గుర్నాధనగర్
Appearance
(గుర్నాథనగర్ నుండి దారిమార్పు చెందింది)
గుర్నాధనగర్ బాపట్ల జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గుర్నాథనగర్ | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°56′47″N 80°47′21″E / 15.946400°N 80.789297°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | నిజాంపట్నం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522 262 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
గ్రామవిశేషములు
[మార్చు]- ఈ గ్రామం వివాదాలకు దూరంగా ఉండే పల్లెగా పేరుతెచ్చుకున్నది. వివాదాలకు మూలమైన ఎన్నికలలోనూ తాము పోటీ సమయంలోనే వేర్వేరుగా వ్యవహరిస్తాం తప్ప తరువాత ఒకటిగానే ఉంటామని గ్రామస్థులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికలల వరకూ తాము విలువలకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. గ్రామ పెద్దల చొరవతో ఎలాంటి వివాదాలకూ తాము పోకుండా, సజావుగా, ప్రశాంతంగా, ఎన్నికల ప్రక్రియ సాగుతుంది. దాదాపుగా పార్టీలకతీతంగా, అందరికీ ఆమోద్య యోగమైన వ్యక్తినే స్థానిక సంస్థలకు ఇక్కడ ఎన్నుకుంటారు. దేశానికే ఆదర్శ గ్రామంగా ఉన్న ఈ గ్రామంలో ఉచిత న్యాయసలహా కేంద్రం ఏర్పాటుచేశారు. ఈ పల్లెల్లో ప్రజలు విద్యా రంగంలో గూడా ముందున్నారు. [1]
గ్రామపంచాయితీ
[మార్చు]- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి రాయన కోటేశ్వరమ్మ, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [2]
మూలాలు
[మార్చు]