Jump to content

కౌండిన్య

వికీపీడియా నుండి
(కౌండిన్యులు నుండి దారిమార్పు చెందింది)
  • బ్రాహ్మణ కులాలు విస్తారంగా రెండు ప్రాంతీయ సమూహాలుగా విభజించవచ్చు:
కర్ణాటకాశ్చ తైలంగా ద్రావిడా మహారాష్ట్రకాః।
గుర్జరాశ్చేతి పంచైవ ద్రావిడా వింధ్యదక్షిణే॥
సారస్వతాః కాన్యకుబ్జా గౌడా ఉత్కళమైథిలాః।
పంచగౌడా ఇతి ఖ్యాతా వింధ్యస్యోత్తరవాసినః॥
  • ఈ పై శ్లోకం ద్వారా, ఉత్తర భారతదేశం, ఉత్తర వింధ్య పర్వతాలుకు చెందిన వారిని పాంచ గౌడ బ్రాహ్మణులు గా, దక్షిణ వింధ్య పర్వతాలు చెందిన వారిని పాంచ ద్రావిడ బ్రాహ్మణులు గా భావించారు. అయితే, ఈ శ్లోకం మాత్రం కల్హణ లోని రాజతరంగిణికి సంబందిచినది, ఇది 11 వ శతాబ్దం CE లో రచించిన, కూర్చింది.
  • అనువాదం: కర్ణాటక (కన్నడ), తైలంగ/తెలఁగ (తెలుగు), ద్రావిడ (తమిఴ్, కేరళ), మహారాష్ట్ర, గుజరాత్ అను ఐదు దక్షిణాది (పాంచ ద్రావిడ) లు ఉన్నారు. అలాగే సారస్వత, కన్యాకుబ్జము, గవుడ, ఉత్కళ్ (ఒడిషా), మైథిలి అను ఐదు ఉత్తరాది (పాంచ గౌడ) లు ఉన్నారు. ఈ వర్గీకరణ రాజతరంగిణి యొక్క కల్హణలో లేదా దానికి ముందువి ఉన్న కొన్ని శాసనాలలో జరుగుతుంది.

కౌండిన్య మహర్షి గౌడ కుల మూలపురుషుడు. కౌండిన్యుల వారి వారసులు గౌడులు. వీరికి ఉపనయన సంస్కారాలు ఉంటాయి. గౌడ సారస్వత బ్రాహ్మణులు. వీరు వేద పారంగతులు ధైర్య సాహసులై కొంటకాలము సా.శ.12వ శతాబ్దము నుండి చాళుక్య చక్రవర్తుల ఆధీనంలో దక్షిణ భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలను పాలించారు. వారిలో చెప్పుకోదగిన వారు సుమారు 1650 వ సంవత్సరములో సర్ఢార్ సర్వాయి పాపన్న గౌడ్ గోల్కోండ ఖిల్లాని పరిపాలించాడు తెలంగాణముఖ్య ప్రాంతాలను పాలించారు, కన్నడ దేశాన్ని పాలించిన కెంపె గౌడ ఈయన 1513-1569 మధ్య కాలంలో జీవించాడు. భారతదేశంలో ప్రముఖ నగరమైన బెంగుళూరు (1537లో) ఈయన స్థాపించినదే. కెంపె గౌడ వంశీకులు 18వ శతాబ్దము వరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ముఖ్య ప్రాంతాలను పాలించాడు.

కౌండిన్య వంశ చరిత్ర

[మార్చు]

