Jump to content

పాలఏకిరి

వికీపీడియా నుండి
(ఎకిరి నుండి దారిమార్పు చెందింది)
దక్షిణ భారతదేశానికి చెందిన కులాలు, ఆదివాసీల గురించిన పుస్తకం

పాల ఏకారి ఏకారి, ఏకలి, యకారి, యాకర్లు అని వేర్వేరు పేర్లు ఉన్నాయి. ముత్రాచ ఉప-కులంగా కూడా పిలుస్తారు, ఇది 1901 మద్రాసు సెన్సస్ నివేదికలో నివేదించబడింది. పాల ఎకరి టైటిల్స్ నాయుడు.[1][2]

చరిత్ర

[మార్చు]

యాకారిస్ లేదా ఎకార్లు అనేది ఉత్తర ఆర్కాట్‌ల ఉత్తర తాలూకాలలో, ప్రక్కనే ఉన్న కడప జిల్లాలో కనిపించే సాగుదారుల తరగతి, గ్రామ కాపలాదారు.వారు వేటగాళ్ళు, కిరాయి సైనికులుగా పేర్కొనబడ్డారు, కడపలో వారిని బోయలు, కిరాతలు అని పిలుస్తారు, వారు అటవీ తెగగా వర్గీకరించబడ్డారు,వారు కొంత అధికారం కలిగి ఉన్నారని, వారు పొలిగార్లు (గ్రామాల సమూహానికి సైనికాధికారులు) అని స్పష్టంగా తెలుస్తుంది.

కల్లూరు, తుంబ, పులిచెర్ల, బంగారి, గుడిపాటి సైనికాధికారులు పాలిఏకారి కులానికి చెందినవారు, దాని సభ్యులు చాలా మంది గ్రామ పోలీసు సిబ్బంది,వారు యజ్ఞోపవీతంన్ని ధరించరు, కానీ వారి పూజారులుగా బ్రాహ్మణులను నియమించుకుంటారు.

ఎకార్లు,వారి వేడుకలు, కాపు వేడుకలు కొన్ని తేడాలు మినహా సరిగ్గా ఒకే విధంగా ఉంటాయి.పాలి ఎకరీలు మాంసాహారులు[3],వారు గతంలో హిందూ కాటన్ క్లీనర్లని కొందరు వాదిస్తున్నారు. పాలీ ఎకారీలు 74ని ఉప-విభాగాలుగా తిరిగి ఇచ్చారు,, వారి పేరు పత్తిని శుభ్రం చేయడానికి యెకుట అనే క్రియ నుండి ఉద్భవించింది.

అత్యంత ముఖ్యమైన ఉపవిభాగాలు దొడ్డ, పాల.ఎకారిస్, ముత్రాసిస్ మధ్య వివాహాలు లేదా పరస్పర సంబంధం లేదు,కొందరు కంపిన్, నగిరిపిల్ల కాయలు, మరికొందరు కమ్మి, యెర్రాయిలను ఉపవిభాగాలుగా ఇచ్చారు.[4]

వీరి దీన స్థితిని చూసిన ప్రభుత్వం 1955లో పాల ఏకిరిని బిసీ జాబితాలో చేర్చింది. బిసీ రిజర్వేషన్‌ ఫలాలు రుచి చూసే లోపే... అంటే 1970లో బీసీ జాబితా నుండి వీరు తొలగించ బడ్డారు. తిరిగి రిజర్వేషన్‌ సౌకర్యం పొందటం కోసం పాల ఏకి రి కులస్తులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ఎన్‌టి రా మారావు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరి ప్రయ త్నాలు ఫలించి బిసీ జాబితాలో వీరిని 1986లో చేర్చారు. అయితే ఈ జీ.ఓను కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని అప్పట్లో హైకోర్టు కొట్టివేసింది. అయితే హైకోర్టు తీర్పుకు అను గుణంగా జీఓలో మార్పులు చేయడాన్ని గురించి ప్రభుత్వం ప ట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 1994లో అప్పటి ముఖ్యమం త్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పుట్టు స్వామి కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కమిషన్‌ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చాక జీవో వస్తుం దని ఎదురు చూశారు. అయితే కోట్ల ప్రభుత్వం పతనం కావ డంతో తర్వాత వచ్చిన పాలకులు పుట్టు స్వామి కమిషన్‌ను ప ట్టించుకోలేదు. ఈ క్రమంలో మళ్లీ పాల ఏకిరి వారు ఎన్నో ప్ర యత్నాలు చేశారు.

వీరి ప్రయత్నాలు ఫలించి 2007 ఆగస్టులో పాల ఏకిరిని బిసీ జాబితాలో చేరుస్తూ జీఓ విడుదలెైంది. కాగా ఈ పాల ఏకిరి కులస్తులు కర్నాటకలో ఎస్టీలుగా, తమిళ నాడులో బీసీలుగా చెలామణి అవుతున్నారు. విద్య పట్ల ఏమా త్రం శ్రద్ధ చూపలేదు. ఫలితంగా తర్వాతి కాలంలో అన్ని రం గాలలో బాగా వెనుకబడ్డారు. పెైగా కొండకోనల్లో జీవనం సా గించడంతో బడికి దూరమయ్యారు. కొండకోనల్లోని ఎండుపుల్లలు తీసుకొచ్చి జీవనం గడుపుతున్నారు.

