కుంకుమపువ్వు కుటుంబము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
premium saffron
కుంకుమవువ్వు
కుంకుమపువ్వు క్రోకస్, క్రోకస్ సాటివస్, దాని స్పష్టమైన క్రిమ్సన్ స్టిగ్‌మాస్, స్టైల్స్
కుంకుమపువ్వు "థ్రెడ్లు", బెండ పువ్వుల నుండి తీసి ఎండబెట్టి
కుంకుమవువ్వు కుటుంబము

ఈ కుటుంబము మొక్కలు శీతల దేసములో గాని పెరుగ లేవు. ఇవి మనదేశములో అంతగా లేవు. వీనిలోనన్నియు గుల్మములే గాని పెద్ద చెటేలు లేవు. పుష్ప నిచోళములో ఆరురేకులుండును. కింజల్కములు మూడును పుష్స్ప నిచోళ ములైనను అండాశయము నైనను అంటి యుండును. అండాశయము ఉచ్చము. మూడు గదులు గలవు. కీలము ఒకటి కీలాగ్రములు మూడు.

మనదేశములో ఈ కుటుంబము లోని మొక్కలలో నుపయోగమైనది కుంకుమ పువ్వు మొక్కయె. ఇది చిరకలము నుండి మనదేశమున ఉంది. దీనిని ఔషధములో వాడుచున్నారు గాని కొందరంతగా బనిచేయదందురు.దీని దుంపలను ముక్కలు గోసి వానిని నాటి పైరు చేసెదరు. వీనిని మళ్లో నాటక పూర్వము చేలలో నీరు బోయక ఎండ గట్టుదురు. మొక్కలు పెరిగిన తరువాత అప్పుడప్పుడు నీరు పెట్టుట తప్ప వానికై అంతగా పాటు పడ నక్కరలేదు. ఇది పదునాలుగేండ్ల వరకు బ్రతుకును. వీని పుష్పములు మిక్కిలి అందముగాను పరిమెళముగాను నుండును. వీని నుండియే కుంకుమ పువ్వు చేసెదరు. పువ్వులను గోసి ఎండ బెట్టి పువ్వులలో నుండు మధ్య కాడలను (కీలములను) త్రుంపి వేరు చేసెదరు. ఇదియే మేలైన కుంకుమ పువ్వు. దీని వెల తులము రూపాయిన్నర... రెండు రూపాయలవరకు వుండును. ఈ కాడలపై నున్న తలలు వీని కంటే కొంచెము తక్కువరకము తరువాత పువ్వులను చిన్న కర్రతో గొట్టి నీళ్ళలో వేసెదరు. రేకులు పైకి తేలును. అడుగునకు దిగు వానిని పోగు చేసి మరల బాది నీళ్ళలో వేయుదురు. ఈ ప్రకారము మూడు మాట్లు చేయుదురు గాని అంతకంతకు తక్కువ రకము వచ్చును. దీని సువాసనకై తాంబూలమునందు పిండి వంటల యందు వాడు చున్నాము. దీనిని ఔషధములలో కూడా వాడుదురు. రాజులును మిక్కిలి ధనవంతులు దీనితో బొట్టు పెట్టు కొనుదురు. బహుశ దీని బట్టియే సాధారణముగా బొట్టు పెట్టుకొను దానికి కుంకుమ అని పేరు వచ్చి యుండును గాని కుంకుమ పువ్వు దీనియందణు మాత్రము లేదు. ఒక్కొక్కప్పుడు కుంకుమ పువ్వులో కుసుంబ పువ్వును గలిపి దగాచేయుదురు. కాని కుసుంబ పువ్వునకు కూడా మంచి వాసన గలదు.

మూలం

[మార్చు]

https://te.wikisource.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:VrukshaSastramu.djvu/429&action=edit[permanent dead link]