కౌండిన్యుడు ఒక గొప్ప వేద పండితుడు. ఇతను వశిష్టుడి వంశంలో జన్మించినవాడు. ఇతని పేరు మీద గోత్రం పుట్టింది. కౌండిన్య గోత్రోద్భవులు ఇప్పుడు చెప్పబడుతున్న గౌడులు, వీరు నిజానికి వైదిక బ్రాహ్మణులు వీరికి ఉపనయన సంస్కారాలు ఉండేవి. ఇప్పటికి కూడా ఉత్తరభారతావనిలో గౌడ సారస్వత బ్రాహ్మణులుగా పిలువబడుతారు. వీరు చరిత్రలో గల కొన్ని అనివార్య కారణాల వలన వీరు దక్షిణాదికి వలస వెళ్లి వారి బ్రాహ్మణత్వాన్ని విడిచి కొందరు, విడువక కొందరు ద్రావిడ బ్రాహ్మణులుగా ఉన్నారు. బ్రాహ్మణత్వాన్ని విడిచిన వారు తెలంగాణా, ఆంధ్రా ప్రాంతాల్లో ఈత తాటి కల్లు (సురాపానం) తీసే పనిలో ఉన్నారు. అది కూడా వారి చరిత్రే అని చెప్పాలి. క్షీర సాగర మథనంలో బయలు వెడలిన అమృతమే ఈ కల్లు (సురాపానం). ఇప్పుడు కొందరు ఉపనయనముల గావించి పౌరోహిత్యాన్ని ఆచరిస్తున్నారు.

భద్రాశ్వుడను మహర్షికి ఘృతాచి అనే అప్సరస ఘృతాచి, మొదటి భార్య ఆమెకి భద్ర, శూద్ర, మద్ర, శలభ, మలద, బలా, హల, గోచలప, తామరస, రత్నకూట అనే పదిమంది కుమార్తెలు, ప్రభాకరుడు అనే కుమారుడు జన్మించారు.యుక్త వయసుకి వచ్చిన తరువాత భద్రాశ్వుడు ఈ పదిమంది కన్యలను నవబ్రహ్మలలో మూడవ వాడైన అత్రిమహర్షికిచ్చి వివాహం చేశాడు.అత్రిభార్యలందరూ సుందరాంగులు, సద్గుణశొభితలు, పతివ్రతలై యున్నారు.పైవారిలో మద్ర అను ఆమెకి “చంద్రుడు” కుమారుడుగా పుట్టాడు.ఆ సుందరాంగుడు అయిన చంద్రుడ్ని చూచి రాహువు తనకి ఆహారము దొరికెను అనుకుని మ్రింగడానికి వచ్చింది.రాహువుని చూచిన మద్ర భయంతో వణుకుచు మూర్చపోయింది. ఇది చూచిన సూర్యుడు కూడా స్పృహతప్పి ఆకాశం నుండి భూమి మీదకి పడుచుండగా ప్రపంచమంతా గాఢాందకారం ఆవరించింది. ఇది చూచిన అత్రిమహర్షి తన శక్తితో క్రిందపడుచున్న సూర్యుని మధ్యలో ఆపుచు – “ఖర కిరణా ! నీకుశుభముగాక ! ” అనగానే ఆ ముని వాక్య శక్తికి క్రిందపడబోయే సూర్యుడు మునుపటి వలనే స్వస్తుడై, యథాస్థితిని పొంది, అత్రిముని పైన గౌరవం కలిగి అత్రిముని గోత్రబృందాన్ని ప్రసిద్ధులు అయ్యేట్లు చేయ సంకల్పించి ఆత్మగుణ భవ్యులైన ఆత్మ జన్ములను సృష్ఠించాడు.వారందరూ సర్వగుణ వర్ధిత కీర్తులు, బ్రహ్మవాదులు, ఉర్వీరమణ ప్రపూజితులు, వేదవిదులు, ఆర్యధర్మ సంభార సమగ్రులు, ఉత్తములు, భాసురతేజులు, యోగనిష్ఠాగరిష్ఠులైన వరిష్టులయ్యారు. ఈ భూమ్మీద బ్రహ్మ వంశోద్భవుడైన అత్రిమహర్షికి శాంతమూర్తి, యశశ్శరదిందు చంద్రికా పరివృత దిగ్వధూమకుట భవ్యతలుండు, అఖిలార్థవేది, సుందర తనురాజితుడు, కరుణానిధి, పుణ్య సముద్రుడైన శ్రీకౌండిన్యుడు ఉద్భవించిన క్రమము ఎట్టిదనిన – ఈశ్వరుడు త్రిపురాసుని సంహరించడానికి పూర్వం, రాక్షసులంతా లోక కంటకులై దేవాతలను ఏ విధంగా అయినా జయించి అమృత పానంతో అమరత్వాన్ని పొందాలన్న కోరికతో దేవలపై దండెత్తి వారిని హింసించడం వలన వారి ధాటికి తట్టుకోలేని ఇంద్రుడు భయపడి మునులందరితో కలసి హిమాలయాలలో చాలాకాలం వుండిపోవడం వలన దిక్పాలకులు తమ పనులను సక్రమంగా నిర్వహింప లేకపోవడం వలన భూలోకంలో వర్షాలు సమయానికి కురవక కరువు కాటకాలతో పంట పొలాలన్నీ బీడువారి నెఱలు వచ్చి మానవులంతా ఆకలితో అలమటిస్తూ ఆహాకారలు చేస్తున్నారు. అప్పుడు లోక కళ్యాణం ఆశించిన మహర్షులందరూ కలసి బ్రహ్మయైన అత్రిమహర్షిని దర్శించి భూలోక వాసులను రక్షించి ఆకలి బాధల నుండి నివారణ చేయుడని ప్రార్థించారు. వారి ప్రార్థన మన్నించిన అత్రి మహర్షి దయార్ధ్ర హృదయుడై తన ఆత్మ తేజస్సుతో “ఓమ్ గౌడశ్యా శ్శివాయ స్వాహా” అనే దివ్య మంత్రోచ్చారణతో ఆయుధాన్ని ధరించిన ఒక దివ్య పురుషుణ్ణి ఉద్భవింపజేసి ఆ మానసపుత్రునకు “కౌండిన్యు” డని నామకరణం చేసి “కుమార ! నా తపః శక్తితో నీకు అనేక దివ్య శక్తులని అనుగ్రహించితిని భూలోకంలో వర్షాలు కురవకపోవడం వలన మానవులు ఆహార పానీయాలు లేక అల్లాడిపోతున్నారు. కనుక నీవు వెంటనే భూలోకంలోకి వెళ్ళి నీ దివ్య మహిమతో దేవలోక - భూలోక వాసులకు ఆహార పానీయలు కల్పించి రక్షించు” అని ఆజ్ఞాపించాడు.

