కావనల్ కొండ
Cavanal Mountain | |
---|---|
అత్యంత ఎత్తైన బిందువు | |
ఎత్తు | 2,385 అ. (727 మీ.)[1] |
టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్ | 1,775 అ. (541 మీ.) |
భౌగోళికం | |
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/Oklahoma" does not exist.
| |
పర్వత శ్రేణి | Ouachita Mountains |
Topo map | USGS Cavanal Mountain |
ఓక్లహోమాలోని పోటేయు సమీపంలో ఉన్న కావనల్ హిల్ ను స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ "ప్రపంచంలోని ఎత్తైన కొండ"గా పేర్కొంది. ఎందుకంటే దాని శిఖరం ఎత్తు 609 మీటర్లు. అసలు శిఖరం ఎత్తు సముద్ర మట్టం నుండి 727 మీటర్లుంటుంది. శిఖరానికీ, 3 కిలోమీటర్ల దూరంలో నున్న పోటేయు నదికీ మధ్య ఎత్తులో తేడా 600 మీటర్లు. [3]
పేరు వ్యుత్పత్తి
[మార్చు]ఈ పేరు "గుహ" అనే అర్థం వచ్చే ఫ్రెంచ్ పదం కావెర్నె నుండి ఉద్భవించిందని ఒక మూలం పేర్కొంటోంది: [4] ఓక్లహోమా చరిత్రకారుడు మురియెల్ హెచ్. రైట్, కావనోల్ అనేది ఫ్రెంచ్ పదం caverneux యొక్క విరూపం అని అన్నాడు. దీనికి "గుహలాగా" అని అర్థం. [5]
చరిత్ర
[మార్చు]18 వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో పర్యటించిన ఫ్రెంచ్ అన్వేషకులకు కావనాల్ హిల్ ఒక ముఖ్యమైన మైలురాయి. వాళ్ళే దీనికి ఆ పేరు పెట్టారు. 1700 ల చివరలో, ఫ్రెంచ్ ఉన్ని సేకర్తలు కావనాల్ బేస్ వద్ద ఒక శిబిరాన్ని స్థాపించారు. దీనికి పోటేయు (స్థావరం) అని పేరు పెట్టారు. [6] థామస్ నుట్టాల్ 1819 లో ఇక్కడ మొక్కల జీవితాన్ని అధ్యయనం చేశాడు. స్థానిక ఫ్రెంచ్ సేకర్తల నుండి, ఇక్కడ నివసిస్తున్న భారతీయుల నుండి ఇతర సహజ అద్భుతాల గురించి తెలుసుకున్నాడు. [7]
టెరిటోరియల్ కాలంలో, కావనల్ హిల్ స్కల్లీవిల్లే కౌంటీ, షుగర్ లోఫ్ కౌంటీల సరిహద్దులో ఉండేది. ఈ రెండు కౌంటీలు, చోక్తావ్ నేషన్ లోని మోషులాతుబ్బీ జిల్లాలో భాగంగా ఉండేవి . 1800 ల చివరలో, వాల్టర్ బార్డ్ కావనల్ హిల్ శిఖరం వద్ద ఒక ఆరోగ్య రిసార్ట్ను స్థాపించాడు. ఇది కలపతో కట్టిన చిన్న నిర్మాణం. ఇది ఈ ప్రాంత సందర్శకులకు అందుబాటులో ఉండేది. ప్రకృతి దృశ్యంతో పాటు, ఈ ప్రాంతం అంతటా సంభవించే సహజ బుగ్గలు కూడా ఇక్కడి ప్రధాన ఆకర్షణ.
కావనల్ హిల్ ఎక్కే మార్గంలో సగం దూరాన జార్జ్ విట్టే, విట్టేవిల్లే పట్టణాన్ని స్థాపించాడు. ఇది బొగ్గు మైనింగ్ కంపెనీ పట్టణం. గనులు పట్టణానికి మూడు మైళ్ళ తూర్పున ఉన్నాయి. విట్టేవిల్లే ఇప్పటికీ కొన్ని పటాలలో గుర్తించబడి ఉంది. కావనల్ హిల్ పైభాగానికి దారితీసే "Y" వద్ద దీన్ని చూడవచ్చు. కొండపైకి వెళ్లే రహదారిలో ఎక్కువ భాగం విట్టేవిల్లెకు దారితీసిన అసలు రైలుమార్గంలో భాగం.
1960 లలో, సెనేటర్ రాబర్ట్ ఎస్. కెర్ కావనల్ హిల్ శిఖరం వద్ద వేసవి విడిది ఏర్పాటు చేశాడు. వాల్టర్ బియర్డ్ తన ఆరోగ్య రిసార్ట్ను మొదట స్థాపించిన స్థలంలోనే ఈ సమ్మర్ హౌస్ ఉంది. [8]
వినోదం
[మార్చు]కావనల్ హిల్ ఇప్పుడు మౌంటెన్ బైక్ రేసులకు, కావనల్ హిల్ కిల్లర్ 5-మైల్ వాక్‌కూ కేంద్రం. ఒక 7.2 కి.మీ. తారురోడ్డు శిఖరాగ్రం వరకూ ఉంది. ఇక్కడి నుండి పోటేయు రివర్ వ్యాలీ యొక్క సుందరమైన దృశ్యాలను చూడవచ్చు. ఆకాశం నిర్మలంగా ఉన్న రోజున, ఇక్కడ నుండి అర్కాన్సాస్‌లోని మౌంట్ మ్యాగజైన్‌ను చూడవచ్చు. [9]
మూలాలు
[మార్చు]- ↑ మూస:Cite loj
- ↑ "Cavanal Mountain". Geographic Names Information System. United States Geological Survey, United States Department of the Interior. Retrieved 2012-10-13.
- ↑ U.S. Geological Survey Poteau West 7.5 minute quadrangle
- ↑ [1] TravelOK.com Website. Retrieved September 19, 2012.
- ↑ Wright, Muriel H. "Some Geographic Names of French Origin in Oklahoma." Chronicles of Oklahoma. Vol.7, No. 2. June 1929. Archived 2017-02-02 at the Wayback Machine Accessed November 16, 2016.
- ↑ Standridge, Eric (June 20, 2012). The Birth of Poteau. Poteau, Oklahoma: Standridge and Shaw Publishing. p. 12. ISBN 1477603476.
- ↑ [2] TravelOK.com Website. Retrieved September 19, 2012.
- ↑ Standridge, Eric (June 20, 2012). The Birth of Poteau. Poteau, Oklahoma: Standridge and Shaw Publishing. p. 12. ISBN 1477603476.
- ↑ [3] TravelOK.com Website. Retrieved September 19, 2012.