Jump to content

కథల్: ఎ జాక్‌ఫ్రూట్ మిస్టరీ

వికీపీడియా నుండి
కథల్: ఎ జాక్‌ఫ్రూట్ మిస్టరీ
దర్శకత్వంయశోవర్ధన్‌ మిశ్రా
రచనఅశోక్ మిశ్ర
యశోవర్ధన్‌ మిశ్రా
నిర్మాత
  • శోభా కపూర్
  • ఏక్తా కపూర్
  • గుణీత్ మోంగా
  • అచిన్ జైన్
తారాగణం
ఛాయాగ్రహణంహర్షవిర్ ఒబెరాయ్
కూర్పుపేర్న సైగల్
సంగీతంరామ్ సంపత్
నిర్మాణ
సంస్థలు
బాలాజీ మోషన్ పిక్చర్స్
శిఖ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్
విడుదల తేదీ
19 మే 2023 (2023-05-19)
సినిమా నిడివి
115 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ

కథల్: ఎ జాక్‌ఫ్రూట్ మిస్టరీ 2023లో విడుదలైన హిందీ సినిమా. బాలాజీ మోషన్ పిక్చర్స్, శిఖ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై శోభా కపూర్, ఏక్తా కపూర్, గుణీత్ మోంగా, అచిన్ జైన్ నిర్మించిన ఈ సినిమాకు యశోవర్ధన్‌ మిశ్రా దర్శకత్వం వహించాడు. సానియా మల్హోత్రా, అనంత్‌ జోషి, విజయ్‌రాజ్‌, రాజ్‌పాల్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 19న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.[2][3]

ఎమ్మెల్యే మున్నాలాల్‌ (విజయ్‌రాజ్‌) ఇంటి తోటలో ఉన్న చెట్టు నుండి పనస చెట్టుకు కాసిన రెండు కాయలు దొంగతనానికి గురవుతాయి. పోలీసు ఇన్‌స్పెక్టర్ మహిమ (సన్యా మల్హోత్రా)కి కేసు అప్పగించబడింది. అయితే ప్రధాన అనుమానితుడు ఇంటి తోటమాలి అని తెలుసుకొని అతడిని కనుగొన్నప్పుడు, అతని కుమార్తె చాలా రోజులుగా తప్పిపోయిందని, దీని గురించి పోలీసు స్టేషన్‌లో ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలుసుకుంటుంది మహిమ (సన్యా మల్హోత్రా).

ఈ క్రమంలో ఎమ్మెల్యే కేసును పక్కనబెట్టి మిస్సింగ్ గర్ల్ కేసును కూడా ఎలా పరిశోధిస్తుంది. తప్పిపోయిన అమ్మాయిని మహిమ కనుక్కోగలదా? ఆ ప్రాంతంలో కిడ్నాప్‌కు గురైన అమ్మాయిల లోతైన రహస్య రాకెట్‌ను మహిమ వెలికితీస్తుందా? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

[మార్చు]
  • సన్యా మల్హోత్రా - ఇన్‌స్పెక్టర్ మహిమా బసోర్‌
  • అనంత్‌ జోషి - కానిస్టేబుల్ సౌరభ్ ద్వివేది
  • విజయ్‌రాజ్‌ - ఎమ్మెల్యే మున్నాలాల్ పటేరియా
  • రాజ్‌పాల్ యాదవ్ - న్యూస్ రిపోర్టర్ అనుజ్ సంఘ్వీ
  • గుర్పాల్ సింగ్ - ఎస్పీ అంగ్రేజ్ సింగ్ రంధావా
  • నేహా సరాఫ్ - కుంతీ పరిహార్‌
  • సంజయ్ దధీచ్ - న్యాయవాది, కుంతీ పరిహార్‌ భర్త సునీల్ పరిహార్
  • రఘుబీర్ యాదవ్ - గులాబ్ సేథ్
  • గోవింద్ పాండే - కానిస్టేబుల్ మిశ్రా
  • బ్రిజేంద్ర కాలా - శ్రీవాత్సవ
  • అపూర్వ చతుర్వేది - అమియా
  • రవి జంకల్ - చందూలాల్‌
  • ఏక్తా సింగ్ - అమున్ భార్యగా
  • లక్కీ ఖాన్ - బల్బీర్ బుందేలా ఇన్‌స్పెక్టర్‌

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: బాలాజీ మోషన్ పిక్చర్స్, శిఖ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: శోభా కపూర్, ఏక్తా కపూర్, గుణీత్ మోంగా, అచిన్ జైన్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: యశోవర్ధన్‌ మిశ్రా
  • సంగీతం: రామ్ సంపత్
  • సినిమాటోగ్రఫీ: హర్షవిర్ ఒబెరాయ్

మూలాలు

[మార్చు]
  1. "Kathal". British Board of Film Classification. Retrieved 20 May 2023.
  2. Namasthe Telangana (11 June 2023). "పనస దొంగలెవరు?". Archived from the original on 13 June 2023. Retrieved 13 June 2023.
  3. "Sanya Malhotra starrer satirical comedy Kathal- A Jackfruit Mystery to release on Netflix on May 19". Bollywood Hungama. 20 April 2023. Retrieved 20 April 2023.
  4. The Hindu (19 May 2023). "'Kathal' movie review: Sanya Malhotra chases jackfruits and jeopardy in prickly comedy" (in Indian English). Archived from the original on 14 June 2023. Retrieved 14 June 2023.

బయటి లింకులు

[మార్చు]