ఆహారపు గొలుసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆహారపు గొలుసు (Food Chain ) అనేది ఏ జీవావరణ వ్యవస్థలోనైనా వృక్షాలు, జంతువులు ఒకదాని పై మరొకటి ఆధారపడి ఉండే ఒక ప్రక్రియ. ఆ జీవసముదాయము ఆహారపు గోలుసును ఏర్పరుస్తాయి. ఒకదానితో ఒకటి ఏ విధంగా లంకెపడి ఉంటుందో వాటికి అవసరమయ్యే పోషక పదార్ధముల మీద ఆవిధంగా ఆధారపడి ఉంటాయి మొక్కలలోని మూల ఆహారశక్తి జంతువులలోకి, ఇవి ఒకదానిని మరొకటి తినడం వల్ల జక జంతువు నుండి మరొక జంతువుకు రవాణా అవుతుంది.సజీవులన్నీ  (మొక్కలు కాకుండా ) ఆహారం కోసం ఒకరిపై మరొకరు ఆధారపడి ఒక  గొలుసులాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి.[1] మొక్కలు పరాగ సంపర్కకారులైన కీటకాలలో ఒకటి నశిస్తే మరొకటి నశిస్తుంది.

ఆహార గొలుసులను మొదట అరబ్ శాస్త్రవేత్త, తత్వవేత్త అల్-జాహిజ్ 10 వ శతాబ్దంలో ప్రవేశపెట్టారు, తరువాత 1927 లో చార్లెస్ ఎల్టన్ ప్రచురించిన పుస్తకంలో దీనికి ప్రాచుర్యం కలిపించారు, ఇది ఆహార వెబ్ food web అనే భావనను కూడా ప్రవేశపెట్టింది. ఆహార గొలుసు యొక్క పొడవు అనేది చలరాశులు మీద ఆధార పడి ఉంటుంది ఇది శక్తి యొక్క కొలత, పర్యావరణ నిర్మాణం యొక్క సూచికను అందిస్తుంది, ఇది తక్కువ నుండి అత్యధిక ట్రోఫిక్ (దాణా) స్థాయికి ఉన్న అనుసంధానాల ద్వారా పెరుగుతుంది.

ప్రకృతికి సహజసిద్ధంగా ఉన్న జీవవైవిధ్యం ఎంతో అవసరం. సున్నితమైన ఈ ఆహారపు గొలుసు దెబ్బతింటే ప్రకృతిలో జీవజాతుల మనుగడకే ప్రమాదం. జీవజాతులు నశించిపోవడం వలన మానవ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుచున్నది. ఎందుకంటే ఈ భూమిమీద ఉన్న ప్రతి ప్రాణి ఏదోఒక ప్రాధాన్యతను కలిగిఉంది. ఇందులో ఏ జీవజాతి కనుమరుగైనా ఆహారపు గొలుసు దెబ్బతింటుంది.[2] ఇది అనేక ఇతర జాతుల వినాశనానికి దారితీస్తుంది.[3]

ఆహారపు గొలుసు. Osprey feed on northern pike, which in turn feed on perch which eat bleak that feed on freshwater shrimp.

ఆహారపు వల (Food Web)

[మార్చు]

విభిన్న ఆహారపు గొలుసులలోని జీవుల మధ్య ఆహారపరమైన సంబంధము లేర్పడుట వలన ఏర్పడు సంక్లిష్ట సమాజ నిర్మాణమును ఆహారపు వల అంటారు.

ఆహారపు గొలుసు మాత్రం విడిగా ఉండదు. ఒక జంతువు ఒకటికన్నా ఎక్కువ రకాల ఆహారాలను తినును. ఉదాహరణకు గ్రద్ద కుందేలును, చుంచెలుక లేదా పామునుతినును. అదేవిధముగా ఒక పాము, ఎలుక లేదా కప్పను తినును. కావున అనేక ఆహారపు గొలుసులుఒకదానితో ఒకటి కలసి యుండును.ఈ విధంగా ఒక దానితో ఒకటి కలసి యుండు ఆహారపు గొలుసులనే 'ఆహారజాలకం' (ఆహారవల) అంటారు.

ఆవాసంలో ప్రతి జీవికి నిర్దిష్టమైన ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏ ఒక్క జీవిని తొలగించినా దాని ప్రభావం ఇతర జీవులు, పర్యావరణంపై పడుతుంది.

ఉదా: ఆహారపు వల నుంచి మాంస భక్షకాలను తొలగిస్తే శాకాహారుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. వాటి జనాభా అదుపు తప్పుతుంది.

* ఒక అడవిలో సింహం, పులులను తొలగిస్తే అవి ఆహారంగా తీసుకునే జింకలు, జిరాఫీలు లాంటి శాకాహారుల సంఖ్య పెరుగుతుంది. ఈ స్థితి ఇలాగే కొనసాగితే శాకాహారుల సంఖ్య బాగా పెరిగి వాటి మధ్య ఆహారం, ఆవాసం కోసం పోటీ పెరిగి, అందులో కొన్నింటికి ఆహారం లభించక మరణించవచ్చు. దీనివల్ల ప్రకృతిలో జీవుల మధ్య సమతౌల్యత సాధ్యమవుతుంది.

మూలలు

[మార్చు]
This food web of waterbirds from Chesapeake Bay is a network of food chains

మూలాలు

[మార్చు]
  1. https://scert.telangana.gov.in/pdf/publication/ebooks2019/10th%20ee%20tm.pdf
  2. "జీవ వైవిధ్యతనే జాతి సంపద". Prajatantra Telangana Breaking News Today Updates in Telugu (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-06-04. Archived from the original on 2020-09-23. Retrieved 2020-08-10.
  3. "జీవ వైవిధ్యం - అవసరం | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2020-08-10.