తండ్రి ఆజ్ఞను శిరసావహించిన కౌండిన్యుడు భూలోకానికి వచ్చి రోగాగ్రస్తులై పడి వున్న మానవుల రోగాల్ని పోగొట్టడానికి ఆరోగ్యాన్నిచ్చే అనేక దివ్య మూలికలని, నయనానందకరములైన అనేకానేక లతాపుష్పాదులను సృష్ఠించి, గౌడ మంత్ర ప్రభావంతో మధుర రసాలిచ్చే కల్ప వృక్షాలనబడే ఈత, తాడి, కొబ్బరి మొదలగు ఫల వృక్షాల్ని కల్పించి వాటి సాయంతోను, అలాగే ధాన్యాదులను సృష్ఠించి దేవలోక భూలోక వాసులకి ఆహారాలను సమకూర్చి రక్షించాడు. (మూలం...బ్రాహ్మణ మార్తాండము) సా.శ. 357 లో థాయిలాండులో ప్రాంతీయంగా వాడబడు సంస్కృత భాషలో శ్రీకౌండిన్య చరిత్ర వ్రాయబడింది.

బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, శివ పూజా దురంధరుదు, సత్యవాడి తపోధనుడైన సుమంతుడను వానికి “ప్రదేవ” అనే భార్యయందు “మాయాకన్య” అనె కుమార్తె పుట్టింది. ఆ కన్య క్రమంగా స్త్రీగా మారి పూర్ణ యౌవ్వనవతి కాగా సుమంతుడు వరుణి అన్వేషణ ప్రారంభించాలని అనుకున్నాడు. అంతలో కౌండిన్యుడు తన తండ్రి అయిన అత్రిమహర్షి ఆజ్ఞానుసారం వివాహం చేసుకోవడం కోసం సుమంతుని వద్దకు వచ్చాడు. సుమంతుడు తన దివ్య దృష్ఠితో కౌండిన్యుని వృత్తాంతం తెలుసుకుని మిక్కిలి సంతోషించి తన కన్యను చూపించి వివాహం ఆడుమని కోరాడు. సమాన రూప లావణ్య వయస్సుతో శోభిల్లుతున్న ఆ యువతీ యువకులు పరస్పరం దర్శించుకుని వివాహానికి అంగీకరించారు. అప్పుడు సుమంతుడు పరమానంద భరితుడై తన భందు వర్గాన్ని సువాసినులైన ముని పత్నులని రప్పించి మాయాకన్యని కౌండిన్యునికి ఇచ్చి మహావైభవంగా వివాహం చేశాడు. చిరకాలమా అన్యోన్య దంపతులు సంసార సుఖములు అనుభవించగా తేజోవంతులు, దివ్యజ్ఞాన సంపన్నులైన కౌండిల్య, ఆయుధర్ముడు, వామాక్షుడు, దేవాశ్రయుడను నలుగురు పుత్రులు జన్మించారు. వీరే కౌండిన్య గోత్రోద్భవులైన దేవగౌడలు.[1]

