Jump to content

ఉండ్రాళ్ళ తద్దె

వికీపీడియా నుండి
(ఉండ్రాళ్ళ తద్దె నోము నుండి దారిమార్పు చెందింది)

ఉండ్రాళ్ళ తద్దె (తదియ) ప్రతి సంవత్సరమూ భాద్రపద బహుళ తదియ నాడు నోచుకునే నోము. ఇది రెండ్రోజుల పండుగ.

ముందు రోజు

[మార్చు]

ఐదుగురు ముత్తైదువులకి గోరంటాకు ముద్ద, పసుపు కుంకుమలు, కుంకుడు కాయలు, నువ్వులనూనె ఇచ్చి మాయింటికి తాంబూలము తీసుకోవటానికి రండి అని ఆహ్వానించాలి. వివాహం కాని ఆడపిల్లలు ఈ రోజు తెల్లవారుజామున తలంటుపోసుకోవాలి. తలంటు అనగానే ఏదో షాంపుతో కాకుండా కుంకుడుకాయల రసంతో తలని రుద్దుకోవాలి. ఆ కుంకుడులోని దేదుతనం క్రిముల్నీ, కీటకాలనీ జుట్టులోనికి రానీయదు. జుట్టులోని తడిని పిడవ (మెత్తని తుండుని చుట్టుకోవడం) ద్వారా బాగా పీల్చుకునేలా చేసుకుని సాంబ్రాణి పొగని పట్టించుకోవాలి. దీంతో జుత్తంతా సువాసనతో నిండడమేకాక, తల తడిసిన కారణంగా శిరోజాల మూలాల వద్ద వున్న తడి పూర్తిగా ఆరిపోతుంది. ఇక గోంగూరపచ్చడితో పెరుగన్నాన్ని తినిపిస్తారు ... పిల్లలందరికీ. ఈ తతంగమంతా ఉదయం 06 గంటలకే పూర్తవ్వాలి. ఇక్కడితో ఈ రోజు పండుగ ముగిసినట్లే.

వైద్య రహస్యము

[మార్చు]

ఆయుర్వేద శాస్త్రం ప్రకారము గోంగూర వేడిచేసే ద్రవ్యము, పెరుగన్నము చలవ చేసే పదార్థము. తలంటు స్నానము అనేది తలని శుభ్రం చెస్తే గోంగూర, పెరుగు అన్నము పిల్లలకు చురుకుదనాన్ని ఇస్తుంది. పూర్వం రోజుల్లో పొలాలకెళ్ళే రైతులంతా పెరుగన్నము, గోంగూర లేదా ఆవకాయ నంజుకుని వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం రెండుగంటలకి ఆకలితో నకనకలాడుతూ వస్తూండేవారు. ఆ తీరుగా చురుకుదనాన్ని పుట్టిస్తుంది . .. ఈ భోజన మిశ్రమము. కొన్నిచోట్ల నువ్వులపొడుం కూడా ఈ మిశ్రమములో చేరుస్తారు. దీనివల్ల శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షాల కారణంగా వచ్చే జలుబు - రొంప, ముక్కు - కళ్ళ మంటలు రానేరావు.

రెండవ రోజు

[మార్చు]

ఉండ్రాళ్ళతద్దె లోని ప్రత్యేకత తెల్లవారుఝాము భోజనాలు. మళ్ళీ నిన్నటిలాగే గోంగూర లేదా ఆవకాయ నంచుకుని పెరుగన్నాన్ని తిని అలసిపోయేవరకూ దాగుడుమూతలూ, ముక్కుగిల్లులాటలూ, దూదుంపుల్ల, కోతికొమ్మచ్చి మొదలగు ఆటలు దాదాపు ఉదయం 08:00 గంటల వరకూ ఆడుతారు. ఉయ్యాలలూగుతారు. అంతా అయ్యాక ఏ పిల్లకి సంబంధించిన తల్లి తాను తెచ్చిన ఉండ్రాళ్ళని ఆయా కూతురికిస్తే, ఆ తల్లీ కూతురూ ఆ ఉండ్రాళ్ళని మరో తల్లీ కూతుళ్ళకిస్తారు. ఈ సందర్భంలో ఈ కూతురు ఆ తల్లికీ, ఆ కూతురు ఈ తల్లికీ నమస్కరిస్తారు. ఇదొక తీరు ఐకమత్యాన్ని పెంపొందించుకునె తీరు -- ఆట, పండుగ. అంతేకాదు తర్వాత నెలలో రాబోయే అట్లతద్దికి శిక్షణ వంటిది కూడా.

వైద్య రహస్యము

[మార్చు]

వేదంలో ఓ స్లోకము ఉంది. వివాహములో దీన్ని చెప్తారుకూడా.

