వేంకటరమణాచార్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:Madhava 04 copy.jpg

తిరుచానూరు సామవేదం వేంకట రమణాచార్యులు తెలుగు కవి, రచయిత.

జీవిత విశేషాలు[మార్చు]

అతను కర్నూలు జిల్లా, గోరంట్ల గ్రామంలో కేశమాంబ, వెంకటరంగాచార్యులు దంపతులకు 1942 జూలై 1న జన్మించాడు. ఉత్తర భారతదేశానికి చెందిన సంస్కృతాంధ్ర కవి,పండితుడు బొబ్బిలి వేంకటరమణ మూర్తి పర్యటన చేస్తూ ఆ సమయంలో గోరంట్లకు వచ్చాడు. కొన్ని సంవత్సరాలు వారు గోరంట్ల పరిసరప్రాంతాలలో ఉండి మాధవుడిపై "శ్రీ మాధవ ప్రబంధం" అనే గ్రంథం రాసాడు. ఆ గ్రంధం అలభ్యం. ఆ కవి రాసిన ఒక పద్యం మాత్రం లభించింది.  

"ఏనను మాట దుఃఖముల కెల్లనుబాట,సమస్తపాప సం

తానపుమూట,కామముఖ తస్కరులుండెడి పేట,నిట్లస

న్మానిత మౌట, నట్టిదగు మాటను నోటనునాటనీక,యో

మానసమా నిరంతరము మాధవు పాదము లాశ్రయింపుమా!!

బొబ్బిలి వేంకటరమణమూర్తిగారు సంస్థానంలోని రాజునెదిరించి, బహిష్కరణకు గురైనారని చెబుతారు. అతని సలహాతో కేశమాంబ, వెంకటరంగాచార్యులకు జన్మించిన శిశువుకు తనపేరుపెట్టమని సూచన చేయగా "వేంకటరమణ" అని నామకరణం చేశారు. అతనికి బాల్యంలోని వారి పెద్దల ద్వారా రామాయణ మహాభారత కావ్యాలను వినే భాగ్యం కలిగింది. వినాయక చతుర్ధి రోజు జన్మించిన బాలకుడు వేంకటరమణయ్యకు బాల్యం నుండే అనేక విఘ్నాలు కలిగాయి. నిరుపేద కుటుంబం కావడంతో చదువుకోవాలనే తపన ఉన్నా ఆర్థిక పరిస్థితులు ప్రతిబంధకంకాసాగాయి. పూర్వ ప్రాథమిక విద్య రామాయణ భారత భాగవత గ్రంథాలను పసితనం నుండి వారి తండ్రిగారి ద్వారా,గురుతుల్యులు వేంకటరమణమూర్తి ద్వారా వంట పట్టించుకున్నాడు. 1 నుండి 5 వ తరగతి వరకు చదివే  సమయంలో లద్దగిరి  నివాసి పరమ భాగవతోత్తములు తెలుగు భాషా పండితులు ఉలితెన్న ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. వారికి ప్రియ శిష్యుడుగా వేంకటరమణ విద్యనభ్యసించాడు భాగవతంలోని  పద్యాలు(గజేంద్ర మోక్షం, ప్రహ్లాదచరిత్ర, నృసింహావిర్భావం,రుక్మిణీ కల్యాణం లోని కొన్ని ఘట్టాలు) నేర్చుకోవాలని విద్యార్థులను ఆదేశించారు అప్పుడు ఆ బాలుడు పై భాగవత పద్యాలను ఒక్కరోజులోనే నేర్చుకుని అప్పచెప్పడం అక్కడున్న ఉపాధ్యాయులను ఆశ్చర్యానికి గురిచేసింది. గురువు గారు అభినందించి అక్కున చేర్చు కోవడం జరిగిపోయింది. తన శిష్యుడికి ప్రత్యేకించి అమరము,ఆంధ్రము కూడా నేర్పించారు శ్రీ ఉలితెన్నగారు.

బాల్యం నుండే పద్య రచనను ప్రారంభించారు.ఎయిట్ స్టాండర్డ్ పూర్తయిన తర్వాత తెలుగు పై ఉన్న మక్కువతో తెలుగు విశారద, ఎ విద్వాన్ పూర్తి చేయడం జరిగింది. వీరు 25.11.2007 న మెదడు సంబంధ క్యాన్సర్ వ్యాధితో పరమపదించారు.