కౌండిన్య పుత్రుల వివాహము

[మార్చు]

కుమారులు యుక్త వయస్కులైన తరువాత కౌండిల్యునకి – సత్యపాంధుని పుత్రిక అయిన స్ఫురద్రూపితోనూ, ఆయుధర్మునకు విమలాదేవితోను, వామాక్షునకు – నిర్మలాదేవి తోనూ, దేవాశ్రయునకు – కుశలాదేవి తోనూ వివాహాలు జరిపించాడు.తరువాత వీరు నలుగురు నాలుగు గోత్ర నామములతో వ్యవహరింపబడ్డారు. వీరు కూడా అమోఘ తపశ్శక్తి సంపన్నులై తమ మహిమలతో కల్పవృక్షములైన తాటి, ఈత, కొబ్బరిచెట్ల నుండి అమృత సిద్ధ రసములని సృష్ఠించి దేవ మానవులకిచ్చి వారి మన్నన లందుచుండెడివారు.

దేవగౌడుల – శివగౌడుల గోత్రములు

[మార్చు]
Kempegowda I.jpg
కెంపే గౌడ

(1) అత్రిగోత్రము (2) కౌండిన్య గోత్రము (3) కౌండిల్య గోత్రము (4) ఆయుధామ గోత్రము (5) హూమాక్ష గోత్రము (6) దేవాశ్రయ గోత్రము. ఈ గోత్రీకుల వారంతా శివదీక్షాపరాయణులు, శివ పూజా దురంధరులై దేవగౌడులని, శివ గౌడులని ఆకాలమున పిలువబడేవారు. వీరు తమ అద్భుత తపఃశ్శక్తి తోను, గౌడ మంత్ర ప్రభావం తోనూ, కల్ప వృక్షముల నుండి అమృత సిద్ధ రసములను కల్పించి దేవలోక వాసులయున గరుడ, గంధర్వ, యక్ష, సిద్ధ, నాగ, కిన్నర, కింపురుషాదులకు ఇచ్చి వారి ప్రశంసలకు పాత్రులు అవుతుండేవారు. దేవతలు ఆ అమృత సిద్ధ రసములను తాగి వాటి ప్రభవముతో బ్రహ్మజ్ఞాన సంపన్నులై విలసిల్లిరి.

కౌండిన్యునకు శంకర సాక్షాత్కారము

[మార్చు]

ఈ విధంగా కౌండిన్యుడు తన భార్య అయిన మాయాకన్యతో దీర్ఘకాలము సంసార సుఖములు అనుభవించి, తన కుమారులందరు దివ్యజ్ఞాన సంపన్నులు, సంతానవంతులు అయునందుకు ఎంతగానో ఆనందపడుతూ ఎటువసంటి చింతా లేనివాడై ఆనందంగా తపస్సుకు పోవడానికి నిశ్చయించుకుని తన జ్యేష్టుడైన కౌండిల్యుని పిలిచి – “నాయనా! నా ఆశీర్వాద బలంతో నీ సంతతి వారంతా కౌండిల్య గోత్రీకులై ఈ భూమి ఉన్నంత కాలం వారి సంతతి ఉంటుంది అని దీవించి” మిగిలిన కుమారుల వద్ద భార్య వద్ద అనుమతి పొంది శివుని గూర్చి తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడొక దివ్యస్థలాన్ని ఎంచుకుని ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేయడం ఆరంభించాడు. ఈ విధంగా అనేక దివ్య వర్షాలు గడిచాయి. అప్పుడు అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై – “నాయనా! కౌండిన్య! నిన్ను భూలోకమునకు పంపిన పని నెరవేరింది. నీవు నా అంశమున జన్మించావు కనుక నీ కీర్తి ఈ భూమ్మీద శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించాను. ఇక నుండి నీ వంశం ఈ లోకంలో ఆ చంద్ర తారార్కము ప్రఖ్యాతి గాంచగలదు. నీ తపస్సుకు మెచ్చి నీకు శాశ్వత బ్రహ్మలోక సౌఖ్యం కలిగేలా చేస్తున్నాను” అని వరమిచ్చి శివుడు అంతర్ధానమయ్యాడు. పరమేశ్వర సాక్షాత్కరంతో పులకితుడైన కౌండిన్యుడు పరమేశ్వరుని-

