కాశీఖండం
కాశీఖండం | |
కృతికర్త: | శ్రీనాథుడు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | ప్రబంధం |
విభాగం (కళా ప్రక్రియ): | భక్తిసాహిత్యం |
ప్రచురణ: | వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు |
విడుదల: | 1888, 1917 |
పేజీలు: | 496 |
కాశీఖండము శ్రీనాథుడు రచించిన తెలుగు కావ్యము. ఇది క్రీస్తుశకం 1440 కాలంనాటి రచన.[1] స్కాంద పురాణంలో సులభగ్రాహ్యంగా ఉన్న ఈ కథా భాగాన్ని శ్రీనాథ మహాకవి కాశీఖండముగా రూపుదిద్దారు. ఇందులో వారణాశిగా ప్రసిద్ధిచెందిన కాశీ క్షేత్ర మహత్యం, దాని వైశిష్ట్యం, కాశీ యాత్రా విశేషాలు, శివునికి కాశీకి గల అనుబంధం, అనేక కథలు, ఉపకథలు, కాశీకి సంబంధించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి.
కథాసంగ్రహం
[మార్చు]సూతుడు శౌనకాదులకు కాశీఖండం కథను వివరిస్తాడు. వింధ్యపర్వతం తనకు మేరువుకు గల తారతమ్యం వివరించమని నారదుని కోరింది. నారదుడు మేరువు కూడా ఇలాగే పలికిందని తప్పుకున్నాడు. వింద్యపర్వత విజృంభణ వల్ల త్రిలోకాలకు ఆపద వాటిల్లింది. దాని నివారణకు దేవతలు మునులు బ్రహ్మ ఉపదేశంతో కాశీనివాసియైన అగస్త్యుని ప్రార్ధిస్తారు. అగస్త్యుడు కాశీ వియోగానికి చింతించి, దక్షిణదిశకు పోతూ వింద్య గర్వాపరణం చేస్తాడు. దక్షారామం దర్శించి, కొల్లాపురం శ్రీమహాలక్ష్మి ఆజ్ఞ పాటిస్తాడు. అగస్త్యుడు లోపాముద్రకు కాశీయే ముక్తిస్థానమని శివశర్మోపాఖ్యానాన్ని వివరిస్తాడు. విశ్వేశ్వరుడు పార్వతీదేవికి వివరించిన ప్రకారం కుమారస్వామి అగస్త్యునికి కాశీక్షేత్ర మహాత్మ్యాన్ని వివరిస్తాడు. వారణాసి నామ నిర్వచనం, ప్రకృతి పురుషులైన అర్థనారీశ్వరులు కాశీ చేరడం, కాశీలోని తీర్థ వాపికా కుండికా నదీ మహాత్మ్యాలు, లింగ ప్రాఅదుర్భావ మహాత్మ్యాలు అర్కుల మహాత్మ్యాలు వర్ణిస్తాడు. శివతీర్థ మహాత్య్మ వివరణకు సుశీల కథ కళావత్యుపాఖ్యానంలో వివరింపబడింది. బ్రహ్మ అనావృష్టి నివారణకు దివోదాసుకు భూరాజ్య పట్టాభిషేకం చెయ్యడం, ధరావియోగం వల్ల వేల్పులు దివోదాసుని పదవీభ్రష్టున్ని చెయ్యడానికి నిశ్చయీంచి పూనుఓడం దివోదాసు బొందితో నిర్యాణం పొందడం, దివోదాస వర్ణనంలో వివరించబడింది. విశ్వేశ్వరుని పరీక్షకు తట్టుకోలేని వ్యాసుడు కాశీని శపింపబూనడం, శివాజ్నచే కాశీవియోగం పొందడం, విశ్వేశ్వరుడు అంతర్దేహం ప్రవేశించడం, దేవతా యాత్రా విధాన వివరణ చెయ్యడం వర్ణించబడ్డాయి.
ప్రాచుర్యం
[మార్చు]శ్రీనాథ కృతమైన ఈ కాశీఖండం తెలుగు సాహిత్యంలో విశేషమైన ప్రాచుర్యాన్ని పొందింది.
బయటి లింకులు
[మార్చు]- కాశీఖండం గురించి గరికపాటి నరసింహారావు ప్రవచనం(1)[permanent dead link] 2[permanent dead link], 3[permanent dead link], 4[permanent dead link], 5[permanent dead link], 6[permanent dead link]
మూలాలు
[మార్చు]- ↑ కాశీఖండము, శ్రీనాథుడు, కావ్య సమీక్షలు, సంపాదకులు: ఎం.వి.సత్యనారాయణ, ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్, విశాఖపట్నం, 1983, పేజీ: 42-51.