శ్రీపాద కామేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీపాద కామేశ్వరరావు (1877 - మార్చి 3, 1943) సుప్రసిద్ధ రంగస్థల నటుడు, అనువాద నాటక కర్త, ప్రయోక్త. వీరు మరాఠీ, ఒరియా, తమిళ, ఫ్రెంచి, పంజాబీ నాటకలాల్ను ఆంధ్రావళికి అనువదించి అందించారు.

జననం[మార్చు]

వీరు విజయనగరంలో ఉమామహేశ్వరరావు, నరసమ్మ దంపతులకు జన్మించారు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

వీరు 1908లో రాజమండ్రి ఎమెచ్యూర్ నాటక సమాజం స్థాపించి 10 సంవత్సరాలకు పైగా నడిపించారు.[1] నాటకాల్లో పద్యం ఉండడం వీరికి నచ్చేది కాదు. ఇతడు గొప్ప నటుడిగా కూడా చిరస్మరణీయుడు. పేరిగాడు, కీచకుడు, అశ్వత్థామ, రాణా ప్రతాప్, చాణక్య భూమికలకు ప్రాణం పోశాడు. తన నాటకాలలో వ్యవహార భాషనే ఉపయోగించారు. వీరు అభినవాంధ్ర గ్రంథమాల స్థాపించి స్వీయ రచనలతో పాటు ఇతరుల పుస్తకాల్ని కూడా ముద్రించారు.

మరణం[మార్చు]

వీరు 1943, మార్చి 3న తేదీన కాలంచేశారు.

రచనలు[మార్చు]

  • సాహిత్య మీమాంస (1926)
  • నాటక మీమాంస
  • చంద్రగుప్త [2]
  • సోహ్రాబు - రుస్తుం
  • సీత
  • రాణా ప్రతాపసింహ
  • బిల్వమంగళ (1927)
  • లీలావతి సులోచన
  • పునర్వివాహం
  • తగిన శాస్తి (1929)
  • విమానం
  • పరీక్షలు
  • భారత రమణి (1926)

మూలాలు[మార్చు]

  1. కామేశ్వరరావు, శ్రీపాద, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ: 77.
  2. రాయ్, ద్విజేంద్రలాల్ (1926). చంద్రగుప్త. Translated by శ్రీపాద కామేశ్వరరావు. చెఱకువాడ వేంకటరామయ్య. Retrieved 2020-07-02.