ఇంద్రోడా రాక్షసబల్లి, ఇతర శిలాజాల ఉద్యానవనము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంద్రోడా ఉద్యానవనము యొక్క ముఖద్వారము
శిలాజాలుగా మిగిలిపోయిన రాక్షసబల్లి అండాలు

ఇంద్రోడా రాక్షసబల్లి, శిలాజ ఉద్యానవనము గుజరాత్ పరిపాలనా రాజధాని అయిన గాంధీనగర్లో సబర్మతి నది ఒడ్డున 400 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రాథమికంగా ఈ ఉద్యానవనంలో వివిధ రకాల రాక్షసబల్లుల శిల్పాలు ఉన్ననూ, వాటితో బాటు శిలాజ అవశేషాలు, శిలలుగా మారిన రాక్షసబల్లుల అండాలు, జంతుప్రదర్శనశాల, వృక్షప్రదర్శనశాల, యాంఫీ థియేటర్, తిమింగలం వంటి సముద్ర జీవుల అస్థిపంజరాలు ఉన్నాయి. Geological Survey of India చే స్థాపించబడ్డ, GEER (Gujarat Ecological Education and Research) Foundation చే నిర్వహించబడుతోన్న ఈ ఉద్యానవనం భారతదేశంలోనే రాక్షసబల్లులకు సంబంధించిన మొట్టమొదటి ఉద్యానవనం కావటంతో దీనిని India's Jurassic Park (భారతదేశపు జురాసిక్ పార్క్) గా వ్యవహరిస్తారు.

ఇది మానవ నిర్మిత ఉద్యానవనమే కానీ, ఇక్కడ రాక్షసబల్లులు జీవించలేదు. ఇక్కడ ప్రదర్శించబడే రాక్షసబల్లులు జీవపరిమాణంలో ఉన్నాయి. వీటి అండాలు, ప్రపంచ రాక్షసబల్లి శిలాజ త్రవ్వక స్థలాలలో మూడవదైన గుజరాత్ లోని రైయోలీ, బలాసినోర్ లో బయటపడినవి. వీటి అండాల పరిమాణం ఫిరంగి గుండు అంత కలిగి ఉన్నాయి.

ఇతర సజీవ వన్యప్రాణులు[మార్చు]

మూలాలు[మార్చు]

1. http://www.geerfoundation.gujarat.gov.in/parks.htm Archived 2018-09-07 at the Wayback Machine