కృష్ణయజుర్వేదం

వికీపీడియా నుండి
(కృష్ణ యజుర్వేదం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కృష్ణ యజుర్వేదం లో కృష్ణయజుర్వేదం, శుక్ల యజుర్వేదం అని రెండు విధములు (శాఖలు) ఉన్నాయి. తైత్తిరీయ వేదములో సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము అను మూడు విభాగములు ఉన్నాయి. తైత్తరీయ సంహితయందలి 7 అష్టకాలలో కాండాలు, 44పన్నాలు లేదా ప్రశ్నలు (ప్రపాఠకములు), అధ్యాయాలు, 651 అనువాకములు, 2196 పనసలు (ప్రకరణములు) లేదా పంచాశత్తులు ఉన్నాయి. తైత్తరీయ బ్రాహ్మణం (పరాయితం) 3అష్టకాలలో కాండాలు, 38పన్నాలు అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో సృష్టివిధ్య, బ్రహ్మవిద్య, కర్మలను తెలియజేయు శాస్త్రము, శారీరక శాస్త్రవిద్య, గణితవిధ్య, అంతరిక్షవిద్య మొదలయినవి ఉన్నాయి. ప్రతి పనసలో ఏభయి పదములు ఉంటాయి. అనువాక అంతము నందున్న పనసలకును పదములు హెచ్చుతగ్గులు ఉండును. సంస్కృత భాషలో దీనిని పంచశాత్తు అని అంటారు.

ఐతిహ్యం[మార్చు]

  • కృష్ణ యజుర్వేదానికి తైత్తిరీయమనే పేరు రావడానికి వెనుక ఒక కథ ఉంది. తిత్తిరి అంటే తీతువు పిట్ట. యాజ్ఞవల్క్యుడు బ్రహ్మరాతుడనే ఒక ముని కుమారుడు. అతడు యజుర్వేదంలో దిట్ట అయిన వైశం పాయనుడనే ఋషి శిష్యుడు. ఒక సందర్భంలో అహంకారంతో మాట్లాడిన యాజ్ఞవల్క్యుడిని గురువు కోపించి తన వద్ద నేర్చుకొన్న యజుర్వేదాన్ని కక్కమన్నాడు. శిష్యుడు అలాగే చేశాడు. అతడు కక్కిన యజుర్గణం రక్తసిక్తమై ఉండగా తిత్తిరి పక్షుల రూపంలో యజుర్గణ దేవతలు వచ్చి వాటిని తిన్నారు. అప్పటి నుంచి వాటికి తైత్తిరీయమనే పేరు వచ్చిందని ఐతిహ్యం. వేదాన్ని అలా పోగొట్టుకొన్న యాజ్ఞవల్క్యుడు సూర్యుడి అనుగ్రహం కోసం ఘోరమైన తపస్సు చేశాడు. సూర్యుడు వాజి రూపంలో వచ్చి యజుర్గణాన్ని ఉపదేశించాడు. వాజి అంటే గుఱ్ఱం. కనుక అప్పటి నుంచి ఈ యజుర్వేద శాఖకు వాజసనేయ శాఖ అనే పేరు కూడా వచ్చింది.[1]
  • కృష్ణయజుర్వేదం: 'తైత్తిరి' అను పేరుగల ఆచార్యుడు ఆయన శిష్యులకు ఆ తదుపరి వారి వారి శిష్యుల పరంపరకు భోధించబడ్డది..

మూలాలు[మార్చు]

  1. పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010