Jump to content

అలంకార చంద్రోదయం

వికీపీడియా నుండి
(అలంకార చంద్రోదయము నుండి దారిమార్పు చెందింది)

అలంకార చంద్రోదయం ఇమ్మానేని శరభలింగ కవి రచించిన పద్యకావ్యం. దీనికి మఖవ్రజ చరిత్రము అనే నామాంతరం ఉన్నది. దీని మొదటికూర్పు 1906 వ సంవత్సరం భైరవ ముద్రణాలయములో ముద్రించబడినది.

రచయిత

[మార్చు]

ఇమ్మానేని శరభలింగకవి న్యాయవేత్తగా ఉద్యోగం చేస్తూనే స్వతాహాగా అబ్బిన సాహిత్యాభిలాష వల్ల కవిత్వరచన అలవడింది. ఆయన రచించిన ఈ కావ్యాన్ని కావ్యరచన అనంతరం శరభలింగ కవి కుమారుడు ఇమ్మానేని వీరేశలింగం అప్పటి ప్రముఖ కవి, శతావధాని చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిచే పరిష్కరింపజేసుకుని ప్రకటించారు. గ్రంథాదిలో క్లుప్తంగా కవి చరిత్ర కూడా లభిస్తోంది.

ఈకవి పూర్వీకులు మంచి ఉద్యోగములు చేసి గుర్తింపు పొందిరి. ఇతని వంశం వారు సబ్ జడ్జీ ఉద్యోగము మొదలైన గౌరవము పొందినారు. ఇతను కూడా ఉద్యోగము చేస్తూనే సాహిత్యకారునిగా గుర్తింపు పొందాడు. ఇతను వెలమ కులమునకు చెందినవాడు. చిన్నతనంలో అతను విద్యాశక్తితో కాశికి పోయి సంస్కృతాన్ని అభ్యసించాడు. ఇతను ఈ గ్రంథమును బ్రకృత కవివరుని ప్రథమ పుత్రుడైన వీరేశలింగమునకు చూపిరి. చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి ఈ మూలాగ్రముగ చూసి ముద్రణకు పురిగొల్పిరి. ఈ కవి 1903 మే 23 వరకు జీవించాడు.

బయటి లింకులు

[మార్చు]