Jump to content

ఈమని రామకృష్ణ ఘనపాఠి

వికీపీడియా నుండి
(ఈవని రామకృష్ణ ఘనాపాఠీ నుండి దారిమార్పు చెందింది)

ఈవని రామకృష్ణ ఘనాపాఠీ (1928-13 అక్టోబరు 2003) వేదవిద్యల్లో ప్రవీణునిగా ప్రఖ్యాతులు. ఘన, జట వంటి పాఠాలతో కృష్ణయజుర్వేదం, శ్రౌతం, స్మార్తం, పంచకావ్యాలు వంటి విద్యలు పూర్తిగా అభ్యసించి పాండిత్యం, శాస్త్రార్థం సంపాదించారు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈవని రామకృష్ణ 1928 సంవత్సరంలో ఆషాఢ బహుళ తదియ నాడు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట సమీపంలోని కట్టుంగ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మీనారాయణావధాన్లు, శేషమ్మ. వారి పూర్వీకులది కానూరు అగ్రహారం. వారు కొత్తపేటలో నివాసం ఏర్పరుచుకున్నారు.[1]

మూలాలు

[మార్చు]
  1. ఈమని, శేషాద్రి శర్మ. వల్లూరి, విజయ హనుమంతరావు (ed.). "`వేదసార్వభౌమ' శ్రీ రామకృష్ణ ఘనాపాఠీ". సుపథ. 12 (1). విశాఖపట్టణం: 34–36.