పాల వెల్లువ

వికీపీడియా నుండి
(ఆపరేషన్ ఫ్లడ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

'పాల వెల్లువ లేదా ఆపరేషన్ ఫ్లడ్', 1970ల్లో నేషనల్ డైరీ డవలప్మెంట్ బోర్డు ప్రారంభించిన ప్రాజెక్టు, ఇది ప్రపంచంలోకెల్లా పాడి పరిశ్రమ అభివృద్ధిలో అతిపెద్ద కార్యక్రమం[1] ఆపరేషన్ ఫ్లడ్ లేదా పాలవెల్లువనే శ్వేతవిప్లవంగా పరిగణిస్తున్నారు. ఇది భారతదేశాన్ని పాల కొరతతో బాధపడుతున్న స్థితి నుంచి ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మలచింది, ఈ క్రమంలో అమెరికా, న్యూజిలాండ్ వంటి పాల ఉత్పత్తిలో అగ్రగామి దేశాలను భారత్ దాటుకుపోయింది.[2] ప్రాజెక్టు ఫలితంగా భారతదేశ పాల ఉత్పత్తి 2010-11 నాటికి ప్రపంచ ఉత్పత్తిలో 17 శాతానికి చేరుకుని, 30 ఏళ్ళ వ్యవధిలో ప్రతి భారతీయునికీ పాల లభ్యత రెట్టింపు అయింది.[3] అలాగే పశువుల పెంపకం-పాల ఉత్పత్తి భారతదేశంలో స్వయం-సమృద్ధి కల గ్రామీణ ఉపాధి రంగాల్లో అతిపెద్దదిగా నిలబెట్టింది.[4] ఈ ప్రాజెక్టు వ్యవసాయదారులను తమ అభివృద్ధిని తామే మలుచుకోగలిగేలా, తాము తయారుచేసే ఉత్పత్తికి సంబంధించిన అంశాలు తామే నియంత్రించుకోగలిగేలా తయారుచేసేందుకు ప్రారంభించారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Singh, Katar (1999). Rural Development: Principles, Policies and Management. New Delhi: SAGE. p. 201. ISBN 81-7036-773-5.
  2. "India largest milk producing nation in 2010-11: NDDB". Hindustan Times. 2011-12-20. Retrieved 2012-09-09.
  3. Kurien, Verghese (2007). "India' s Milk Revolution: Investing in Rural Producer Organizations". In Narayan, Deepa; Glinskaya, Elena (ed.). Ending Poverty in South Asia: Ideas that work. Washington D.C., USA: (The World Bank). p. 52. ISBN 0-8213-6876-1. Retrieved 11 September 2012.CS1 maint: multiple names: editors list (link)
  4. Pendleton, Andrew; Narayanan, Pradeep. "The white revolution : milk in India" (PDF). Taking liberties: poor people, free trade and trade justice. Christian Aid. p. 35. Retrieved 11 September 2012.