విష్ణు దయాళ్ రామ్
విష్ణు దయాళ్ రామ్ | |
---|---|
పాలము ( లోక్‌సభ నియోజకవర్గం) | |
Assumed office 1 సెప్టెంబర్ 2014 | |
నియోజకవర్గం | పాలము (లోక్ సభ నియోజకవర్గం) |
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జార్ఖండ్ | |
In office 4 ఆగస్టు 2007 – 13 జనవరి 2010 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | నైనిజోర్, బక్సర్, బీహార్ | 1951 జూలై 23
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | శ్రీమతి పుష్ప దయాళ్ |
సంతానం | 3 |
నివాసం | రాంచీ, జార్ఖండ్, భారతదేశం |
కళాశాల | నెటార్‌హాట్ రెసిడెన్షియల్ స్కూల్, పాట్నా కాలేజ్ |
వృత్తి | సివిల్ సర్వెంట్ |
As of 15 డిసెంబర్, 2016 Source: [1] |
విష్ణు దయాళ్ రామ్, జార్ఖండ్ మాజీ డైరెక్టర్ జనరల్ పోలీస్, భారతీయ రాజకీయ నాయకుడు[1].
వ్యక్తిగత జీవితం[మార్చు]
విష్ణు దయాళ్ రామ్ 1951 జూలై 23న బీహార్‌లోని నైనిజోర్లో ముఖా రామ్, రమరతీ దేవి దంపతులకు జన్మించాడు. ఇతను బీహార్ కేడర్‌కు చెందిన 1973 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, 2005 జూలై 1 నుండి 2006 సెప్టెంబరు 27, 2007 ఆగస్టు 4 నుండి 2010 జనవరి 13 వరకు రెండుసార్లు జార్ఖండ్ పోలీస్ విభాగంలో డిజిపిగా పనిచేశాడు[2]. అతను అంతకు ముందు భాగల్పూర్ ఎస్పీగా, పాట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పనిచేశాడు. ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం 'గంగాజల్' విష్ణు దయాళ్ రామ్ జీవితం ఆధారంగా తీశారు[3].
రాజకీయాలు[మార్చు]
పదవీ విరమణ తర్వాత, ఇతను భారతీయ జనతా పార్టీలో చేరాడు, 2014 లోక్‌సభ ఎన్నికల్లో పాలము (లోక్‌సభ నియోజకవర్గం) నుండి గెలిచాడు. మళ్లీ 17వ లోక్‌సభ ఎన్నికలలో అదే స్థానం నుండి గెలుపొందాడు[3].
ఇతను పార్లమెంటరీ కమిటీలలో కూడా పనిచేశాడు.
- నీటి వనరులపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
- మెంబర్, కన్సల్టేటివ్ కమిటీ, బొగ్గు మంత్రిత్వ శాఖ సభ్యుడు
- విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు
- పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో భద్రతపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు
- హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు
- రూల్స్ కమిటీ సభ్యుడు
మూలలు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Members : Lok Sabha". 164.100.47.194. Retrieved 2022-09-03.
- ↑ "Ex-DGP Ram & 2 more IPS officers retire | Ranchi News - Times of India". The Times of India. Retrieved 2022-09-03.
- ↑ 3.0 3.1 "Former 'Gangajal' top cop Ram joins BJP | Ranchi News - Times of India". The Times of India. Retrieved 2022-09-03.