సోమః ప్రధమో వివిదే గంధర్వో వివిద ఉత్తర: !
తృతీయో అగ్ని స్టే పతి: తురీయ స్తే మనుష్యజ: !!

పుట్టిన ప్రతి ఆడపిల్ల మీదా ఒకటి నుండి ఐదో సంవత్సరం వచ్చేవరకూ చంద్రుడు రాజ్యంచేస్తాడట. అందుకే ఆ పిల్లలు బాగా ఆకర్షణీయంగా ఉండాడమే కాక ఎప్పుడూ అలా గుర్తుకొస్తూవుంటారు కూడా. ఏ చంద్రుడు మనస్సుని దృఢం చేస్తుంటాడో ఆ కారణంగా తండ్రి, మామయ, బాబాయి .... ఇలా అందరినీ, మ ఇంటినీ. పొరుగింటినీ కూడా ఇట్టే ఆకర్షించ గలుగుతారు ఈ కాలంలో. ఆరు నుండి పదో సంవత్సరం వచ్చే వరకూ ఆ పిల్లని చంద్రసాక్షిగా గంధర్వుడు స్వీకరించి రాజ్యం చేస్తాడు. గంధర్వుడు లావణ్యానికి అధినేత కాబట్టి ఆ పిల్లకి అందాన్ని కలిగిస్తాడు. ఆడపిల్లలలో నిజమయిన అందం (ఏ విధమైన దుర్భావకూ లేని అందం ) ఆరు నుండి పడేళ్ళ వరకూ బాగా ఉంటుంది.

ఇక 11 నుండి 15 యేళ్ల మధ్య అగ్నిదేవుడు ఆడపిల్ల బాధ్యతను గంధర్వుని సాక్షిగాస్వీకరిస్తాడు. అగ్నిదేవుడు కామానికి అధిష్టాత కాబట్టి ఆమెలో కామకుణాన్ని 11 వ సంవత్సరం రాగానే ప్రవేశపెడతాడు.

ఈ వయసుకు ముందు మయసులో అనగా 15 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళంతా శారీరకంగా ఆరోగ్యవతులుగా ఉండే నిమిత్తమే ఈ ఆటలూ, ఉండ్రాల వాయనాలు.

మద్యాహ్నం గౌరీ పూజ. గౌరిని షొడశోపచారాలతో పూజించిన వారికి సమస్త శుభాలు సమకూరుతాయంటారు. ఐదు దారపు పోగులు పోసి, ఐదు ముడులు వేసి, ఏడుతోరాలను అమ్మవారి పక్కనే వుంచి పూజించాలి. ఒక తోరం అమ్మవారికి, ఒకటి నోముకున్నవారికి, మిగితా ఐదు, ఐదుగురు ముత్తైదువులకు కట్టాలి. బియ్యపు పిండిలో బెల్లము కలిపి, పచ్చి చలిమిడి చేసి, ఐదు ఉండ్రాలను చేసి, నైవేద్యం పెట్టాలి.

పూజ తరువాత చేతిలో అక్షింతలనుంచుకొని కథచెప్పుకోవాలి.ఈ వ్రత కథ ఏమిటంటే, పూర్వం ఓ వేశ్య, తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది. ఒక ఉండ్రాళ్ళతద్దె నాడు, రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు.ఆమె అహంకారముతో దైవ నింద చేసేసి నోముకో లేదు. ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్ళారు. మహా వ్యాధి బారాన పడ్డది. తరువాత రాజ పురోహితుడి సలహాతో ఉండ్రాల తద్దె నోము నోచుకొని, తన సంపదని తిరిగి పొంది, ఆరోగ్యస్తు రాలై శేష జీవితాన్ని ఆద్యాత్మికంగా గడిపి, మరణానంతరం గౌరీ లోకానికి వెళ్ళింది.

ఒక గర్విష్టికే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా ! సత్ప్రవర్తనతో ఉండి నోచినవారికి ఇంక ఎంత ఉన్నతమైన ఫలితముంటుందో ఊహించుకొని సన్మార్గంలో నడవండి ! అనేది ఈ కథలోని నీతి.

హిందు సాంప్రదాయములో నోములు, పూజలకి పెద్ద పీటనే వేసారు. నోము నోచుకుంటేనే సుమంగళిగా వుంటామా ? అందుకోసం వ్రతాలు చేయాలా ? అని వితండ వాదం చేసే వారికి ఏమీ చెప్పలేను. అంత పరిజ్ఞానము నాకు లేదు. నోముకుందాము అనుకోగానే ఇల్లు శుభ్రం చేసి, మామిడాకులు కట్టి, ముగ్గేసి, దేవుడి పీఠానికి పూలూ, ఆకులు అలంకరించి, ధూప దీప నైవేద్యాలతో పూజించి, ముత్తైదువులకు, తాంబూల మిచ్చి, ఆశీస్సులు తీసుకోవటముతో ఇంటికి ఓ కళ వస్తుంది. మనసులో ఓ ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంట్లో పాజిటివ్ వేవ్స్ వచ్చినట్లుగా వుంటుంది. కుటుంబ శ్రేయస్సు, ఆద్యాత్మికానందం కలుగుతుంది.

