-15/
  8. "Live updates: Shooting of Slovakia's Prime Minister Robert Fico". CNN (in ఇంగ్లీష్). 15 May 2024. Retrieved 15 May 2024.
  9. "Slovakian PM Fico 'now stable' after assassination attempt". euronews (in ఇంగ్లీష్). 15 May 2024. Archived from the original on 15 May 2024. Retrieved 15 May 2024.