కళింగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గమనిక: ఈ తరహా వ్యాసంలో వివాదాస్పదమైన విషయాలు ఉండే అవకాశం ఉంది. కనుక వ్రాసే విషయాలకు నిర్ధారించుకొనదగిన ఆధారాలు అవసరం. రచయితలు ప్రత్యేక శ్రద్ధ చూపవలసినదిగా కోరిక.

కళింగ రాజ్యం సి. 261 బిసిఈ

భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో బాగా ప్రాచుర్యం ఉన్న ఒక కులము పేరు కళింగ (Kalinga Caste)

కళింగ దేశం[మార్చు]

మహాభారత కాలంలో వైతరణి నది మొదలు కొని ఉన్న ప్రాంతమంతా కళింగ దేశమని వ్యవహరించే వారు. ఇది ఉత్తర భారతదేశ ప్రాంతం. దక్షిణంలో గోదావరినది వరుకు విస్తరించి ఉండేది. కళింగ దేశ రాణి సుశేణ కుమారులు అయిదుగురు. వారు అంగ, వంగా, కళింగ పుండ్ర సుహ్మ రాజ్యాలని స్థాపించారు. ఇది చారిత్రక సత్యం. కళింగ రాజధాని రాజాపూరి అని మహాభారతంలో చెప్పబడింది. చిత్రాంగదుడనే కళింగ రాజు కుమార్తెను దుర్యోధనుడు పెళ్ళి చేసుకొన్నట్టు చరిత్ర చెపుతుంది. కళింగ ప్రపంచానికి స్ఫూర్తి ప్రదం. యావద్దేశం అశోకుని సామ్రాజ్య కాంక్షకు తలవగ్గి దాసోహమనే సమయంలో స్వేచ్ఛ స్వతంత్ర అభిలాషతో ప్రాణాలొడ్డి ఎదిరించారు కళింగ ప్రజలు, కళింగ యుద్ధంలో లక్ష మంది పైగా కళింగ ప్రజలు వధింపబడ్డారు. శోకమే ఎరుగని అశోకుడు ఈ ప్రాణ నష్టం చూసి శోకుడయ్యాడు. శాంతి కోసం బీజం వేశారు. ధర్మం కోసం మార్గం వేశారు. కళింగ యుద్దమే లేని నాడు అశోకుని శాంతి సందేశం లేదు. ధర్మ చక్రము లేదు. అందుకే కళింగ ప్రజలు తాము చనిపోయి అశోకునికి స్ఫూర్తి కలిగించిన శాంతి ప్రదాతలు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్నప్పటికీ అనేక ప్రాంతాలకు ఉపాధి కోసం తరలిపోయారు. ఆకివీడు మండలంలో వీరిని కాళింగులు అంటారు.

కళింగులు - శాఖలు[మార్చు]

కింతల కళింగ, బూరగాం కళింగ, పందిరి కళింగ, పాయికారి కళింగ, గౌడ చరిత్ర ప్రకారము, గౌడ కళింగ,, ఓడ కళింగ.

"https://te.wikipedia.org/w/index.php?title=కళింగ&oldid=3052083" నుండి వెలికితీశారు