ఎత్తు
ఎత్తు నిలువు అనునది నిలువుగా కొలిచే దూరం. కానీ వాడుకలో రెండు అర్థాలున్నాయి. ఒకవస్తువు ఎంత ఎత్తు (పొడవు) కలదు అనీ లేదా భూమి నుండి ఎంత ఎత్తున కలదు అనే అర్థాలు ఉంటాయి. ఉదాహరణలుగా ఒక భవనం ఎత్తు 50 మీటర్లు అనగా భూమి నుండి నిలువుగా పై భాగానికి దూరం 50 మీటర్లు అని అర్థము. ఒక విమానం 10, 000 మీటర్ల ఎత్తున ఎగురుచున్నది అనగా ఆ విమానం సముద్ర మట్టం నుండి 10, 000 మీటర్ల దూరంలో కలదని అర్థము. ఎత్తును సాధారణంగా ఉన్నతి, ఉన్నతాంశం అనే దాలను కూడా వాడవచ్చు. ఇది భూమిపై నుండి నిలువుగా "y" అక్షంలో ఒక బిందువు నుండి పై బిందువు వరకు గల దూరం.
వ్యుత్పత్తి
[మార్చు]ఆంగ్లంలో ఎత్తు (high) అనునది పురాతన ఆంగ్లభాషలో hēah నుండి ఉధ్బవించింది. ఎత్తు (hight) అనే నామవాచక పదం highth అని కూడా పురాతన ఆంగ్ల పదం híehþం, తర్వాత héahþu నుండి ఉద్భవించింది.
గణితంలో
[మార్చు]అంతరాళంలో ప్రాథమిక నమూనాల ప్రకారం త్రిమితీయ వస్తువులలో మూడవ కొలతగా ఎత్తును తీసుకుంటారు. ఇతర కొలతలు పొడవు, వెడల్పు. పొడవు వెడల్పు లతో కూడిన తలానికి ఉన్నతిగా ఎత్తును తీసుకుంటారు.
కొన్ని సందర్భాలలో అమూర్త భావనలుగా ఎత్తు అనే పదాన్ని ఉపయోగిస్తాము. అవి:
- త్రిభుజం ఎత్తు: అనగా త్రిభుజ భూమి నుండి ఎదుటి శీర్షం వరకు గల కొలత;
- వృత్త ఖండం యొక్క ఎత్తు: అనగా చాపం మధ్య బిందువు నుండి జ్యా యొక్క మధ్య బిందువుకు మధ్య గల దూరం.
- బీజగణితంలో ఎత్తు ప్రమేయం: అనగా బీజగణిత సంఖ్య నుండి బహుపది కనిష్ఠ కొలత.
భూగర్భ శాస్త్రంలో
[మార్చు]నిర్దేశ చట్రంలో ఎత్తు అనునది భౌతిక ప్రపంచంలో శూన్య తలం (సముద్ర మట్టం) నుండి గల ఉన్నతి లేదా ఉచ్ఛాస్థానం వరకు గల కొలత. భూభాగం సముద్ర మట్టం నుండి ఎంత ఎత్తున కలదో తెలిపే కొలత.
మనిషి ఎత్తు
[మార్చు]మనిషి ఎత్తు (Human height) ఆంథ్రపాలజీలో ఉపయోగించే ఒక కొలత. మానవ సమూహాల సగటు ఎత్తు వారి ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తుంది..[1] అదేవిధంగా ఒకే జనాభాలోని ఎత్తులోని భేదాలు జన్యు సంబంధమైనవి. భారతదేశపు సగటు మనిషి ఎత్తు 5.4 అడుగులు. ఐక్య రాజ్య సమితి ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాలలో పోషకాహార ప్రమాణాల్ని నిర్దేశించడానికి వారి ఎత్తును ప్రమాణంగా తీసుకుంటుంది.
వనరులు
[మార్చు]- ఆంగ్ల వికీపీడియాలో వ్యాసం [1]
సూచికలు
[మార్చు]- ↑ "Chicago Tribune". Archived from the original on 2008-05-30. Retrieved 2008-05-30.