వర్గం చర్చ:ఈ వారం వ్యాసం పరిగణనలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసంలో అనువదించవలసిన భాగాలు ఉంటే, ఈ వారపు వ్యాసంగా ప్రతిపాదించవద్దు అని రాసారు. ఆ నిబంధన తీసివెయ్యొచ్చేమో! ఒక మోస్తరు సమాచారం ఉన్న వ్యాసానికి మరింత విషఅయాన్ని చేర్చి, మెరుగుపరచి ఈ వారపు వ్యాసంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందేమోనని నా అభిప్రాయం. __చదువరి (చర్చరచనలు) 06:07, 21 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీల లింకులు[మార్చు]

చర్చ పేజీ లింకుతో పాటు అసలు పేజీల లింకులు కూడా ఇవ్వండి. ప్రాధాన్యత స్థాయిలో చూపించటం కూడా బాగుంటుంది. అర్జున 04:28, 29 సెప్టెంబర్ 2009 (UTC)

శుద్ధి చేయని వ్యాసాలు[మార్చు]

ప్రస్తుతం ఈ వ్యాస పరిగణల వర్గంలో శుద్ధి చేయబడని గూగుల్ అనువాదం వ్యాసాలు, మూలాలు లేని వ్యాసాలు, చిత్రాలు లేని వ్యాసాలు, వికీకరణ చేయని వ్యాసాలు, తక్కువ పరిమాణం గల వ్యాసాలు ఉన్నాయి. ఈ వ్యాసం వ్యాసంగా ప్రచురిద్దామంటే ఆ వ్యాసాన్ని శుద్ధి చేయవలసి వస్తున్నది. ప్రస్తుతం అటువంటి వ్యాసాలను ఈ వర్గం నుండి తొలగిస్తే మంచిదని నా అభిప్రాయం. మనలో కొంతమంది ప్రస్తుతం నాణ్యత కలిగిన వ్యాసాలు రాస్తున్నందున, ఇది వరకు ఉన్న వాడుకరులు రాసిన నాణ్యమైన వ్యాసాలు ఉన్నందున ఆ వ్యాసాలను గుర్తించి వాటి చర్చా పేజీలలో "ఈవావ్యా" మూసను ఉంచితే బాగుంటుంది. ప్రాజెక్టు టైగర్ పోటీలో ఉన్న నాణ్యమైన వ్యాసాలను కూడా చేర్చవచ్చు. ప్రస్తుతం ఈ వర్గంలో ఉన్న ఈ వారం వ్యాసంగా పరిగణించబడుతున్న వ్యాసాల నాణ్యతను పరిశీలించి ప్రచురణకు అర్హమైనవి కానివాటిని తొలగించడమే మంచిదని భావిస్తున్నాను. --కె.వెంకటరమణచర్చ 15:38, 25 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]