వైకల్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంకవైకల్యుడు

అంగాలలో (అవయవములలో) లోపాలు ఉన్నట్లయితే దానిని అంగవైకల్యం అంటారు. అంగవైకల్యం ఉన్న మానవులను వికలాంగులు అంటారు. పుట్టుకతోనే కొందరికి అంగవైకల్యం సంభవిస్తే, మరికొందరికి పుట్టిన తరువాత అంగవైకల్యం సంభవిస్తుంది.

మేనరికము వలన శారీరక వైకల్యము[మార్చు]

రక్త సంబంధీకుల మధ్య జరిగే వివాహాలను మేనరికం అంటారు. ఈ విధమైన వివాహముల వలన రాబోయే తరం ప్రభావితమవుతుంది. అట్టి పరిస్థిలలో మార్పు చెందిన జన్యువు (డిఫెక్టివ్ జీన్) భార్య భర్తలిద్దరిలోనే ఉన్నట్లైతే వాటి కలయిక వలన వారికి పుట్టిన బిడ్డలలో శారీరక అంగవైకల్యం లేక ఇతర జన్యు సంబంధమైన లోపములు ఉండే అవకాశము ఎక్కువ. ఈ అవకాశం మేనరికములలో ఎక్కువ.

గణాంకాలు[మార్చు]

భారత ప్రభుత్వ గణాంకాల (2001) ఆధారంగా మన దేశంలో సుమారు 2.19 కోట్ల మంది వికలాంగులుండగా అందులో సుమారు 13.65 లక్షల మంది వికలాంగులు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నివసిస్తున్నారు.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

వికలాంగులు

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "State-wise data of disabled population, as per Census 2001". Ministry of Social Justice and Empowerment. Archived from the original on 6 మార్చి 2016. Retrieved 22 February 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=వైకల్యం&oldid=4139000" నుండి వెలికితీశారు