కౌండిన్య వంశక్రమము

[మార్చు]

పూర్వమొకప్పుడు పరమేశ్వరుడు కైలాసంలో ప్రమథ గణములతో కూడి తృప్తిగా సురాపానము చేసి సంతోషముగా వున్న సమయంలో శివ భకులలో అగ్రగణ్యుడైన నందీశ్వరుడు శివునకు నమస్కరించి – “మహాదేవా! దివ్య పురుషుడైన కౌండిన్య వంశీయులగు దేవగౌడుల వంశక్రమాన్ని తెలుము” అని ప్రార్థించాడు. దానికి అంగీకరించిన పరమశివుడు – “వత్సా! కౌండిన్య కుమారుడై దేవగౌడుడని ప్రఖ్యాతి గావించిన కౌండిల్యునకు – స్ఫురద్రూపి లకు నారాయణగౌడు అనువాడు జన్మించాడు. వానికి తన్వి అనే భార్యయందు – “ఉద్దాలక” అనువాడును, అతనికి తేజ ప్రభ అను ఆమెకి – “శౌణకర్ణి” అనువాడును, అతనికి శ్రౌత ధవ్యుడును, ఇతనికి గౌరవగ్రీవుడును, ఇతనికి వాగై రజితుడనువాడును, యీ వాగై రజితునకు ఆహుతి అని కన్యయందు అరణ్యుడను వాడు, యితనికి వామరధ్యుడును, యితనికి గోపనాశ్యుడనువాడు, ఈ గోపనాశ్యునకు కళ్యాణి అనే ధర్మపత్ని యందు పరమధర్మస్వరుపుడు, సత్యసంధుడైన గోపాలుడను వాడు జన్మించాడు. ఇతడే గోపాల గౌడుడను ప్రసిద్ధ నామంతో విలసిల్లి విదేహ, కోసల, కాశీరాజ్యాలను పాలించాడు. వీరు భూలోకంలో గౌడ వంశానికి చెందిన గోత్రకారులయ్యారని పరమేశ్వరుడు నందీశ్వరునకు చెప్పాడు.

కౌండిన్యాశ్రమ స్థల నిరూపణ

[మార్చు]

“కదిరి” అనంతపురం జిల్లాలోని కదిరి తాలుకాకు కదిరి ముఖ్య పట్టణం. ఇది పాకాల-ధర్మవరం రైల్వే లైనులో ఉంది. ఇక్కడ ప్రాచీన శ్రీనరసింహస్వామి వారి దేవాలయం ఉంది. ఈ స్టేషనుకు సమీపంలో “ముక్తాపురము” అనే గ్రామము ఉంది. ఇక్కడకు ఒకటిన్నర మైలు దూరంలో ఉంది.

శాసనము : త్రేతాయాం ప్రథమ పాదే, దేవగౌడస్య నామః క్రమ ప్రాప్తానాం, 
కనిష్ఠానాం కాటమ గౌడశ్యః, మహిశూర ప్రాంతానాం “ముక్తాపుర గ్రామ 
               నామస్య” ప్రదేశాయాం, కౌండిన్య శ్రమాయాం స్థాపయిత్వా భవతి, శివలింగ ప్రతిష్ఠానాం, సహస్ర శతత్రయః శిష్యోభవతి, శ్రీ నిజ సద్గురుభ్యోన్నమః |నిత్యం పూజానాం వదతిః | మహాభాగో లభతే శాశ్వత కైవల్యాంగశ్చతిః ||

