ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే

వికీపీడియా నుండి
(ఆంధ్ర ప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

2018-19[మార్చు]

2018-19 సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే జులై 12తేదీన బడ్జెట్ లో భాగంగా విడుదల చేశారు. [1]

2017-18[మార్చు]

2017-18 సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే [2] [3] మార్చి 8 2018న అసెంబ్లీలో ప్రవేశపెట్టబడింది. రాష్ట్రంలో అసమానతలను తొలగించి ప్రజలకు ఆరోగ్యం, సంపద, మెరుగైన మౌలిక సదుపాయలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది

ముఖ్యాంశాలు
 • రాష్ట్ర విస్తీర్ణం 1,62,970 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో 8వ అతిపెద్ద రాష్ట్రం.
 • దేశంలో ఎక్కువ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో ఉన్న కోస్తా తీర ప్రాంతం పొడవు 974 కిలోమీటర్లు.
 • రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 36,909.38 చదరపు కిలోమీటర్లు. మొత్తం విస్తీర్ణంలో ఇది 23.04 శాతం. అటవీ విస్తీర్ణం పరంగా 9వ స్థానంలో ఏపీ.
 • జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో 10వ అతిపెద్ద రాష్ట్రం.
 • పండ్లు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్.
 • మిర్చి, కోకో, నిమ్మ, ఆయిల్‌పామ్, బొప్పాయి, టమోటా ఉత్పాదకతలోను తొలి స్థానం.
 • జీడిమామిడి, మామిడి, బత్తాయి ఉత్పాదకతలో రెండో స్థానంలో ఏపీ.
 • గడచిన మూడేళ్లలో రాష్ట్రం సగటున 11 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇదే కాలంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7.31 శాతంగా ఉందని వివరించింది.
 • రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,42,054 :ప్రస్తుత ధరలను పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2017-18కి రూ.1,42,054. 2015-16లో ఉన్న విలువ రూ.1,23,664తో పోలిస్తే తలసరి ఆదాయంలో 14.87 శాతం వృద్ధి నమోదైంది. అదే 2011-12 బేస్ ఇయర్ నాటి స్థిర ధరల ప్రకారం లెక్కిస్తే తలసరి ఆదాయం 10.55 శాతం వృద్ధితో రూ.96,374 నుంచి రూ.1,06,545కు చేరింది.
 • పన్నుల ఆదాయంలో 20 శాతం వృద్ధి : 2016-17లో రూ.44,181 కోట్లుగా ఉన్న సొంత పన్నుల ఆదాయం.. ఈ ఏడాది రూ.52,717 కోట్లకు చేరింది. ఇదే సమయంలో సొంత పన్నేతర ఆదాయంలో 34 శాతం వృద్ధి నమోదైంది. 2016-17లో రూ.3,989 కోట్లుగా ఉన్న ఆదాయం..రూ.5,347 కోట్లకు పెరిగింది. మొత్తానికి రాష్ట్ర సొంత ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.48,170 కోట్ల నుంచి రూ.58,064 కోట్లకు చేరింది.
 • జీవీఏలో వ్యవసాయం వాటా 5.38 శాతంగా, వ్యవసాయ, అనుబంధరంగాలతో కూడిన వాటా 34.37 శాతంగా, సేవల వాటా 43.55 శాతంగా, పరిశ్రమల వాటా 22.09శాతంగా అంచనా వేశారు. 2017-18 ఆర్థిక సామాజిక సర్వే గణాంకాల ప్రకారం. రాష్ట్ర స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో వ్యవసాయం, సేవలు, పరిశ్రమల రంగాల వాటా క్షీణించింది. 2016-17 తుది అంచనాల ప్రకారం జీవీఏలో వ్యవసాయం (అనుబంధ రంగాలు కాకుండా) వాటా 5.93 శాతంగా ఉంటే అది 2017-18లో 5.38 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. 2016-17లో రూ. 6,34,742 కోట్లుగా ఉన్న జీవీఏ 2017-18లో 15.9 శాతం పెరిగి రూ.7,35,709 కోట్లకు చేరుతుంది. ఇదే సమయంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీవీఏకి పన్నుల ఆదాయం కలిపి దానిలోంచి సబ్సిడీలు తీయగా వచ్చే విలువ) రూ.6,95,491 కోట్ల నుంచి రూ.8,03,873 కోట్లకు చేరనుంది.
