కార్పెట్‌ ఏరియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇంటి కొనుగోలు సమయంలో ముఖ్యంగా అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లలో కార్పెట్‌ ఏరియా, బిల్టప్‌ ఏరియా, సూపర్‌ బిల్టప్‌ ఏరియా పదాలు వినిపిస్తుంటాయి.కార్పెట్‌ ఏరియా ఇంట్లో గదుల్లోని గచ్చు పరిధి వరకు విస్తరించిన ప్రాంతాన్ని కార్పెట్‌ ఏరియాగా పరిగణిస్తారు. గోడలను మినహాయించి లెక్కిస్తారు. ఉమ్మడి స్థలం మెట్లు, లిఫ్ట్‌, లాబీ, ఆట స్థలం వంటివి ఇందులోకి రావు. కాబట్టి కొనేటప్పుడు కార్పెట్‌ ఏరియా ఎంత అనేది తెలిస్తే వంటగది, హాలు, పడకగది, పిల్లల గది ఏ విస్తీర్ణంలో రాబోతుందనేది అవగాహనకు రావొచ్చు. చాలామంది బిల్డర్లు కార్పెట్‌ ఏరియాను వారి బ్రోచర్లలో స్పష్టం చేయరు. బిల్టప్‌ ఏరియా, సూపర్‌ బిల్టప్‌ ఏరియాపైనే ధర వసూలు చేస్తారు. సాధారణంగా బిల్టప్‌ ఏరియాలో 70 శాతం వరకు కార్పెట్‌ ఏరియా ఉంటుంది.