అని ఉంది. ఇంకా అక్షరాలు స్పష్టంగా కనిపించని అనేక శిలాఫలకానున్నాయి. పై శాసనన్ని బట్టి కౌండిన్య వంశోద్భవులైన దేవగౌడులలోని అనేక మహానుభావులు వారి వంశాలను క్రమంగా త్రేతాయుగంలో వుద్భవించారని, వారందరూ గొప్ప తపః ప్రభావ సంపన్నులని ఈశ్వర సాక్షాత్కారం పొందారని, వారిలోని ఆఖరివాడు కాటమగౌడని తెలుస్తుంది. ఈకాటమగౌడు మహాభారత యుద్ధానంతరం వరకు వున్నాడని, శివపూజా దురంధురుడైన యీ మహనీయుడు తన వంశచరిత్రను, తన వంశానికి మూలపురుషుడైన కౌండిన్యుని స్మారక చిహ్నాన్ని ఆ చంద్రతార్కం నిలిచేలా భూలోకంలో స్థాపించాలని సంకల్పించి స్వయంగా తన తపోబలంతో కైలాసానికి వెళ్ళి శివానుగ్రహంతో ఒక శివలింగాన్ని తెచ్చి ముక్తాపుర గ్రామంలో పద్దెనిమిది ప్రాకారాలు గల ఒక బ్రహ్మాండమైన శివాలయాన్ని నిర్మించి అందులో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ ప్రదేశానికి “కౌండిన్యాశ్రమం” అని నామకారణం చేశాడు. ఈ కాటమ మహేశ్వరుడు తనకు గల మూడు వేలమంది శిష్యులతో కలిసి ఆ కైలాసపతిని నిత్యభిషేకములతో ధూప-ధీప-నైవేద్యాదులతో సేవిస్తూ పగలు రాత్రి అనే తేడా లేకుండా భజనాది కార్యక్రమములతో తన యిష్టదైవమైన శివుణ్ణి పూజిస్తూ భూలోక కైలాసమో అన్నట్లు ప్రతిదినము భక్తులకు అఖండ ప్రసాద వితరణతో పాటు శివపురాణము, శివ లీలామహత్యము, శివగీతాములు, శివతత్త్వసారము, మొదలైన గ్రంథాలని చదివి వినిపిస్తూ, అంత్యమందు ఈ పంచభూతలతో కూడిన దేహము పతనం అయిన తరువాత శాశ్వత కైవల్యాన్ని పొందుట వలన అయన కటమ మహేశ్వరుడనే ప్రసిద్ద నామంతో విరాజిల్లెనని నందీశ్వరునిచే చెప్పబడిన శివపురాణములో రాయబడింది. ఈ శివాలయంలో గౌడలే అర్చకులుగా ఉండి శివారాధన చేస్తూ అత్యంత శ్రద్ధాసక్తులతో శివున్ని సేవించి కడపట శివ సాన్నిధ్యాన్ని పొందారని పై పురణంలో చెప్పబడింది. కనుక అప్పటి నుండి గౌడులందరూ శైవ మతస్తులని, గణపతి పూజ్యులనియు, శాక్తేయులు శక్తిని (పార్వతి) ని పూజించువారని శివపూజాగ్రగణ్యులు అని తెలియుచున్నది. శివుడు తన ప్రమథ గణాధిపతులైన నందీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర, అశ్వముఖాదులతో గూడి సురాపానము చేసి పరమానంద భరితుడైనట్లు శివపురాణాంతర్గత శివలీలా మహత్యము, శివరాత్రి మహత్యము,, శివతత్త్వసారమనె గ్రంథాలలో వర్ణించబడింది. సురులందరు సురాపానము చేసినట్లు భృంగీస్వరస్తమనే గ్రంథంలో ఉంది. శివ గీతముతో పాటు గౌడ గీతములు, గౌడ గేయములు పాడబడేవని తెలియచున్నవి. నన్నెచోడుడు అనే మహాకావి తన “కుమార సంభవము” అనే గ్రంథములో శివుని పై అలిగిన పార్వతి తమస్సు చేయుటకు అడవికి పోయినపుడు అక్కడున్న ఎరుకల స్త్రీలు “జీఱిక కల్లు ద్రావి మద సింధుర గామిను లన్ని కేరియల్ వాఱుచు గౌడ గీతములు పాడుచు బొల్పుగ గ్రాలియాడుచున్ । అని వర్ణించాడు. ఇటువంటి గౌడ గీతములు అనేకములున్నట్టు ఈ గౌడ గీతములతో గౌడులు గౌరీశంకరులను స్తుతిస్తూ పరమానంద భరితులై సుఖంగా తమ జీవిత ధర్మాన్ని నిర్వహించే వారని “ఆదిగౌడ దీపిక” అనే గ్రంథంలో వ్రాయబడింది.

