వికీపీడియా:ఖాతా కోసం అభ్యర్థన/ఖాతా మార్గసూచీ/ReferToACC

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియా ఖాతా అభ్యర్థనకు మార్గసూచీ
ఖాతా కోసం అభ్యర్థించండి
స్వయంగా మీరే ఖాతాను సృష్టించుకోలేక పోతుంటే, ఈ ఫారం ద్వారా ఖాతా సృష్టించమని అభ్యర్థించవచ్చు.
ఖాతాను అభ్యర్థించేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి:
ఒక్క అభ్యర్థనను మాత్రమే సమర్పించండి
ఒకటికి మించి అభ్యర్థనలను సమర్పించడం వలన ప్రాసెస్‌ను నెమ్మదింప జేసే అదనపు తనిఖీలను మేం చెయ్యవలసి ఉంటుంది. ఖాతాను సృష్టించకముందే వాడుకరిపేరును మార్చుకోవాలని మీరు నిర్ణయించుకుంటే, కొత్త అభ్యర్థనను సృష్టించడానికి బదులుగా accounts-enwiki-l@lists.wikimedia.org కు ఈమెయిలు చెయ్యండి.
సరైన ఈమెయిలు చిరునామా ఇవ్వండి, ఆపై నిర్ధారించండి
ఖాతాను సృష్టించినప్పుడు మీరిచ్చిన ఈమెయిలు చిరునామాకు మీ లాగిన్ సమాచారాన్ని పంపిస్తాం. మీ ఖాతాను సృష్టించలేకపోతే, సంబంధిత సమాచారంతో ఆ ఈమెయిలు చిరునామాలో మిమ్మల్ని సంప్రదిస్తాము.
ఖాతా అభ్యర్థనను సమర్పించిన తర్వాత, మీ ఈమెయిలు చిరునామాను నిర్ధారించమని అడిగే ఈమెయిలు మీకు వస్తుంది. మీరు అభ్యర్థనను సమర్పించిన కొన్ని గంటలలోపు ఆ ఈమెయిలు మీకు అందకపోతే, మీ స్పామ్ ఫోల్డర్లో చూడండి. మీరు ఏదైనా మెయిలు వడపోత నియమాలను పెట్టుకుని ఉంటే, లేదా Gmail వర్గాలు విశేషాన్ని వాడుతోంటే, ఈమెయిలు దానంతటదే వేరే ఫోల్డరు లోకి లేదా వర్గం లోకి వెళ్ళిపోయి ఉండవచ్చు.
మీ అభ్యర్థన గురించి అదనపు సమాచారాన్ని ఇవ్వండి
నిరోధం వలన గానీ, ఇతర సాంకేతిక సమస్య వలన గానీ మీరు ఖాతాను సృష్టించుకోలేకపోతే, అభ్యర్థన వ్యాఖ్యలలో సమస్య గురించి సమాచారాన్ని ఇవ్వండి. మీ వాడుకరిపేరు బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నందున ఖాతాను సృష్టించలేకపోతే, మీరు వాడదలచిన వాడుకరిపేరు మా విధానానికి అనుగుణంగానే ఉందని మీరు ఎందుకు భావిస్తున్నారో వివరించాలి.

మీరు వికీపీడియాలో కృషి చెయ్యడంలో ఆసక్తి చూపుతున్నందుకు సంతోషంగా ఉంది. వీలైనంత త్వరగా మీకు సహాయం చేయాలని ఆశిస్తున్నాం.