Jump to content

గుండె ఆహారం

వికీపీడియా నుండి
(గుండె ఆహారము నుండి దారిమార్పు చెందింది)

గుండె ఆరోగ్యముగా, పదిలముగా ఉండడానికి పలు ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలు ఉన్నాయి. గుండె రిస్క్ కు గురికాకుండా ఉండాలంటే తక్కువగా శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉండే రెడ్ మీట్, తాజాపండ్లు, కూరగాయలు, ఎక్కువ చేపలు, తక్కువ పంచదార, ఎక్కువ ఫైబర్ తీసుకోవాలి.

కొన్ని ముఖ్యమైన ఆహారపదార్ధములు :

టొమాటోలు

[మార్చు]

వీటిలో విటమిన్లు, లైకోపిన్‌ లు, పుష్కలముగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల రిస్క్ ను తగ్గిస్తాయి. టమాటోలు ఏవిధము గానైనా తినవచ్చును. యాంటీ ఆక్షిడెంట్లు, లైకోపిన్‌ మూలంగానే టొమాటోలు ఎర్రగా ఉంటాయి. రక్త ప్రసరణ నియంత్రించడానికి ఉపయోగపడతాయి. విటమిన్‌ " సి, ఇ, ప్లేవనాయిడ్స్, పొటాషియం వంటివి పుష్కలము గా ఉంటాయి.

బ్రోకోలీ (పచ్చ క్యాలీఫ్లవర్‌)

[మార్చు]

ఇది ఒక రకము తోటకూర లాంటిది. వీటిలో కెరోటి నాయిడ్స్, ఇండోల్స్, లాంటి రసాయన సమ్మేళనాలుంటాయి. ఇవి కాన్సర్ కణాలు ఉత్పత్తి కాకుండా నిరోధిస్తాయి. బ్రకోలీ లో విటమిన్‌ ' సి ' ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆసిడెంట్స్ గా పనిచేసే విటమిన్‌ ' ఇ ' ఇంకా కాల్సియం, బి 2, ఐరన్‌ ఎక్కువగా ఉంటాయి. అధిక రక్తపోటు నుండి గుండెను రక్షించే " సల్పరోఫన్‌ " ఇందులో ఉంటుంది.

దానిమ్మ

[మార్చు]

ప్రతిరోజూ ఒకగ్లాసు దానిమ్మ రసము తీసుకునట్లయితే కొలెస్టిరాల్ కంట్రోల్ లో ఉంటుంది. ఇందులో ఉండే విటిమిన్‌ ' బి 12 ' రక్తములో ఎర్ర రక్తకణాలు తయారీ కి అవసరము. గుండె ఆరోగ్యాన్ని పెంచే యాంటి ఆక్షిడెంట్లు అధికము గా ఉన్నందున ఇది గుండ జబ్బులు రానీయకుండా కాపాడును.

గుమ్మడి కాయ

[మార్చు]

గుమ్మడి కాయలలో బీటాకెరోటిన్‌ లు ఎక్కువగాఉంటాయి. ఇవి శరీరములో విటమిన్‌ ' ఎ ' గా మార్పుచెంది భగు ప్రయోజనాలు కలిగిస్తాయి. గుండెజబ్బులు, క్యాన్సర్, త్వరగా వయసు పెరిగినట్లు కనిపించడానికి కారణమయ్యే ఫ్రీరాడిలల్స్ ప్రారదోలడము లో సహకరించి గుండెను కాపాడుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందున గుండెకు మేలు జరుగుతుంది.

చేపలు

[మార్చు]

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దండిగా ఉంటాయి. రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడకుండా, గుండె వాపు రాకుండా, కొలెస్టిరాల్ తగ్గించడము ద్వారా ఈ ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్ కాపాడుతాయి. సార్డిన్‌ చేపలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సన్నని ఎముకలు చిన్నవిగా ఉన్న చిన్న చేపలలో ఖనిజలవణాలు ఎక్కువగా ఉండును.

బెర్రీస్

[మార్చు]

బెర్రీస్ గుండె ఆరోగ్యానికి మంచి పౌష్టికాహారము. ఇవి తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. మంచి కొలెస్టిరాల్ పెరుగుతుంది. బెర్రీస్ లో " పాలిఫినాల్స్, యాంటీఆక్షిడెంత్లు రోగాలపై పోరాడి గిండెను కాపాడు తాయి.

మూలాలు

[మార్చు]