భారత దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న కౌండిన్య వంశ గోత్రాలు

[మార్చు]

1.అత్రి గోత్రము (ఉత్తర భారతం) 2.శ్రీకౌండీన్య గోత్రము (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తైలాండ్)3.భరద్వాజ గోత్రము, (ఉత్తర భారతం) 4.కశ్యప గోత్రము కర్నాటక, జార్కండ్) (ఉత్తర భారతం) 5.వశిష్ట గోత్రము. (ఉత్తర భారతం)6.కౌండీల్య గోత్రము, (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర భారతం)7.జమదగ్ని గోత్రము. (ఉత్తర భారతం) (మహారాష్ట్ర, కోంకణ్, గోవా) 8.భార్గవ గోత్రము, (ఉత్తర భారతం)9.శ్రీవత్స గోత్రము (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) 10.శివ గోత్రము, (తమిళనాడు)11.దత్తాత్రేయ గోత్రము (ఉత్తర భారతం) 12.ధనంజయ గోత్రము (ఉత్తర భారతం) 13.సురాబాండేశ్వర గోత్రము (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)14.తుల్య గోత్రము. (ఉత్తర భారతం)15.శ్రీ కంఠ మహేశ్వర గోత్రము (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) 16.వృద్ద గోత్రము. (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) 17.కారుణ్య గోత్రము. (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) 18.బృగు గోత్రము. (ఉత్తర భారతం)19.అగస్త్య గోత్రము (కేరళ)20. ఆయుధామ గోత్రము. (ఉత్తర భారతం)21. హూమాక్ష గోత్రము. (ఉత్తర భారతం)22. దేవాశ్రయ గోత్రము. (ఉత్తర భారతం)

రాష్ట్రలవారిగా కౌండిన్య వంశస్థులు

[మార్చు]

