రాశి సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాశి సింగ్
జననం1999 జనవరి 5
రాయ్‌పూర్‌
విద్యగ్రాడ్యుయేషన్
వృత్తినటి, మోడల్, ఎయిర్ హోస్టెస్
క్రియాశీల సంవత్సరాలు2019 - ప్రస్తుతం
తల్లిదండ్రులురమేష్ సింగ్, సరితా సింగ్

రాశి సింగ్ (జననం 1999 జనవరి 5) భారతీయ నటి, మోడల్. ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలలో నటిస్తుంది.

జననం[మార్చు]

రాయ్‌పూర్‌లో 1999 జనవరి 5న రమేష్ సింగ్, సరితా సింగ్ దంపతులకు జన్మించింది. ఆమెకు సౌరభ్ సింగ్ అనే ఒక సోదరుడు ఉన్నాడు.

కెరీర్[మార్చు]

చిన్నప్పటి నుంచి నటన పై ఆసక్తితో ధారావాహికల్లోని పాత్రలు చూసి వాటిని రోజూ అద్దం ముందు ప్రాక్టీస్‌ చేసే రాశి సింగ్ 14 ఏళ్లప్పుడు ఓ కమర్షియల్‌ యాడ్‌ అవకాశం వచ్చింది. అయినా వ్యక్తిగత కారణాల వల్ల ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా కెరీర్‌ని ప్రారంభించాల్సి వచ్చింది. ఆ తరువాత ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉన్న ఆమె చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది. రాశీ 2019లో జెమ్ అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తరువాత పోస్టర్(2021), శశి (2021) చిత్రాలలో తన సహజసిద్ధమైన నటనా ప్రతిభను చాటింది .[1]

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భూతద్దం భాస్కర్‌ నారాయణ చిత్రంలో శివ కందుకూరి సరసన రాశి సింగ్ నటిస్తోంది.[2]

మూలాలు[మార్చు]

  1. "అప్పుడు ప్రభాస్‌, రానా మాత్రమే తెలుసు". web.archive.org. 2023-01-14. Archived from the original on 2023-01-14. Retrieved 2023-01-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "భూతద్దం భాస్కర్‌ కహానీ! | Bhootaddam Bhaskar Kahani". web.archive.org. 2023-01-14. Archived from the original on 2023-01-14. Retrieved 2023-01-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)