Jump to content

కౌలం

వికీపీడియా నుండి
(కౌళం నుండి దారిమార్పు చెందింది)

1. వామాచార మార్గాలు ఐదింటిలోనూ కౌలం(ళం) ఒకటి. పంచ మకారాలను ఆశ్రయించి చేసే తాంత్రిక సాధన. ఇందులో పశు, వీర, దివ్య భావాలు ఉంటాయి. పశు భావన దశలో ఇంద్రియ సుఖాలను అనుభవిస్తారు. మద్యం, మగువలను ఉపయోగించిన తరువాత వీరోపాసన చేస్తారు. చివరిదైన దివ్యభావన చేరితే సాధకుడు గమ్యం చేరినట్లే. కాని, అలా చేరిన వారు అరుదు. సృష్టి, స్థితి, లయాలలో చివరిదైన సంహార క్రమానికి కౌలంలో ప్రాముఖ్యం ఉన్నదని ఒక వాదం ఉంది. కాని తగిన ఆధారాలు లేవు. ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ అందులో నుంచి బయటపడటం కష్టసాధ్యం. కనుక చాలా మంది అందులోనే కూరుకుపోతారు. పశుభావన దశలో ఇంద్రియ సుఖాలను అనుభవించి బయట పడగలిగినవారు గురువు సహాయాన్ని పొంది, ‘‘సోహం’’ భావనతో దివ్య భావన దశ చేరుతారని కౌలాన్ని పాటించేవారి విశ్వాసం. పంచ మకారాలను వీరు సమర్థిస్తారు. మద్యం అంటే అర్థం కల్లు సారాయిలో, తత్తుల్యాలో కావనీ, కుండలినీ సాధనలో సహస్ర దళ పద్మం నుంచి అంటే సహస్రారం నుంచి స్రవించే (సుధ) అమృతమేననీ అంటారు. మనస్సును అదుపు చేసి, వాక్‌, తదితర ఇంద్రియాలను నియంత్రించి, పాప, పుణ్యాలను జ్ఞాన ఖడ్గంతో ఛేదించడమే ‘‘మాంసం’’. మత్స్యం అంటే తినే వంటలోకి ఉపయోగించే చేప కాదు. నిరంతరం అటూ ఇటూ కదలాడుతూ ఉండే ఇడా పింగళ నాడుల మధ్య శ్వాసే మత్స్యం. ముద్రా భక్షణం అంటే అటుకులు తినడం కాదు. కుండలినీ శక్తిని సహస్రారం చేర్చి, బలమైన కోర్కెలకు కళ్ళెం వేయడం. మైథునం అంటే స్త్రీ సంగమం కాదు. జీవాత్మ, పరమాత్మల కలయికే మైథునం. ఇదే దివ్య భావన అని వివరిస్తారు కౌలం పాటించేవారు. కౌల(ళ)ము శబ్దం ‘కులం’ నుంచి వచ్చిందనీ, కొన్ని కులాచారాలు ఇలా కౌలంగా పరిణ మించాయనీ కొందరి అభిప్రాయం. 2. కౌళాచారాన్ని తెలియజేసే గ్రంథం.

"https://te.wikipedia.org/w/index.php?title=కౌలం&oldid=3877784" నుండి వెలికితీశారు