1.ఆంధ్రప్రదేశ్ ( గౌడ, గౌడ్, ఈడిగ, శెట్టిబలిజ, యాత, శ్రీశయన, సహస్రార్జున ) 2.తెలంగాణ ( గౌడ, గౌడ్) 3.అరుణాచల్ ప్రదేశ్ ( జైస్వాల్, బేహాట్, కల్వార్) 4.అస్సాం ( జైస్వాల్, బేహాట్,, సురి ) 5.బీహార్ ( బేహాట్, చాదురై, సౌండిక్, సొండి, సొంది, సుంది, కలార్, దద్సెన, జైన్ ) 6.ఛత్తీస్ ఘడ్ ( డేగ్ సేన, కలార్, సిన్హా, జైస్వాల్, సుంది, కొస్రే ) 7.గోవా ( గౌడ సరస్వత్, కలార్, పార్పి, నాందరి, భండారి, పాటిల్, జదర్, మిస్త్రి ) 8.గుజరాత్ ( బౌటా, రాండ్రియ, వడివాల, కుబేర్, ప్రహకర్, కలాల్ ) 9.హరియాన ( అహ్లూవాలియా, కలాల్, ) 10.హిమచల్ ప్రదేశ్ ( అహ్లూవాలియా, కలాల్) 11.జమ్మూ కశ్మీర్ ( గౌడ సరస్వత్, అహ్లూవాలియా, కలాల్) 12.జార్ఖండ్ ( జైసర్, చౌదరి, భగత్, సిండిక్, జైస్వాల్, సుండి, బేహాట్, కల్వార్, సురి) 13.కర్ణాటక ( ఈడిగ, గౌడ, గౌడ సరస్వత్, బిల్వాస్, నామాదరి, మోరాసు, పూజారి, షిండే) 14.కేరళ ( ఎజువా, తియ్యా, బిల్వా, విల్లవార్స్, జైస్వాల్, రామ్, చౌక్స్) 15.మధ్యప్రదేశ్ ( మహాజన్, చౌదరీ, సూర్యవంశి, సుండి, మాళవియ, కలాల్, సుర్దెష్ కలాల్, జైన్ కలార్, దహర్వాల్, జాహర్యా, సాహు, దంగేర్ లాల్, ) 16.మహారాష్ట్ర ( కలాల్, గౌడ్ కలాల్, భండారీ, నామదర్యా, బిల్లవా, జైన్ కలార్ ) 17.మణిపూర్ ( జైస్వాల్, బేహాట్, కల్వార్ ) 18.మేఘాలయ ( జైస్వాల్, బేహాట్, కల్వార్ ) 19.మిజోరం ( జైస్వాల్, బేహాట్, కల్వార్ ) 20.నాగాలాండ్ ( జైస్వాల్, బేహాట్, కల్వార్ ) 21.ఒరిస్సా ( గౌడ, సుండ్రి, సునిరి, సౌండిక్, అహ్లూవాలియా, కలాల్, వాయిల్యా ) 22.పంజాబ్ ( సోమవంశి, చౌదరీ, కరన్ వాల్, పారేట, టాక్, మేవ్రా, ఏర్జియా, సువాల్క ) 23.రాజస్తాన్ ( ధనేటవల్, జైస్వాల్, పాటాల్, వేగ్రా ) 24. సిక్కిం ( జైస్వాల్, బేహాట్, కల్వార్ ) 25. త్రిపుర ( జైస్వాల్, బేహాట్, కల్వార్ ) 26.ఉత్తరఖండ్ ( కలాల్, జైస్వాల్ ) 27.ఉత్తరప్రదేశ్ ( జైస్వాల్, బేహాట్, కల్వార్, చౌదరీ ) 28.పశ్చిమ బెంగాల్ ( గౌడ, గౌర్, కలాల్, కల్వార్, ప్రసాద్, సుంధి, సిందిర్ ) 29.తమిళనాడు (నాడర్, షెహనార్, ఐవార్, ఇల్లాత్, పిల్లమార్, నాథన్ ) 30.ఢిల్లీ, డయ్యు, డామన్, లక్షద్వీప్, పాండిచ్చేరి, యానాం ( గౌడ, జైస్వాల్ ) 31.శ్రీలంక ( దుర్వే, నల్వీర్ ) 32.థాయిలాండ్, సుమిత్ర, ([2] జావా కుండిన్, కుందిన్).

మూలాలు

[మార్చు]
  1. "all-india-gouda-history" (PDF).{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "kaundinya-gotra-origin-and-history". Archived from the original on 2020-02-02.

ఇతర లింకులు

[మార్చు]

మూల గ్రంథాలు ఋగ్వేదము, శివనందీశ్వర సంవాదము, శివతత్త్వసారము, బోధాయన సూత్రం, మత్స్య పురాణం, స్కంద పురాణం, బృహత్ సంహిత, హితోపదేశం, ప్రబోధ చంద్రోదయం, మూహుర్త చింతామణి, వరహా శాసనం, పురాణ నామ చంద్రిక, మహా భారతం, ఖాలీపురం తామ్రశాసనం, బ్రాహ్మణోత్పత్తి మార్తాండం, ఆది గౌడ దీపిక, మను ధర్మశాస్త్రము, సాహిత్య దర్పణం, మాండూక్యోపనిషత్తు, సనత్కుమార సంహితం, కచ దేవయాని కథ, శౌనక శుక్ర సంవాదము. మల్లిఖార్జున సిద్ధయోగి గౌడ పురాణం, గంగవంశ చరిత్ర, వాల్మీకి రామాయణం, సుశ్రుత సంహిత, కల్హణ రాజతరంగిణి, శతపథ బ్రాహ్మణం, కాశీయోగీశ్వరుల వారు మౌఖికంగా చెప్పిన బ్రాహ్మణ చరిత్ర.

"https://te.wikipedia.org/w/index.php?title=కౌండిన్య&oldid=3838952" నుండి వెలికితీశారు