Jump to content

త్వరిత స్పందన సంకేతం

వికీపీడియా నుండి
(క్యూఆర్ కోడ్ నుండి దారిమార్పు చెందింది)
తెలుగు వికీపీడియా ప్రధాన పేజీ యుఆర్‌ఎల్ యొక్క క్యూఆర్ కోడ్ "https://te.wikipedia.org"
ఇంగ్లీషు వికీపీడియా మొబైల్ ప్రధాన పేజీ యొక్క యూఅర్‌ఎల్‌కు క్యూఆర్ కోడ్, "http://en.m.wikipedia.org"

త్వరిత స్పందన సంకేతంను ఆంగ్లంలో క్విక్ రెస్పాన్స్ కోడ్ అంటారు, దీనిని సంక్షిప్తంగా క్యూఆర్ కోడ్ అంటారు. క్యూఆర్ కోడ్ అనగా ట్రేడ్మార్క్, ఇది మాట్రిక్స్ బార్ కోడ్ (లేదా ద్విమితీయ బార్కోడ్) యొక్క ఒక రకం, ఇది జపాన్ లో ఆటోమేటివ్ పరిశ్రమ కోసం మొదట రూపొందించబడింది. బార్‌కోడ్ అనగా యంత్రం చదవగలిగే ఆప్టికల్ లేబుల్, ఇది అనుబందించబడిన అంశానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది. సమర్ధవంతంగా డేటా నిల్వ చేయడానికి ఒక క్యూఆర్ కోడ్ నాలుగు ప్రామాణిక ఎన్‌కోడింగ్ రీతులు (సంఖ్య, ఆల్ఫాన్యూమెరిక్, బైట్/బైనరీ, కంజి) ఉపయోగిస్తుంది; అలాగే పొడిగింపులు కూడా ఉపయోగించవచ్చు.

క్యూఆర్ కోడులను ప్రత్యేక బార్కోడ్ రీడర్లు, సెల్ ఫోన్ కెమెరాలు, కంప్యూటర్ వెబ్‌క్యామ్‌లు చదివి దానిలో దాగివున్న సమాచార ఫార్మాట్ ను వెలికితీసి మనకు చూపిస్తాయి. ఉదాహరణకు ఆ ఫార్మాట్ యుఆర్‌ఎల్ అయితే ఆ యుఆర్‌ఎల్ లింకును క్లిక్ చేయటం ద్వారా ఆ సైట్ కు వెళ్లతాము. ఈ విధంగా అతి త్వరగా సంబంధిత దాగివున్న ఫార్మాట్ సమాచారాన్ని చూపించే కోడ్ గనక దీనికి క్విక్ రెస్పాన్స్ కోడ్ (త్వరిత స్పందన సంకేతం) అనే పేరు వచ్చింది.

చరిత్ర

[మార్చు]

క్యూఆర్ కోడ్ వ్యవస్థను "డెన్సో వేవ్" 1994 లో కనుగొన్నారు.

క్యూఆర్ కోడ్ ఉపయోగం

[మార్చు]