మరికొందరు వ్యవసాయ కూలీలుగా జీవనం గడుపుతున్నారు. ఇప్పటికీ చాలీచాలని పూరిళ్లలో రోజులు గు డుపుతున్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించిన బంగారుపల్లి జమిం దారు చిత్తూరులో ఉన్నత పాఠశాలను నెలకొల్పారు. ఈ పాఠ శాల ఏర్పాటు కావడంతో కొంత మేరకు వీరిని విద్యారంగం వెై పు మొగ్గు చూపే విధంగా చేసింది.అయినప్పటికీ నామమా త్రంగానే వీరు విద్య పట్ట శ్రద్ధ చూపుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో విద్యకున్న ప్రాధాన్యత వీరికి తెలిసి రావడంతో తమ పిల్లలను బడికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఓబీసీజాబితాలోచేర్చాలి కొన్ని దశాబ్దాల పోరాట ఫలితంగా బీసీ రిజ ర్వేషన్‌ జాబితాలో స్థానం సంపాదించినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో తమకు రిజర్వే షన్‌ ఫలాలు అందట్లేదని చెపుతున్నారు ఆంధ్రప్రదేశ్‌ పాల ఏకిరి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎల్‌ కొండమ నాయుడు. ఓబీసీ జాబితాలో పాల ఏకిర కులాన్ని చేర్చి కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన విద్యా, ఉద్యోగాల రంగా లలో తమకు రిజర్వేషన్లను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. జనాభా పరంగా పాల ఏకిరి కులస్తుల సం ఖ్య అతి తక్కువగా ఉన్నందున ఎన్నికల్లో పోటీచేసి గెలిచే పరిస్థితులు లేవంటారు.

రాయలసీమలోని ప్రతి జిల్లా లోనూ పాల ఏకిరి విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్‌ సౌకర్యం కల్పించి ప్రోత్సహించాలన్నారు. ఇక వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్న తమ కులం వారిని ప్రోత్సహించేందుకు బ్యాంకు రుణాలు మంజూరు చేస్తే చిరు వ్యాపారులుగా నయినా మారతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.అప్పట్లో వీరి ప్రధాన వృత్తి వేట.

వృత్తి, సామాజిక జీవతం

[మార్చు]

వీరిలో విద్యావంతుల శాతం చాలా తక్కువ. 1956లో వీరిని బిసీ జాబితాలో చేర్చారు,తర్వాత కొన్ని కారణాలవల్ల వారిని ఆ జాబితా నుంచి తొలగించారు.గత ఏడాది వీరిని రాష్ర్ట ప్రభుత్వం బీసీల జాబితాలో చేర్చి జీవో విడుదల చేసింది.కనుక అన్ని రంగాలలో వెను కబడి నేటికీ కొండ ప్రాంతాలలోనే గడుపుతున్నారు. కర్ణాటక లోనూ వీరి జనా భా ఎక్కువగానే ఉంది. పాలఏకిరి కులస్థులు అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువ. బతుకుదెరువు కోసం స్వాతంత్య్రానంతరం వీరు ఇతర జిల్లాలకు వెళ్లారు. అయితే రాయలసీమలో మాత్రం ఇప్పటికీ కొండప్రాంతాలలోనే జీవనం సాగిస్తున్నారు. పూర్వం పాలెగాళ్లుగా ఉన్న రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు లేనప్పుడు జల్సా చేశారే తప్ప చదువుపట్ల శ్రద్ధ చూపలేదు. ఫలితంగా తర్వాతి కాలంలో అన్నిరంగాలలో బాగా వెనుక బడ్డారు. ఐ.ఏ.ఎస్‌., ఐ.పి.స్‌. అధికారులు కాదుకగా, కనీసం గ్రూప్‌ వన్‌ అధికారి కూడా ఈ కులం నుంచి రాలేకపోయారు. చదువు విలువ తెలుసు కోవడంతో గత రెండు దశాబ్దాలుగా విద్యార్థుల సంఖ్య కొంత పెరి గింది. పాలఏకిరి కులస్థులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేయాలని విద్యార్థులకు హాస్టల్‌ వసతి ఫ్రీ ఎడ్యుకేషన్‌ వంటి సౌకర్యాలు కల్పించాలనీ వీరు కోరుతున్నారు.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Edgar, Thurston (1909). Castes and tribes of southern India. p. 138.
  2. Edgar, Thurston (1909). Castes and tribes of southern India. p. 194.
  3. Edgar, Thurston. texts Castes and tribes of southern India. p. 203.
  4. Edgar, Thurston (1909). Castes and tribes of southern India. p. 204.
"https://te.wikipedia.org/w/index.php?title=పాలఏకిరి&oldid=4346491" నుండి వెలికితీశారు