వాడుకరి చర్చ:YVSREDDY/తొలగింపు కొరకు వ్యాసాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాడుకరి:YVSREDDY గారూ, తొలగింపు అభ్యర్థనలున్న పేజీలను ఒక జాబితాగా తయారుచేసుకున్నారు. సరే కానీ ఆయా వ్యాసాల తోలగింపు అభ్యర్థనల చర్చా పేజీలలో విస్తరిస్తారా? తొలగించమంటారా? ఏదో విషయం తెలియజేయండి. అక్కడ చర్చించక పోతే అవి ఎవరైనా తొలగిస్తారు. కె.వెంకటరమణ (చర్చ) 05:39, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గారు, ఏదో ఒక చర్చ లేవనెత్తి కాలయాపన చేయడం తప్ప ఇంకోటి కనిపించడంలేదు. తొలగింపు మూస పెట్టి వారం (7 రోజుల) సమయం ఇచ్చి, ఆ లోపల వ్యాసాన్ని విస్తరించకుంటే తొలగించాల్సిందేనండి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:58, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Pranayraj Vangari గారూ, మనం మూసను చేర్చితే, అతను ఆ వ్యాసంపై చర్చించకుండా మనం తొలగించే సరికి మలర అదే విధంగా సృష్టిస్తుంటారు. మనకి ఈ చర్చలకే సమయం వృధా అవుతుంది. కె.వెంకటరమణ (చర్చ) 06:01, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అవును వెంకటరమణ గారు, వికీ నియమాలను పాటించకపోతే ప్రస్తుతానికి వ్యాసాలమీద తీసుకుంటున్న చర్యను వాడుకరి మీద కూడా తీసుకోవలసిరావచ్చు. Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:04, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:Pranayraj1985 గారూ, వికీనియమాలను పాటించకుండా తనకిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సముదాయం నిర్ణయం మేరకు నిరోధించాల్సి ఉంటుంది. కె.వెంకటరమణ (చర్చ) 06:10, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అదే జరిగేట్టుంది వెంకటరమణ గారు. ఇక ఆయన ఇష్టం. Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:36, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Pranayraj Vangari గారూ,కె.వెంకటరమణ గారు, నమస్కారం, ప్రస్తుతం ఏ వ్యాసంను మొలక స్థాయి దాటించి వ్రాయగలనో లేదో నాకు తెలియదు, కావున ఏదైనా వ్యాసం తొలగిస్తే మొలక స్థాయి దాటించ గల వ్యాసాన్ని నేను ప్రారంభించాలనుకుంటే ఏమి చేయాలనేది నాకు తెలియదు కావున వివరిస్తే వికీ నియమాల ప్రకారం తొలగించిన వ్యాసాన్ని సృష్టిస్తాను. తొలగించబడిన వ్యాసాలను ఎలా ప్రారంభించాలో తెలిపే తెలుగు సమాచారం ఉన్న లింకు ఇస్తే అక్కడి నియమాల ప్రకారం మాత్రమే తొలగించబడిన వ్యాసాలను ప్రారంభిస్తాను. ఎవరికైనా వికీ నియమాలు తెలియకపోతే, ముఖ్యంగా నాకు వికీ నియమాలు తెలియనందున (నాకు నిజంగా తెలియదు) వికీ నిర్వాహకులైన మీకు వికీ నియమాలను వివరించవలసిన బాధ్యత వుంది. YVSREDDY (చర్చ) 06:51, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
