అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్
Amazon Web Services Logo.svg
వెబ్ చిరునామాaws.amazon.com
రకంఅమెజాన్ అనుబంధ సంస్థ
ప్రారంభం2006 మార్చి; 15 సంవత్సరాల క్రితం (2006-03)[1][2]
ఆదాయంIncrease $35.03 billion (2019)[3]
ప్రస్తుత స్థితిActive

అమెజాన్ వెబ్ సర్వీసెస్ లేదా AWS అనునది అమెజాన్ (కంపెనీ) సంస్థ యొక్క అనుబంధ సంస్థ. వీరు ప్రప్రంచ ప్రసిద్ధి గాంచిన క్లౌడ్ ఆధారిత కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సేవలను అందిస్తున్నారు.

నేపధ్యము[మార్చు]

అమెజాన్‌ను స్థాపించిన జెఫ్ బెజోస్‌ ఈ వెబ్‌ సర్వీసెస్‌ ఆలోచనకు మూలకారకుడు. ఏడబ్ల్యూఎస్‌ ప్రస్తుత రూపానికి రాకముందు మిగతా అన్ని వెబ్‌సైట్లలాగా ‘అమెజాన్‌ బ్యాక్‌ ఎండ్‌ టెక్నాలజీ’గా మాత్రమే ఉండేది. అంటే ప్రతి కంపెనీ తన వెబ్‌సర్వర్లను నడిపినట్టుగానే అమెజాన్‌ సొంత సర్వర్లతో పనిచేసుకునేది.

ఒకసారి బెజోస్ కు ఒక ఆలోచన వచ్చింది. తన సంస్థలోని యాడ్స్‌ విభాగం సేల్స్‌ గణాంకాలను ఆ విభాగం వారిని అడిగి, ఈమెయిల్‌ ద్వారా తెప్పించుకోవడం కన్నా సెంట్రల్‌ డేటా నుంచి తీసుకునేలా ఏర్పాటు చేయాలన్నది ఆ ఆలోచన. ఆ తర్వాత అది కేవలం తమ అంతర్గత అవసరాలకే కాకుండా, బోలెడన్ని కంపెనీలకూ ఉపయోగపడేలా ఉంటే? అన్న ఆలోచన వచ్చింది. అదే అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్ కు మూలం.

2002లో జూలైలో అలా ఏడబ్ల్యూఎస్‌ మొదలైంది. 2006 నుంచి బయటి ప్రపంచానికి అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్ లోకి దారులు తెరుచుకున్నాయి. సాంకేతికంగా ఆలోచిస్తే అమెజాన్‌ వెబ్‌సైట్‌ చేస్తున్న పని కూడా అదే. ఎవరి కంపెనీ కోసం వారు వెబ్‌సైట్‌ రూపొందించుకోవడం కాకుండా అందరు రిటైలర్లూ వచ్చి అమెజాన్‌ వెబ్‌సైట్‌లో వస్తువులను అమ్ముకుంటున్నారు. అక్కడ భౌతికంగా కనపడే వస్తువులను అమ్మితే వెబ్‌ సర్వీసెస్ లో సేవలను అమ్ముతారంతే.

ప్రారంభము[మార్చు]

ప్రారంభించిన మొదట్లో ఏడబ్ల్యూఎస్‌ అంటే కేవలం అమెజాన్‌ కంప్యూటర్లలో కొంత స్థలాన్ని కొనుక్కోవడం మాత్రమే. కానీ, కాలక్రమంలో ఏడబ్ల్యూఎస్‌ నాలుగు సేవలను అందించడం ప్రారంభించింది. అవి స్టోరేజ్‌, కంప్యూటింగ్‌, డేటాబేస్‌, ఇంటర్నల్‌ మెసేజింగ్‌. వీటిలో మొదటి రెండింటినీ ‘అమెజాన్‌ ఎస్‌3’గా వ్యవహరిస్తారు.

అంటే సింపుల్‌ స్టోరేజ్‌ సర్వీస్‌. నిజానికి ఏడబ్ల్యూఎస్‌ రాకముందు ఇలా చేయాలంటే చాలా పెద్ద తతంగం ఉండేది. తగిన సర్వీస్‌ ప్రొవైడర్‌ను వెతుక్కోవడం, మన సేవలకు అవసరమయ్యే స్పెసిఫికేషన్లు ఉన్న సర్వర్లను ఎంచుకోవడం.. ఇదంతా కష్టంగా ఉండేది. అమెజాన్‌ వాటన్నింటినీ సులభతరం చేసింది. 2016 నాటికి దాదాపు 13 లక్షల సర్వర్లను ఉపయోగించి అమెజాన్‌ తన వెబ్‌ సర్వీసెస్ ను అందించేది. ఆ తర్వాత సర్వర్ల సంఖ్య ఇంకా పెరిగింది. వాటి ద్వారా దాదాపు 190 దేశాల్లో కొన్ని లక్షల మంది ఏడబ్ల్యూఎస్‌ సేవలను వినియోగించుకుంటున్నారు.

ఖాతాదారులు[మార్చు]

అశోక్‌ లేలాండ్‌, ఆదిత్య బిర్లా కేపిటల్‌, యాక్సిస్‌ బ్యాంకు, క్లియర్‌ ట్యాక్స్‌, హెచ్‌డీఎఫ్ సీ లైఫ్‌, మహీంద్రా ఎలక్ట్రిక్‌ ఓలా, ఓయో, నేషనల్‌ కమోడిటీ అండ్‌ డెరివేటివ్స్‌ ఎక్స్ఛేజీ ఈ-మార్కెట్స్‌ లిమిటెడ్‌ వంటి అనేక కంపెనీలు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌‌ సేవలను వినియోగించుకుంటున్నాయి. తమ కీలకమైన వర్క్‌, డేటాను క్లౌడ్‌ ఫ్లాట్‌ఫారమ్‌కు తరలిస్తున్నాయి. నేషనల్‌ కమోడిటీ అండ్‌ డెరివేటివ్‌ ఎక్స్ఛేంజీ 50 అప్లికేషన్లను ఏడబ్ల్యూఎస్‌ క్లౌడ్‌కు బదిలీ చేసింది. హెచ్‌డీఎఫ్ సీ లైఫ్‌ సైతం కీలకమైన అప్లికేషన్లను ఏడబ్ల్యూఎస్ కు బదిలీ చేసింది.

డీఎస్ పీ ఇన్వెస్ట్ మెంట్‌ మేనేజర్స్‌ 2019 లో 50 అప్లికేషన్లను ఏడబ్ల్యూఎస్‌ క్లౌడ్‌ ద్వారా నిర్వహిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన యప్‌ టీవీ ఓవర్‌-ద-టాప్‌ (ఓటీటీ) సేవలకు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ సేవలను ఎంచుకుంది.  దేశంలోని అనేక స్టార్టప్ లు, చిన్న, మధ్య స్థాయి వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు, విద్యా సంస్థలు, ఎన్‌జీఓలు ఏడబ్ల్యూఎస్‌ ఖాతాదారులుగా ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Amazon Web Services About Us". September 2011. Retrieved May 16, 2012.
  2. "Amazon - Press Room - Press Release". phx.corporate-ir.net. Retrieved June 8, 2017.
  3. "Annual revenue of Amazon Web Services from 2013 to 2019". Statista. February 2, 2020.