 • రాష్ట్రం నుంచి ప్రధాన ఎగుమతులు - ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాణాధార మందులు, ఖనిజాలు, ఖనిజ ఉత్పత్తులు, సాఫ్ట్‌వేర్. వీటి విలువ 2016-17 లో రూ.80,559.87 కోట్లు కాగా, 2017-18(నవంబర్ వరకు) రూ. 50,404.75 కోట్లున్నాయి.
 • 2016-17లో 5,07,43,000గా ఉన్న రాష్ట్ర జనాభా గడచిన ఏడాది లో 0.58 శాతం(2,98,000 పెరుగుదల) వృద్ధితో 5,10,41,000కు చేరుకుంటుంది. రాష్ట్రం విడిపోయేనాటికి రాష్ట్ర జనాభా 5,01,51,000. ఈ మూడేళ్లలో ఏటా సగటున 2.96 లక్షల చొప్పున, జనాభా సంఖ్య 8.90 లక్షలు పెరిగింది.
 • గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి దేశీయ వినియోగదారుల ధరల సూచీ 134 పాయింట్లుగా ఉంటే.. మన రాష్ట్రంలో మాత్రం 139 పాయింట్లుగా ఉంది. 2016-17తో పోలిస్తే 2017-18లో ఉల్లిపాయలు, చింతపండు ధరలు భారీగా పెరగినవి. కందిపప్పు, ఎండుమిర్చి ధరలు స్వల్పంగా తగ్గిననవి.
 • గత ఏడాది లో పురుషుల కూలి రేట్లు 5.52 శాతం, మహిళల కూలి రేట్లు 8.47 శాతం పెరిగింది. పురుషుల సగటు కూలి రేటు రూ.299.88 నుంచి రూ.316.44కి పెరగ్గా, మహిళల సగటు కూలి రేటు 214.75 నుంచి 232.96కు పెరిగింది. రాష్ట్రంలో వడ్రంగి కార్మికులుం అత్యధిక సగటు కూలి 348.67 పొందుతుంటే, చర్మకారులు అత్యల్ప మొత్తం రూ.271.79 పొందుతున్నారు.
 • గతేడాదితో పోలిస్తే పప్పు దినుసుల సాగు విస్తీర్ణం 14,13,000 హెక్టార్ల నుంచి 13,71,000 హెక్టార్లకు పడిపోయింది. దిగుబడి 9,31,000 టన్నుల నుంచి 11,44,000 టన్నులకు పెరగనుంది. అలాగే నూనె గింజల సాగు 12,30,000 హెక్టార్ల నుంచి 9,14,000 హెక్టార్లకు తగ్గింది. కాని దిగుబడి మాత్రం 24,91,000 టన్నుల నుంచి 29,11,000 టన్నులకు పెరగనుంది.. ఖరీఫ్, రబీ కలిపి వరి సాగు 5,85,000 హెక్టార్ల నుంచి 6,75,000 హెక్టార్లకు పెరిగింది. కాని దిగుబడి మాత్రం 1,20,03,000 టన్నుల నుంచి 1,20,77,000 టన్నులు మాత్రమే వస్తుంది.
 • 2014 మార్చి నాటికి రాష్ట్రంలో 70.02 లక్షల వాహనాలుండగా, గతేడాది నవంబర్‌కల్లా ఈ సంఖ్య 1.03 కోట్లకు పెరిగింది. ఇందులో ద్విచక్ర వాహనాలే 81 లక్షలు. 2014లో 54,31,832 ద్విచక్ర వాహనాలు, 5,09,581 ఆటోలు, 6,26,722 సరకు రవాణా వాహనాలు, కార్లు 6,37,461, కాంట్రాక్టు క్యారియర్ వాహనాల సంఖ్య 3,816 కు చేరుకున్నాయి.

ఇవీ చూడండి[మార్చు]

వనరులు[మార్చు]

 1. "SOCIO ECONOMIC SURVEY 2018-19" (PDF). 2019-07-11. Archived from the original (PDF) on 2019-07-15. }}
 2. "Socio Economical Survey 2017-18" (PDF).
 3. "ఆంధ్ర ప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2017-18". Archived from the original on Sep 12, 2018.