Jump to content

కె. ఎం. మున్షీ

వికీపీడియా నుండి
(కె.ఎం. మున్షీ నుండి దారిమార్పు చెందింది)
కె.ఎం.మున్షీ
జననం30 డిసెంబర్ 1887
మరణం1971 ఫిబ్రవరి 8(1971-02-08) (వయసు 83)
వృత్తిరాజకీయవేత్త, లాయర్, రచయిత
రాజకీయ పార్టీస్వరాజ్ పార్టీ, కాంగ్రెస్
పిల్లలుజగధీష్ మున్షీ, లతా మున్షీ, గిరీష్ మున్షీ
తల్లిదండ్రులు
  • మానెక్ లాల్ (తండ్రి)
  • తాపీ బెహన్ (తల్లి)

కె. ఎం. మున్షీ (డిసెంబరు 30, 1887 - ఫిబ్రవరి 8, 1971) ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, రచయిత, మానవతావాది. కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు.

బాల్యం

[మార్చు]

మున్షీ గుజరాత్ లో 1887డిసెంబర్ 30న బ్రోచ్ లో జన్మించారు. తండ్రి రెవెన్యూశాఖలో చిన్న ఉద్యోగం చేసేవాడు. తల్లి తాపీ బెహన్ ఇంట్లోనే ఉంటూ పిల్లలకు చదువు చెప్పేది. మున్షీ 15వ ఏట తండ్రి మానెక్ లాల్ చనిపోయాడు.

విద్యాభ్యాసం

[మార్చు]

ఇంటర్ వరకూ గుజరాత్ లో చదువుకున్న మున్షీ, డిగ్రీ కోసం ముంబై వచ్చాడు. 1905లో బీఏ, 1910లో ఎల్.ఎల్.బి పూర్తి చేశారు. అనంతరం ముంబైలో లాయర్ గా స్థిరపడ్డారు.

అలవాట్లు

[మార్చు]

మున్షీ తన 9వ ఏట నుంచే డైరీ రాసేవారు. రోజు భగవద్గీతలోని ఓ వ్యాక్యాన్ని ముందు రాసి, డైరీని మొదలు పెట్టేవారు. ఉత్తరాలు కూడా రాసే అలవాటుంది. స్నేహితులకు, బందువులకు ఉత్తరాలు రాస్తూ సలహాలు ఇస్తుండేవారు.

రచనలు

[మార్చు]

వెర్ని వసూలత్, స్నేహసంభ్రమ, భగ్న పాదుక, తపస్విని ఈ నవలలను మన దేశ భాషలకే కాక ఇతర దేశ భాషల్లోకి అనువదించారు. మొత్తం 56 గ్రంథాలను రాశారు.

రాజకీయ ప్రవేశం

[మార్చు]

ముంబైలో లాయర్ గా పేరు ప్రతిష్టలు గడించిన ఆయన తన ఆదాయంలో కొంత భాగం పేదలకు దానం చేసేవారు. కాంగ్రెస్ పార్టీలో చేరి సర్దార్ వల్లభాయ్ పటేల్ , మహాత్మగాందీ, జవహర్ లాల్ నెహ్రూ లాంటి ప్రముఖుల అభిమానాన్ని చూరగొన్నారు.1939లో భారతీయ విద్యాభవన్ స్థాపించి విద్యా, సాహితీ సేవలు అందించారు. హైదరాబాద్ నిజాం దగ్గర అప్పటి బ్రిటీష్ ప్రభుత్వ రాయబారిగా పనిచేశారు. స్వాతంత్ర్యం తర్వాత 1950-52వరకు కేంద్రమంత్రిగా, ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా పనిచేశారు. 1971ఫిబ్రవరి 8న మరణించారు. [1]

మూలాలు

[మార్చు]
  1. సాహిత్యవేత్తలు:పేజీ నంబర్ 42