Coordinates: 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E / 17.0531; 82.1695

శ్రీ కపోతేశ్వర స్వామి దేవాలయం (కడలి గ్రామం)

వికీపీడియా నుండి
(కపోతేశ్వర స్వామి దేవాలయం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కపోతేశ్వర స్వామి దేవాలయం
కపోతేశ్వర స్వామి దేవాలయం is located in Andhra Pradesh
కపోతేశ్వర స్వామి దేవాలయం
కపోతేశ్వర స్వామి దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లొ ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E / 17.0531; 82.1695
పేరు
ప్రధాన పేరు :కపోతేశ్వర స్వామి దేవాలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:తూర్పు గోదావరి
ప్రదేశం:కడలి
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:కపోతేశ్వర స్వామి దేవాలయం
నిర్మాణ శైలి, సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య:ఒకటి

కపోతేశ్వర స్వామి దేవాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, జగ్గన్నపేట కడలి గ్రామంలో ఈ ఆలయం ఉంది.

స్థలపురాణం[మార్చు]

పూర్వం కపోతేశ్వరస్వామి దేవాలయం ఉన్న ప్రదేశం ఒకప్పుడు అడవిగా ఉండేది. ఆ అడవిలో ఒక బోయవాడు వేటకు వెళ్లగా, ఆ రోజు విపరీతమైన వర్షం కారణంగా ఆహారం లభించకపోగా తడిసిన కారణంగా ఒక చెట్టుకింద కూర్చుని వణుకుతూ ఉంటాడు. బోయవాడు కూర్చున్న చెట్టుమీద గూడుకట్టుకుని ఒక పావురాలజంట నివసిస్తూ ఉంది. గూటిలో ఉన్న ఆడపావురం బోయవాడిని చూచి ఇతడు ఆహారం దొరకక క్షుదాతురుడై తమ గూటి క్రింద కూర్చున్నాడని, ఎవని ఇంటిదగ్గర ఆహారం లభించక ఉపవాసం ఉండునో, ఆ ఇంటి యజమానికి ఆ అతిథి తన పాపములను వదిలి వెళ్లుననే ధర్మశాస్త్ర విషయాలు తెలిసిదై ఆ పావురం పూర్వజన్మ జ్ఞానం కలదై శ్మశానంనకు పోయి మండుచున్న చితుకులను తెచ్చి బోయవాని ముందు పడవేసి,ఎండు పుల్లలు లభించని కారణంగా తన గూడును పడవేసి మంటచేసి బోయవాడి చలిబాధను తీరుస్తుంది.తరువాత ఆ పావురం అగ్నిలో పడి బోయవాడికి ఆహారంగా మారి అతడి క్షుద్బాధను తీరుస్తుంది. మేతకై పోయిన మగపావురం తిరిగి వచ్చి పరిస్థితిని గమనించి, తన భార్య చేసిన అతిథి సత్కారాలకు సంభ్రమాశ్చర్యాలను చెంది, వైరాగ్యంతో అది కూడా మంటలలో దూకి ప్రాణత్యాగం చేస్తుంది. అతిథి పూజకు తమ శరీరాలనే పణంగా పెట్టి ప్రాణత్యాగాలు చేసిన పావురాలజంట ధర్మనిరతికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ జంటకు శివసాయుజ్యం అనుగ్రహిస్తాడు. పరమేశ్వరుని అనుగ్రహంతో బ్రతికిన అ పావురాలజంట "మహాప్రభో, మా త్యాగం చూచి మాతోపాటు ప్రాణాలు విడిచిన బోయవాడికి కూడా శివసాయుజ్యమును ప్రసాదించమని, శిల ఆకారంలో ఈ ప్రదేశంలో ఉండి శివుని పూజించిన భక్తులకు సద్గతులు ప్రసాదించమని ప్రార్థించగా ఈశ్వరుడు తథాస్తు అని అదృశ్యమౌతాడు. పిమ్మట అక్కడ ఈశ్వరుడు కపోతేశ్వరస్వామిగా వెలిసి, అప్పటి నుండి భక్తుల సేవలను అందుకుంటున్నాడని కథనం.[1]

ఉత్సవాలు[మార్చు]

నిత్యం శ్రీ కపోతేశ్వరస్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ప్రతి మాస శివరాత్రికి లక్షబిల్వార్చన పూజలు జరుగుతాయి. సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలకు సుబ్రహ్మణ్యేశ్వరునికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవాలు జరిపిస్తారు.

రవాణా సౌకర్యం[మార్చు]

కపోతేశ్వరస్వామి వారి ఆలయానికి రవాణా సదుపాయం ఉంది. వచ్చే భక్తులు క్షేత్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాటిపాక సెంటరు చేరుకోవాలి. అక్కడ నుంచి ఆటోలు లేదా ట్యాక్సీల ద్వారా క్షేత్రానికి వెళ్లవచ్చు.

మూలాలు[మార్చు]

  1. "Kadali Kapoteswara Swamy / కడలి కపోతేశ్వర క్షేత్రం..." www.telugukiranam.com. Archived from the original on 2020-02-24. Retrieved 2020-02-24.

వెలుపలి లంకెలు[మార్చు]