విశ్వంభర (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశ్వంభర
దర్శకత్వంమల్లిడి వసిష్ఠ
రచనమల్లిడి వసిష్ఠ
డైలాగులు
  • సాయి మాధవ్ బుర్రా
నిర్మాత
  • ప్రమోద్ ఉప్పలపాటి
  • వి. వంశీ కృష్ణా రెడ్డి
  • విక్రమ్ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు
కూర్పు
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
౧౦ జనవరి 2025
దేశంభారతదేశం
భాషతెలుగు

విశ్వంభర మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో మరియు చిరంజీవి కథానాయకుడుగా నటిస్తున్న ఒక రాబోయే తెలుగు సోసియో-ఫాంటసీ  చలనచిత్రం.[1] ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి మరియు విక్రమ్ రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా  ఎం. ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తారు, మరియు కోటగిరి వెంకటేశ్వరరావు సంపాదకుడు. ఇది చిరంజీవి మరియు కీరవాణి కలిసి సహకారించిన నాలుగోవ చిత్రం.

తారాగణం[మార్చు]

నిర్మాణం[మార్చు]

23 అక్టోబర్ 2023న భాగ్యనగరంలో ముహూర్తం పూజ కార్యక్రమంతో విశ్వంభరాన్ని ప్రారంభించారు. అన్నపూర్ణ స్టూడియోస్లో 13 విభిన్న సెట్లు సృష్టిస్తారు, మరియు వాటి సృష్టిని కళ దర్శకుడు ఏ. ఎస్. ప్రకాష్ పర్యవేక్షిస్తారు.[3] ఫిబ్రవరి మొదటి వారంలో చిత్రాన్ని తీయడం ప్రారంభిస్తారు. సరిగమ సంస్థ ఓవర్సీస్ హక్కులు 18 కోట్లుకి కొనుక్కున్నారు.[4] ఈ చిత్రం 1990లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరికీ తరువాయి భాగం అని పుకార్లు తిరిగాయి, కానీ వసిష్ఠ తరువాత చెప్పారు దానికి విశ్వంభరకీ సంబంధం లేదు అని. విశ్వంభర కథానాయికగా త్రిష నటిస్తోంది.[5] ఇటీవల నల్గొండలో చిత్రీకరణ జరిగింది, కాని తరువాత భాగ్యనగరానికి వెళ్లారు షూటింగ్ పునఃప్రారంబించడానికి.[6]

ములాలు[మార్చు]

  1. Desk, Tupaki (2024-01-15). "మెగాస్టార్ విశ్వంభర టైటిల్ గ్లింప్స్.. స్టన్నింగ్ విజువల్స్". www.tupaki.com. Retrieved 2024-01-28.
  2. "Surbhi Puranik: మెగాస్టార్ సలహా మర్చిపోను.. విశ్వంభరపై సురభి కామెంట్స్". సమయం తెలుగు. Retrieved 26 ఫిబ్రవరి 2024.
  3. "చిరంజీవి 'విశ్వంభర' కోసం 13 సెట్లు.. విశ్వం అంతా కనపడేలా." టెన్ టీవీ. 20 జనవరి 2024. Retrieved 29 జనవరి 2024.
  4. "విశ్వంభర ఓవర్ సీస్ @ 18 కోట్లు". గ్రేట్ ఆంధ్ర. 29 జనవరి 2024. Retrieved 29 జనవరి 2024.
  5. "'విశ్వంభర' సెట్లో అడుగుపెట్టిన త్రిష .. వెల్ కమ్ చెప్పిన టీమ్!". ap7am.com. 2024-02-05. Retrieved 2024-02-18.
  6. వెలుగు, V6 (2024-02-29). "పాట చిత్రీకరణలో విశ్వంభర". V6 తెలుగు. Retrieved 2024-02-29.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)