రామెన్ దేక
Jump to navigation
Jump to search
రామెన్ దేక | |||
| |||
లోక్‌సభ సభ్యుడు
మంగలదోయ్ నియోజకవర్గం | |||
పదవీ కాలం 16 మే 2009 – 23 మే 2019 | |||
ముందు | నారాయణ్ చంద్ర బోర్కటకీ | ||
---|---|---|---|
తరువాత | దిలీప్ సైకియా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సువాల్కుచి, అస్సాం, భారతదేశం | 1954 మార్చి 1||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | సురేంద్రనాథ్ దేక | ||
జీవిత భాగస్వామి | రాణీ దేకాకకోటి | ||
సంతానం | 2 | ||
పూర్వ విద్యార్థి | గౌహతి యూనివర్సిటీ (బి.ఏ (ఫిలాసఫీ & ఎకనామిక్స్)) |
రామెన్ దేక అస్సాం రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో మంగలదోయ్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు.[1]
జననం, విద్యాభాస్యం[మార్చు]
రామెన్ దేక 1954 మార్చి 1 లో అస్సాంలోని సువాల్కుచిలో జన్మించాడు. ఆయన అస్సాం విశ్వ విద్యాలయంలో బీఏ పూర్తి చేశాడు. రామెన్ విద్యార్థి దశలో 1972లో ఏబివిపి పూర్వాంచల్ జనరల్ సెక్రటరీగా, హోల్ సేల్ జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ అడ్వైజర్‌గా, 1974 -75 వరకు గౌహతి విశ్వవిద్యాలయం కోర్ట్ మెంబర్‌గా, 1979లో అస్సాం సాహిత్య సభకు కల్చరర్ సెక్రటరీగా వివిధ హోదాల్లో పనిచేశాడు.
రాజకీయ జీవితం[మార్చు]
రామెన్ దేక చదువు పూర్తికాగానే జనతాపార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1977లో అస్సాం జనతాపార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశాడు. ఆయన జనతాపార్టీలో భారతీయ జనతాపార్టీగా మారిన తరువాత ఆర్ఎస్ఎస్ లో పూర్తిస్థాయి ప్రచారక్ గా ఉన్నాడు.
నిర్వహించిన పదవులు[మార్చు]
- 1977 లో అస్సాం జనతాపార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు.
- 1980 లో బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు
- 2005లో బీజేపీ అధికార ప్రతినిధి
- బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, అస్సాం బీజేపీ ఉపాధ్యక్షుడిగా, బిజెపి ఈశాన్య రాష్ట్రాల కోఆర్డినేషన్ కౌన్సిల్, జాతీయ కౌన్సిల్ జనరల్ సెక్రటరీగా పనిచేశాడు.
- 2006 లో బీజేపీ అస్సాం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు
- 2009లో అస్సాంలోని మంగలదోయ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యాడు.
- 2009 ఆగస్టు 31 నుంచి 2014 మే వరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.
- 2010 మే 1 లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీలో సభ్యుడు
- కేంద్ర గనుల మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యుడు
- 2014 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగలదోయ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.
- 2014 జూన్ 9 నుంచి లోక్ సభ ప్యానల్ చైర్ పర్సన్స్ లో సభ్యుడు
- 2014 ఆగస్టు 14 నుంచి ఎస్టిమేట్స్ కమిటీలో సభ్యుడు
- 2014 సెప్టెంబరు 1 కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీలో సభ్యుడు
- విదేశాంగ శాఖ సంప్రదింపుల కమిటీలో సభ్యుడు
- ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన కేంద్ర అడ్వైజరీ కమిటీలో సభ్యుడు
- 2015 జనవరి 29 నుంచి సాధారణ ప్రయోజనాల కమిటీలో కమిటీలో సభ్యుడు
- జులై 3, 2015 నుంచి ఎస్టిమేట్స్ కమిటీ, సబ్ కమిటీ -II లో కమిటీలో సభ్యుడు[2]
మూలాలు[మార్చు]
- ↑ Lok Sabha (2014). "Ramen Deka". Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.
- ↑ The Times of India (2018). "RAMEN DEKA : Bio, Political life, Family & Top stories". Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.