అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవము
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవము
విద్యార్థులకు ఉపాధ్యాయుడు లాటిన్ వర్ణమాలను బోధిస్తున్నట్లుగా ఉన్న విగ్రహం
జరుపుకొనేవారుప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయ సంస్థలు
జరుపుకొనే రోజుఅక్టోబర్ 5
సంబంధిత పండుగఉపాధ్యాయుల దినోత్సవం
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు

ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 5వ తేదిన ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో విద్యాలయాలలో వేడుకగా నిర్వహిస్తారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని 1994వ సంవత్సరం నుండి అక్టోబరు 5వ తేదిన జరుపుకుంటున్నారు. ఈ రోజున ఒక విద్యా సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులు లేక పలు విద్యాసంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులు ఒకచోట సమావేశమై తమ భవిష్యత్ తరాలకు కావలసిన ఏర్పరుచుకోవాల్సిన పలు అంశాలపై చర్చిస్తారు. ఇందుకోసం తమ అందరి మద్దతుతో హామీలను పొందెందుకు సన్నద్ధమవుతారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవమునే కొన్ని దేశాలలో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]