Jump to content

కకేబో టెక్నిక్

వికీపీడియా నుండి
(కకేబో టెక్నిక్‌ నుండి దారిమార్పు చెందింది)
డబ్బు ఆదా చేయడానికి కకేబో టెక్నిక్‌

కకేబో టెక్నిక్‌ (జపనీస్: 家計 簿, ఆంగ్లం: Kakeibo Technique) - జపాన్‌ భాషలో కకేబో అంటే ‘ఇంటి పద్దు పుస్తకం’ అని అర్థం. అంటే ఒక కుటుంబం నెలవారీ ఆదాయ, వ్యయాలను నమోదు చేసే పుస్తకం అని చెప్పవచ్చు.[1] ఈ పద్ధతిని పాటిస్తూ జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేయడం అలవర్చుకుంటే డబ్బు ఆదా చేయడం చాలా సులభం అని అనాదిగా జపాన్‌ ప్రజల విశ్వాసం. నెలకు దాదాపు 35 శాతం వరకు డబ్బు ఆదా అవుతుందని, తు.చ. తప్పకకుండా  జపనీస్ ఈ మనీ ట్రిక్  పాటించేవారని చెబుతుంటారు. 1904లో జపనీస్ మహిళా జర్నలిస్ట్ హనీ మొటొకో దీని గురించి ఓ మ్యాగజైన్‌లో మొదటి సారి వ్యాసం రాసి, కకేబో టెక్నిక్‌ మరింత ప్రాచుర్యం సంతరించుకునేందుకు దోహదపడింది.[2] ఇలా జపాన్‌లో పుట్టిన ఈ విధానానికి ఇప్పుడు అమెరికాలోనే కాక ప్రపంచమంతా విశేష ఆదరణ లభిస్తోంది.

కకేబో పద్ధతిలో ప్రతి ఖర్చును, ఆదాయాన్ని ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ని వినియోగించకుండా ఒక పుస్తకంలో పెన్నుతో తప్పక రాయాల్సి ఉంటుంది. చేతితో రాయడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడమేకాక మనం ఏం రాస్తున్నామనే దానిపై మనకు శ్రద్ధ ఉంటుంది. అది మన బుర్రలో ఉండిపోతుంది. పైగా కొనుగోళ్లను కేటగిరీల్లో పొందుపరిచేటప్పుడు బాగా ఆలోచించాల్సి వస్తుంది. అది తదుపరి వ్యయాలపై ప్రభావం చూపుతుంది. అది మరింత మెరుగైన నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేస్తుంది.[3] చాలా మంది పొదుపు పై పెట్టే దృష్టి ఖర్చుపై పెట్టరు. కానీ ఖర్చుని నియంత్రించగలిగితే ఆటోమేటిగ్గా పొదుపు పెరుగుతుంది. ఇదే కకేబో పద్ధతి ప్రధాన లక్ష్యం.

మూలాలు

[మార్చు]
  1. "Kakeibo - säästämistä japanilaiseen tyyliin". raha.fi. Retrieved 2018-09-18.
  2. "Kakeibo, the art of saving - Moni Ninja". monininja.com. Archived from the original on 2018-09-18. Retrieved 2018-09-18.
  3. "Kakeibo Technique: ఈ జపాన్‌ టెక్నిక్‌తో నెలకు 35 శాతం డబ్బు ఆదా! - Telugu news Kakeibo The Japanese Art Of Saving Money". www.eenadu.net. Retrieved 2021-11-23.