Jump to content

ఇందిరా పార్కు

అక్షాంశ రేఖాంశాలు: 17°24′53″N 78°28′59″E / 17.414754°N 78.483045°E / 17.414754; 78.483045
వికీపీడియా నుండి
(ఇందిరా పార్క్ నుండి దారిమార్పు చెందింది)
ఇందిరా పార్కు
రకంప్రజా పార్కు
స్థానంహైదరాబాదు
అక్షాంశరేఖాంశాలు17°24′53″N 78°28′59″E / 17.414754°N 78.483045°E / 17.414754; 78.483045
నిర్వహిస్తుందిహైదరాబాదు మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ
స్థితిఏడాది పొడుగునా తెరిచే ఉంటుంది

ఇందిరా పార్కు హైదరాబాదు నగరంలోనే ఒక అతిపెద్ద ఉద్యానవనం. ఇది 76 ఎకరాల్లో విస్తరించి ఉంది.[1] ఈ పార్కు హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహిస్తోంది. ఇది దోమలగూడకు సమీపంలో, హుసేన్ సాగర్ చెరువుకు దిగువన ఉంది. పార్కులో అవార్డు సాధించిన ఒక రాతి ఉద్యానవనం ఉన్నది, ఇది కస్టమ్స్, ఎక్సైజ్ శాఖలో పనిచేసే ఓ కమీషనరు దీన్ని రూపొందించారు. 1975 లో అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఈ పార్కుకు శంకుస్థాపన చేసాడు. 1978 లో ఇది పూర్తై ప్రజల వినియోగం లోకి వచ్చింది. దీన్ని హైదరాబాదు జెట్రో డెవలప్‌మెంటు అథారిటీ నిర్వహిస్తోంది.

సౌకర్యాలు

[మార్చు]
ఇందిరా పార్కులో సరోవరం

పార్కులో ఒక రాతి వనం, ఒక సరోవరం, చందనపు వృక్షాలు, ఖర్జూర వృక్షాలు ఉన్నాయి.

రాతి వనం

[మార్చు]
ఇందిరాపార్క్ లోని జీవరాసిలో నత్త

2001 లో పార్కులో ఒక రాతి వనాన్ని నిర్మించాలని అధికారులు సంకల్పించారు. 2 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన ఈ వనాన్ని ఆనుకుని ఇతర ఆటవిడుపు సౌకర్యాలను ఏర్పాటు చెయ్యాలని సంకల్పించారు. ఒక ఎడారిని, నీటి శుద్ధి ప్లాంటు ఏర్పాటును కూడా తలపెట్టారు, ఇవన్నీ, పార్కును ఒక పర్యాటక కేంద్రంగా మలచే ప్రణాళికల్లో భాగం.[1] రాతివనాన్ని కస్టమ్స్ లో పనిచేసే కమిషనరు సుబ్రత బాసు రూపొందించాడు. అంతకుముందు 2002 లో శిల్పారామంలో రాతివనాన్ని రూపొందించిన అనుభవంతో ఆయన దీన్ని రూపొందించాడు

పార్కు లోపల చందన వృక్షాలు ఉన్నాయి. నాణ్యతలో ఇవి ఇతర ప్రాంతాల్లో పెరిగే వృక్షాల కంటే తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ వీటి బెరడు వంటచెరకుగా వాడవచ్చు. దీన్ని సౌందర్య సాధనాల ఉత్పత్తిలో కూడా వాడుతారు. [2]

ధర్నాలకు కేంద్రం

[మార్చు]

సమాజంలోని వివిధ వర్గాల వారు ప్రభుత్వ కార్యక్రమాల పట్ల నిరసన తెలిపేందుకు ఇందిరా పార్కు కేంద్రంగా ఉంది. ఈ ప్రదర్శనలు, ధర్నాల వలన ట్రాఫిక్కుకు అవరోధాలు ఏర్పడి ప్రజలకు ఇబ్బంది కలిగింది. ఈ ధర్నాల కారణంగా ఈ ప్రాంతానికి ధర్నాచౌక్ అనే పేరు కూడా వచ్చింది.[3] ప్రభుత్వం వీటిని నిషేధించినప్పటికీ, దాన్ని అమలు చెయ్యడంలో పోలీసులు విఫలమయ్యారు.[4]

2017 లో తెలంగాణ ప్రభుత్వం ధర్నాచౌకును ఇందిరా పార్కు వద్ద నుండి తరలించాలని నిర్ణయించింది.[5] దీనిపై విమర్శలు వచ్చాయి. 2018 నవంబరులో పార్కు వద్దనే ధర్నా చౌకును ఉంచాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.[6]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 http://www.ghmc.gov.in/parks/indirapark.asp[permanent dead link]
  2. "Sandalwood thieves chop trees". The Times of India. 19 March 2006. Archived from the original on 18 జూలై 2012. Retrieved 2 October 2010.
  3. "Come, sit, protest..." The Hindu. 19 December 2006. Archived from the original on 4 జనవరి 2007. Retrieved 2 October 2010.
  4. Marri, Ramu (26 February 2007). "Damn! these dharnas are a nightmare". The Hindu. Archived from the original on 28 ఫిబ్రవరి 2007. Retrieved 2 October 2010.
  5. Raju. "నిరసనలు ఎలా చేస్తారో చూస్తా... ఇందిరా పార్కునే ఎత్తివేయిస్తున్న కేసీఆర్: చంద్రబాబుకే పాఠాలు". telugu.webdunia.com. Archived from the original on 2020-06-04. Retrieved 2020-06-04.
  6. "ధర్నాచౌక్ కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Archived from the original on 2020-06-04. Retrieved 2020-06-04.