ఉండ్రాళ్ళ తద్దె నోము

[మార్చు]
గౌరీ పూజ

వివాహము అయిన సంవత్సరము వచ్చు ఉండ్రాళ్ళతద్దె రోజున ఈ నోము పట్టుకొందురు. ముందు రోజు గోరింటాకు పెట్టుకొనవలెను. ఉదయమే 4 గంటలకు, లేచి గోంగూర పచ్చడితో భోజనము చేయవలెను. తెల్లవారినాక స్నానము చేసి 3 ఇళ్ళలో ఉయ్యాల ఊగవలెను. గౌరిపూజ చేసి వాయనము ఇచ్చుకొనవలెను.

గౌరిపూజ అయినాక ఉండ్రాళ్ళతద్దె కథ చదవాలి. అక్షింతలు చేతితో పట్టుకుని, కథ పూర్తి అయినాక అక్షింతలు తలపై చల్లుకొనవలెను. నోము పట్టినట్లు టెంకాయకొట్టి, పొంగలి నైవేద్యము పెట్టవలెను.

ఒక పళ్ళెములో 5 పూర్ణములు లేక 5 పచ్చి ఉండ్రాళ్ళు, పండు, తాంబూలము, 5 పోగుల తోరము, దక్షిణ ఇలా 2 ప్లేట్లులో సర్దాలి. ఒకటి గౌరమ్మకు నైవేద్యము. తోరము చేతికి చుట్టుకుని ఎవరైన ముత్తైదువ వున్న, వాయనము ఆమెకు ఇవ్వవచ్చును. లేనిచో గౌరమ్మకు వాయనము ఎత్తి విడువవలెను. వాయనము ఇచ్చినాక ఇచ్చినవాళ్ళు తినకూడదు. వాయనము ఇచ్చినాక తోరము చేతికి చుట్టి నమస్కారము చేసి అక్షింతలు వేయించుకొనవలెను.

నోము చెల్లించుకొనుట

[మార్చు]

5గురు ముత్తైదువులను పిలవవలెను. వారు ఆ రోజు తలస్నానము చేసి భోజనమునకు రావలెను. వాయనము 6 ప్లేట్లలో సర్దవలెను. 5 పూర్ణములు లేక 3 పూర్ణములు, 2 గారెలు పెట్టవచ్చును. 5 పోగుల తోరము, 1 వాయనము గౌరిదేవికి, పొంగలి, టెంకాయ, నైవేద్యము. గౌరిపూజ చేసి కథ చదువుకుని అక్షింతలు మొత్తము గౌరిదేవి పైన చల్లాలి. పూజ అయినాక నైవేద్యము గౌరిదేవి వద్ద పెట్టిన ప్లేటులోని తోరము చేతికి కట్టుకుని 5 గురికి భోజనము వడ్డించినాక ఒక్కొక్కరికి ఒక వాయనము ఇవ్వవలెను. వాయనము ఇచ్చునప్పుడు, ఇచ్చువారు తీసుకొనువారు

ఇస్తి వాయనము పుచ్చుకొంటి వాయనము
ఇస్తి వాయనము పుచ్చుకొంటి వాయనము
ముమ్మాటికి ఇస్తి వాయనము ముమ్మాటికి పుచ్చుకొంటి వాయనము
వాయనము తీసుకున్నది ఎవరు నేనే పార్వతిని

ఇలా 5గురికి ఇవ్వవలెను. అందరికి తోరములు చేతికి చుట్టవలెను. ముడివేయకూడదు. బియ్యంపిండి ముద్దతో కుందిలాగ చేసి, దానిలో ఆవునేతితో తడిపిన కుంభవత్తి పెట్టి, 5గురి ఇస్తరాకుల ముందు వెలిగించవలెను. అవి ఆరినాక జ్యోతితో సహా చలిమిడిని తినవలెను. నోము చెల్లించుకునే ముత్తైదువు నెయ్యి వడ్డించినాక భోజనము చేయుదురు. 5 పోగులకు పసుపు రాసి, 3 చోట్ల పూలు ముడివేసి, 2 చోట్ల ఉత్త ముడి వేయవచ్చును. తోరము రెడీ అయినట్లు. ఈ నోము పట్టుకొనుట, పుట్టింటిలోకాని అత్తగారింటిలోకాని పట్టుకొనవచ్చును.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]