సాజిదా ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాజిదా ఖాన్
జననం1980
జాతీయత భారతీయురాలు
వృత్తిఆడియో ఇంజినీర్‌

సాజిదా ఖాన్‌ భారతదేశానికి చెందిన తొలి మహిళా ఆడియో ఇంజినీర్‌.[1] ఆమె రాష్ట్రపతి అవార్డుతో పాటు, 2018లో తెలంగాణ ప్రభుత్వం నుండి విశిష్ట మహిళా అవార్డును అందుకుంది.[2][3][4]

జననం, విద్యాభాస్యం[మార్చు]

సాజిదా ఖాన్ తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, మల్కాజ్‌గిరి మండలం, మౌలాలిలో జన్మించింది. ఆమె ఇంటర్మీడియట్ తర్వాత కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిప్లొమా, అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో పీజీ పూర్తి చేసింది.

వృత్తి జీవితం[మార్చు]

సాజిదా ఖాన్ తన చిన్నతనంలో రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమాలకు, జానపద సంగీత పోటీల్లో పాల్గొనడానికి వెళ్లే క్రమంలో ఆమె జానపద వాయిద్యాలు వాయించడంపై ఆసక్తి ఉండడంతో కొంతకాలం వీణ వాయించడం నేర్చుకుంది. ఆమె ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తరువాత గీతాంజలి మ్యూజిక్ స్టూడియోస్‌లో చేరి సంగీతంపై తనకున్న ఆసక్తిని వృత్తిగా మార్చుకుంది. ఆమె ఆడియో ఇంజినీరింగ్‌పై కోర్సులను పలు ఇన్‌స్టిట్యూట్‌లలో పూర్తి చేసిన తర్వాత స్టూడియోలలో డబ్బింగ్ నుండి రికార్డింగ్, ఆడియో మిక్సింగ్ వరకు పనిచేయడం ప్రారంభించింది.

సాజిదా ఖాన్ దాసరి నారాయణరావు, తేజ, పూరి జగన్నాధ్ వంటి సినిమా దర్శకుల వద్ద పని చేసి భోజ్‌పురి సినిమాలకు డబ్బింగ్ నిర్వహించింది. ఆమె మ్యూజికల్ ఆల్బమ్‌లు (రాజకీయ, భక్తి), జింగిల్స్, టెలి సీరియల్స్, డాక్యుమెంటరీలు, ఆల్ ఇండియా రేడియో రికార్డింగ్‌లు, రేడియో సీరియల్‌లు, నామినేషన్ వర్గాలకు సీక్వెన్స్‌లను రూపొందించే అవార్డు షోల కోసం పని చేసింది. సాజిదా 2018లో స్వంత స్టూడియో 6HTZని ప్రారంభించి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజం ప్రకటనల కోసం పని చేసింది.[5][6][7][8]

మూలాలు[మార్చు]

  1. Namaste Telangana (21 July 2023). "తొలి మహిళా ఆడియో ఇంజనీర్‌గా రికార్డు సృష్టించడం వెనుక ఉన్న కథ ఇదీ!". Archived from the original on 13 February 2024. Retrieved 13 February 2024.
  2. The News Minute (13 January 2020). "Meet Hyderabad's Sajida, trailblazer for women audio technicians in the country" (in ఇంగ్లీష్). Archived from the original on 13 February 2024. Retrieved 13 February 2024.
  3. ఈనాడు, తెలంగాణ. "ప్రతిభావంతులైన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు". www.eenadu.net. Archived from the original on 28 ఏప్రిల్ 2020. Retrieved 28 April 2020.
  4. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (9 March 2019). "మహిళల ఆలోచనలకు అండగా నిలువాలి". Archived from the original on 9 March 2019. Retrieved 9 March 2019.
  5. The Hindu (11 March 2019). "Hitting all the right notes" (in Indian English). Archived from the original on 13 February 2024. Retrieved 13 February 2024.
  6. Sakshi (11 February 2018). "సాజిదా... సౌండ్‌ ఆఫ్‌ సక్సెస్‌". Archived from the original on 13 February 2024. Retrieved 13 February 2024.
  7. The New Indian Express (3 September 2015). "From Behind the Console" (in ఇంగ్లీష్). Archived from the original on 13 February 2024. Retrieved 13 February 2024.
  8. Deccan Chronicle (24 January 2020). "Mistress of sound" (in ఇంగ్లీష్). Archived from the original on 13 February 2024. Retrieved 13 February 2024.