గ్రీకు భాష

వికీపీడియా నుండి
(గ్రీకు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రచయిత హోమర్

గ్రీకు భాష ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలోని స్వతంత్ర శాఖకు చెందిన భాష. గ్రీస్, సైప్రస్, అల్బేనియా ఇంకా తూర్పు మధ్యదరా ప్రాంతం, నల్ల సముద్ర ప్రాంతాల్లో పుట్టిన భాష ఇది. ఈ భాషకు ఇండో యూరోపియన్ భాషలన్నింటిలోకి అత్యధికంగా 3400 సంవత్సరాల సుదీర్ఘ లిఖిత చరిత్ర ఉంది.[1] ఈ భాషను రాయడానికి గ్రీకు అక్షరాలను ఉపయోగిస్తారు. ఈ లిపి సుమారు 2000 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంది. అంతకు మునుపు కూడా దీన్ని లీనియర్ బి, సైప్రియట్ సిలబరీలో అక్షరబద్ధం చేయబడి ఉన్నది.[2] ఈ అక్షరమాల ఫోనీషియన్ లిపి నుంచి ఉద్భవించింది. ఇది లాటిన్, సిరిలిక్, ఆర్మేనియన్, కాప్టిక్, గోతిక్ లాంటి మరెన్నో అక్షరమాలలకు ఆధారమైంది.

పాశ్చాత్య ప్రపంచ చరిత్రలో గ్రీకు భాష ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.[3] హోమర్ రాసిన ఇతిహాసాలతో ప్రారంభించి ప్రాచీన గ్రీకు సాహిత్య రచనలు యూరోపియన్ కానన్ లో ప్రాముఖ్యమైన రచనలుగా ఉన్నాయి. సైన్సు, తత్వ శాస్త్రాలకు సంబంధించిన అనేక ప్రాథమిక రచనలు ఈ భాషలోనే రాయబడి ఉన్నాయి. క్రైస్తవ మతానికి చెందిన న్యూ టెస్టమెంట్ కూడా గ్రీకు భాషలోనే రాయబడింది.[4][5] ఆధునిక గ్రీకు భాష గ్రీస్, సైప్రస్ దేశాలలో అధికారిక భాష, యూరోపియన్ యూనియన్ గుర్తించిన 24 అధికారిక భాషల్లో ఒకటి. గ్రీస్, సైప్రస్, ఇటలీ, అల్బేనియా, టర్కీ, ఇంకా ఇతరదేశాలను కలుపుకుంటే ఈ భాషను 1 కోటి 35 లక్షలమందికిపైగా ఈ భాషను మాట్లాడుతున్నారు. ఇతర భాషల్లో పదాలను ప్రతిపాదించడానికి గ్రీకు పదాలను తరచుగా వాడుతుంటారు. గ్రీకు, లాటిన్ భాషలను అంతర్జాతీయ సైన్స్ సమాజం ప్రబలమైన మూల భాషలుగా వాడుకుంటుంది.

మూలాలు[మార్చు]

  1. "Greek language". Encyclopædia Britannica. Encyclopædia Britannica, Inc. Retrieved 29 April 2014.
  2. 1922-, Adrados, Francisco Rodríguez (2005). A history of the Greek language : from its origins to the present. Leiden: Brill. ISBN 978-90-04-12835-4. OCLC 59712402. {{cite book}}: |last= has numeric name (help)CS1 maint: multiple names: authors list (link)
  3. A history of ancient Greek by Maria Chritē, Maria Arapopoulou, Centre for the Greek Language (Thessalonikē, Greece) pg 436 ISBN 0-521-83307-8
  4. Kurt Aland, Barbara Aland The text of the New Testament: an introduction to the critical 1995 p52
  5. Archibald Macbride Hunter Introducing the New Testament 1972 p9