Jump to content

రైతు

వికీపీడియా నుండి
(కౌలుదారులు నుండి దారిమార్పు చెందింది)
రైతు
పొలంలో ఎరువు చల్లుతున్న రైతు
వృత్తి
వృత్తి రకం
ఉపాధి
కార్యాచరణ రంగములు
వ్యవసాయం
వివరణ
ఉపాధి రంగములు
వ్యవసాయం

వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు అంటారు. వ్యవసాయదారుడు అని కూడా అంటారు. ఆహార పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు. సాధారణంగా రైతులు తమ సొంత భూమిలోనే సాగు చేస్తూంటారు. ఇతరుల భూమిని అద్దెకు తీసుకుని కూడా చేస్తూంటారు. దాన్ని కౌలు అని, వారిని కౌలు రైతులనీ అంటారు. పొలం పనుల్లో భాగంగా రైతు పనిలో పెట్టుకునే వారిని రైతుకూలీలు అంటారు.

చరిత్ర

[మార్చు]

కంచుయుగం నాటికి, సా.శ.పూ. 5000-4000 నాటికే సుమేరియన్లకు వ్యవసాయ కూలీలు ఉన్నారు. వ్యవసాయంలో వాడుకునేందుకు గాను, పశుపోషణ చెయ్యడం వేల సంవత్సరాలుగా జరుగుతోంది. తూర్పు ఆసియాలో 15,000 ఏళ్ళ కిందటే కుక్కలను పెంచారు. సా.శ.పూ. 7,000 నాటికి ఆసియాలో మేకలు, గొర్రెలను పెంచారు. సా.పూ. 7,000 నాటికి మధ్య ప్రాచ్యం, చైనాల్లో పందులను పెంచారు. సా.పూ. 4,000 నాటికి గుర్రాలను పెంచారు.[1] సింధు లోయ నాగరికత నాటికే భారతదేశంలో వ్యవసాయం ఉంది. దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల అంతకు ముందు నుండే ఉంది.[2][3]

భారతదేశంలో రైతు

[మార్చు]

భారతదేశంలోని మొత్తం కార్మికుల సంఖ్యలో అత్యధిక శాతం రైతులు, రైతు కూలీలే. 2020 నాటికి దేశంలో మొత్తం రంగాల్లో ఉన్న ఉపాధిలో 41.49% భాగాన్ని వ్యవసాయ రంగమే కల్పిస్తోంది. దీనితో పోలిస్తే దేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగపు శాతం చాలా తక్కువ. 2016 లో జిడిపిలో వ్యవసాయం వాటా 17.5% మాత్రమే ఉంది. ఇది క్రమేణా క్షీణిస్తోంది. [4][5][6][7]

ఆరోగ్యం పై ప్రభావం

[మార్చు]

ట్రాక్టర్లు, హార్వెస్టర్లూ వంటి యంత్రాలతో పని చెయ్యడంలో వాటితో ప్రమాదాలకు లోనౌతూంటారు. దీర్ఘ కాలంలో రైతులు కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులకు గురవడం కూడా జరుగును.[8]

మూలాలు

[మార్చు]
  1. "Breeds of Livestock - Oklahoma State University". Ansi.okstate.edu. Archived from the original on 2011-12-24. Retrieved 2011-12-10.
  2. Brese, White (1993). "Agriculture".[permanent dead link]
  3. "CDC - Insects and Scorpions - NIOSH Workplace Safety and Health Topic". web.archive.org. 2015-09-03. Archived from the original on 2015-09-03. Retrieved 2020-10-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "CIA Factbook: India-Economy". Retrieved 17 November 2018.
  5. "Agriculture's share in GDP declines to 13.7% in 2012–13". Archived from the original on 2016-09-06. Retrieved 2022-11-29.
  6. Staff, India Brand Equity Foundation Agriculture and Food in India Accessed 7 May 2013
  7. "Labor force by agriculture sector in India".
  8. Kumaraveloo, K Sakthiaseelan; Lunner Kolstrup, Christina (2018-07-03). "Agriculture and musculoskeletal disorders in low- and middle-income countries". Journal of Agromedicine (in ఇంగ్లీష్). 23 (3): 227–248. doi:10.1080/1059924x.2018.1458671. ISSN 1059-924X.
"https://te.wikipedia.org/w/index.php?title=రైతు&oldid=4357867" నుండి వెలికితీశారు