జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఇదివరకు నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న 4 శాసనసభా నియోజకవర్గములు ఈ నియోజకవర్గంలో కలిపారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న కామారెడ్డి, ఎల్లారెడ్డి శాసనసభా నియోజకవర్గములు కూడా ఈ నియోజకవర్గంలో భాగమయ్యాయి. సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గ స్థానే ఏర్పాటు చేసిన ఈ నియోజకవర్గంలో మెదక్ జిల్లాకు చెందిన 3 శాసనసభా నియోజకవర్గములు (జహీరాబాదు, ఆందోల్, నారాయణ్‌ఖేడ్) ఉండగా నిజామాబాదు జిల్లాకు చెందిన కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ లతో కలిపి మొత్తం 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి.తెలంగాణాలోని 33 జిల్లాలలో జిల్లా కేంద్రము కాని పార్లమెంటు రెండు స్థానాలు చేవెళ్ళ, జహీరాబాదు. 2019 లో జరిగిన 17 వ లోక్ సభ ఎన్నికల్లో బి. బి. పాటిల్ గెలుపొందాడు.
దీని పరిధిలోని శాసనసభా నియోజకవర్గములు[మార్చు]
- జుక్కల్ శాసనసభ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- బాన్స్వాడ శాసనసభ నియోజకవర్గం
- ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం
- కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం
- నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం
- ఆంధోల్ శాసనసభ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- జహీరాబాదు శాసనసభ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]
- 2001 లెక్కల ప్రకారము జనాభా: 18,35,612 [1]
- ఎస్సీ, ఎస్టీల శాతం: 17.61%, 7.72%.
- ఓటర్ల సంఖ్య: 12,53,670.
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2019[2] 5 జహీరాబాదు జనరల్ బి. బి. పాటిల్ పు టీఆర్ఎస్ 434244 కె. మదన్ మోహన్ రావు పు కాంగ్రెస్ 428015 2014 5 జహీరాబాదు జనరల్ బి. బి. పాటిల్ పు టీఆర్ఎస్ 508661 సురేష్ కుమార్ షెట్కర్ పు కాంగ్రెస్ 364030 2009 5 జహీరాబాదు జనరల్ సురేష్ కుమార్ షెట్కర్ పు కాంగ్రెస్ 395767 సయ్యద్ యూసుఫ్ ఆలీ పు తె.రా.స 378360
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున శివకుమార్ లింగాయత్ పోటీ చేసారు.[3] పొత్తులో భాగంగా మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సయ్యద్ యూసఫ్ అలీ పోటీలో ఉన్నాడు.[4] కాంగ్రెస్ పార్టీ టికెట్ సురేశ్ షెట్కార్‌కు లభించింది.[5] సురేశ్ సమీప తె.రా.స పార్టీ పత్యర్థి అయిన యూసుఫ్ ఆలీ పై విజయం సాధించాడు.
2024 ఎన్నికలు[మార్చు]
2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానం నుండి మొత్తం 19 మంది పోటీలో ఉన్నారు.[6]
మూలాలు[మార్చు]
- ↑ http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92600&subcatid=4&categoryid=3
- ↑ Firstpost (2019). "Zahirabad Elections 2019: Telangana Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
- ↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 28-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ EENADU (30 April 2024). "జహీరాబాద్ బరిలో 19 మంది". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.