YVSREDDY గారూ, మీకు నియమాలు తెలియక పోవడం ఏమిటి? మీరు తెలుగు వికీపీడియాలో 2011 అక్టోబరు 30 నుండి వ్యాసాలు రాయడం మొదలుపెట్టి 2314 వ్యాసాలను రాసారు. అన్ని వ్యాసాల సరాసరి పేజీ సైజు 1.32 కె.బి మాత్రమే. దీనిని బట్టి మీరు ఎన్ని వేల మొలక వ్యాసాలు సృష్టించారో తెలుస్తుంది. ఈ మొలక వ్యాసాల గూర్చి నియంత్రణ విధానం ఈ మొలక వ్యాసాలపైనే చర్చలో భాగంగా జరిగిందని మీకు తెలియదా? వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 18 , వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 17 లలో మీ వ్యాసాల గురించి విపరీతమైన చర్చ జరిగిందని మీకు తెలియదా? సీనియర్ వాడుకరులందరూ మీకు సలహాలు ఇవ్వలేదా? అన్నీ తెలిసి నియమాలు గురించి తెలియదంటున్నారు. ఏమనుకోవాలండీ. ఆ రచ్చబండ చర్చల మూలంగానే కదా ఈ మొలకల నియంత్రణ విధానం ప్రారంభమైంది. ఈ నియంత్రణ విధాన ఏర్పాటుకు మూలమైనది మీ వ్యాసాలపై చర్చ కాదా? మీకు వ్యాసాలు ఎలా రాయాలో తెలియదంటే నమ్మమంటారా? అనేక మంది నిర్వాహకులు నిర్వాహణ మూసలు ఉంచినపుడు మీరేమి స్పందించడం లేదు. తొలగింపు చర్చలలో పాల్గొనాలని తెలియదా? నిర్వాహకుల కంటే ఎక్కువ నియమాలు తెలిసినవారు మీరు. మీరు రాసిన వ్యాసాలను మొలక స్థాయి దాటించడమే కాకుండా అందులో మూలాలను చేర్చడం, వ్యాసంలోని వివిధ పదాలకు ఇతర వ్యాసాలకు లింకులు ఇవ్వడం. మీరు రాస్తున్న వ్యాసానికి ఇతర వ్యాసాలనుండి లింకు లుండాలని తెలియదా? పై రచ్చబండ లింకులలోని అంశాలను ఎవరైనా చదివితే వికీపీడియాలో మీకున్న పరిజ్ఞానం అర్థమవుతుంది. కనుక మీరు సృష్టించిన వ్యాసాల అభివృద్ధికి కృషి చేయగలరు. ఒక వ్యాసాన్ని మొలకలనియంత్రణ విధానాన్ని అడ్డు పెట్టుకొని విస్తరించడానికి సమాచారం ఉన్నా 2000 బైట్లకు చేర్చి వదిలేస్తున్నారు. వికీలో క్రియాశీలక సభ్యులు తక్కువగా ఉన్నందున మీ వ్యాసాలను ఎవరూ అభివృద్ధి చేయరు. మీరు రాసిన ఏకవాక్య మొలక వ్యాసాలు తొలగిస్తే మంచి వ్యాసాలుగా తీర్చిదిద్దడానికి ఎవరైనా ముందుకు వస్తారు. మీకు వ్యాసకర్తగా ఉండాలనే కోరిక ఎలా ఉంటుందో నూతన సభ్యులకు కూడా అలానే ఉంటుంది. కనుక మీరు అభివృద్ధి చేయనిచో ఏక వాక్యాల వ్యాసాలు తొలగించబడతాయి. మీరు తొలగించకూడదని భావిస్తే మీరు ఆ వ్యాసాల చర్చా పేజీలో చర్చించండి. కె.వెంకటరమణ (చర్చ) 07:14, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
YVSREDDY గారు... కె.వెంకటరమణ గారు చెప్పిన దాన్నిబట్టి చూస్తే మీకు వికీ నియమాల గురించి స్పష్టమైన అవగాహన ఉందని, గతంలో మీ ఏకవాక్య వ్యాసాల గురించి జరిగిన చర్చలో మీరు కూడా పాల్గొన్నారని తెలిసింది. ఇక నేను చెప్పాల్సిన పనిలేదనుకుంటాను. కాకపోతే, 7 ఏళ్ళ క్రితం చేసినదే (వ్యాసాల విస్తరణ చేయకుండా అనవసర చర్చలు జరపడం) మళ్ళీ చేస్తున్నారు. ఇకపోతే... ప్రస్తుతం ఏ వ్యాసంను మొలక స్థాయి దాటించి వ్రాయగలనో లేదో నాకు తెలియదు, వికీ నియమాల ప్రకారం తొలగించిన వ్యాసాన్ని సృష్టిస్తాను. అన్నారు. అంటే, మీరు రాసిన మొలకలను విస్తరణ చేయలేరు అని అర్థం కదా, మరి వాటిని ఎలాంటి చర్చలు లేకుండా తొలగించడానికి మీరు అంగీకరిస్తున్నట్టేనా..? తెలపండి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:44, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మీ మొలకలు[మార్చు]

వాడుకరి:YVSREDDY గారూ, మీ మొలకలు ఈ పేజీలో చూడవచ్చు. ఇక్కడ మీరు సృష్టించిన పేజీలన్నీ ఉంటాయి. సరైన కాలమును ఎంచుకుని సార్టింగు చేస్తే మొలకలను చూడొచ్చు. __చదువరి (చర్చరచనలు) 15:58, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]