కాంగేర్ లోయ జాతీయ అరణ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాంగేర్ లోయ జాతీయ అరణ్యం చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పుర్ పట్టణానికి దక్షిణాన 35 కిలో మీటర్లు దూరాన ఉన్న జాతీయ అరణ్యం. ఈ అరణ్యం పులులు, చిరుత పులులు, అడవి కోళ్ళు, ఇతర జంతువులు, పక్షులకి ప్రసిద్ధి. తీరత్‌గఢ్ జలపాతాలు, కుటుంసర్ గుహలు, కైలాస గుహలు ఈ అరణ్యంలోనే ఉన్నాయి.