Jump to content

చర్చ:చలమచర్ల వేంకట శేషాచార్యులు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
(చర్చ:చలమచర్ల వెంకట శేషాచార్యులు నుండి దారిమార్పు చెందింది)

శ్రీనివాస్(Sreenyvas) గారూ, ఇది మీ తండ్రిగారి గురించి రాసిన వ్యాసమా? --వైఙాసత్య 02:32, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసం

[మార్చు]
  • ఈ వ్యాసం ఈ సభ్యుడు తన సంబంధీకుల గురించి తానే రాసుకున్న వ్యాసంలా కనిపిస్తుంది.
  • ఈయన పేరుమీద వ్యాసం అవసరమో లేదో నిర్ధారించుకోవాలి.
  • ఇక్కడ ఇచ్చిన సమాచారానికి మూలాలు లేవు
  • వ్యాసం శైలి వికీ ప్రమాణాలకనుగుణంగా లేదు. ఇది వ్యాసంలా కంటే రెసుమే లాగా ఉంది.
  • భాషలో గౌరవార్ధ బహువచన ప్రయోగాలు ఉన్నాయి.

--వైఙాసత్య 03:02, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్య గారు, మీరు ఊహించినట్లుగా, ఇది మా నాన్న గారికి సంబంధించిన సమాచారము. ఈ వ్యాసం అవసరమా లేదా అన్నది మీరే నిర్ణయించాలి. సమాచారానికి సంబంధం గల మూలాలు కొన్ని వికి లోనే ఉన్నాయి. ఇది కేవలం తొలి సమాచారం మాత్రమే. త్వరలోనే సమగ్ర సమాచారము ఉంచగలను. అలాగే భాష, మరియు శైలి మార్చగలను. తమ అభిప్రాయము తెలియపరచగలరు. --Sreenyvas 14:57, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
తన గురించి తాను వ్యాసము వ్రాయకూడదని నిబందన ఉన్నదని విన్నాను, తన దగ్గర వారి గురించి వ్రాయవద్దు అనేది నాకు తెలిసి ఇప్పటి వరకూ లేదు. ఇహపోతే నా అబిప్రాయము అయితే ఈ వ్యాసము ఉంచ వచ్చు, ముందే చెప్పినట్టు శైలి మార్చ వలెను, ముందు కొద్దిగా ఉపోద్ఘాతము ఇస్తే చదువరులకు ఎవరు ఏమిటి అని ఒక అబిప్రాయము వస్తుంది. ఇహ పోతే ఈ వ్యాసము నుండి ఇతర వ్యాసములకు లింకులు, మూలాలు తప్పని సరి. Chavakiran 15:02, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
చావాకిరణ్ గారు, తమ యొక్క సూచనలకు ధన్యవాదములు! వ్యాసమును వికి యొక్క పద్ధతులకు అనుగుణముగా సరిదిద్దుతాను. --Sreenyvas 16:56, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
తగిన మూలాలు, వనరులను ఉదహరించిన పక్షంలో ఈ వ్యాసం వికీపీడియాలో ఉండదగినదేనని నా అభిప్రాయం. అయితే ఫోటో పక్కన ఉన్న చిరునామాను తొలగించాలి. వ్యాసాల్లో అడ్రసులు రాయరాదు. వ్యాసాన్ని వికీకరించాలి!


సూచనలు

[మార్చు]
  • ఈ వ్యాసాన్ని ఉంచ వచ్చును - షుమారు పది గ్రంధాలు రచించిన, లేదా సంపాదకత్వం వహించిన వ్యక్తిగా ఈయనను గురించిన సమాచారం తెలుసుకొన దగినది. (మనం డబ్బింగ్ సినిమాలకు కూడా ఒకో పేజీ కేటాయించామని మరచిపోవద్దు)
  • శ్రీనివాస్! - ఈయన రచనల గురించి ఈ వ్యాసంలోనే కనీసం ఒకో పేరా వ్రాస్తే బాగుంటుంది.
  • అలాగే వ్యాసంలో ప్రస్తావించిన కొన్ని విషయాల గురించి ప్రత్యేక వ్యాసాలు వ్రాయగలరా? - ఉదా: శ్రీ నృసింహ సంస్కృత కాలేజి, పాంచరాత్రాగమం, వైఖానసం, గోవిందరాజీయం, అమర కోశం - వంటివి. ఇటువంటి విషయాల గురించి వ్రాయగలిగేవారు తక్కువ. కనుక దొరకిన అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు.
  • మన శైలికి అనుగుణంగా ఏకవచనానికి మార్చాను. అన్యధా భావించవలదు. శేషాచార్యులగారికి నా నమస్కారములు

--కాసుబాబు 06:04, 8 సెప్టెంబర్ 2007 (UTC)

నేనూ, పై విభాగములో వ్యాఖ్యలు చేసిన తర్వత గూగూల్లో శోధించి ఈయన వికీలో పేజీ ఉండటానికి యోగ్యులే అని గ్రహించాను. ఇలాంటి స్క్రుటినీలు తెవికీ నాణ్యతను పరిరక్షించటానికే గానీ, అన్యధా భావించవలదు. అవును, ఈ వ్యాసంలో కూడా ఇంకాస్త ఎక్కువ సమాచారము ఉంటే బాగుంటుంది --వైజాసత్య 11:32, 8 సెప్టెంబర్ 2007 (UTC)

మీ సూచలనలకు ధన్యవాదములు. నేను త్వరలో వీలయినంతవరకు ప్రయత్నిస్తాను. వికటకవి 13:27, 10 సెప్టెంబర్ 2007 (UTC)

నిఘంటువు?

[మార్చు]

శేషాచార్యులు గారు ఒక సంస్కృతాంధ్ర నిఘంటువు కూడా వెలువరించారు అనుకుంటాను? (ఈ నిఘంటువు ఇంట్లో ఉంది) వారు, వీరు ఒకరేనా? -- పద్మ ఇం.

మహామహోపాధ్యాయ అని పదం,విద్యాప్రవీణ డిగ్రీ నాకు తెలిసినంత వరకు.----కంపశాస్త్రి 01:16, 11 సెప్టెంబర్ 2007 (UTC)
అంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం వ్రాసిన పాఠ్యపుస్తకాలు స్వీయ రచనల క్రిందికి వస్తాయా?----కంపశాస్త్రి 01:28, 11 సెప్టెంబర్ 2007 (UTC)
పద్మ గారు, అవును. వారే వీరు.

కంపశాస్త్రి గారు, పాఠ్యపుస్తకాలు స్వీయరచనలు కావు. అవి కూడా కూర్పు క్రిందే వస్తాయి. వికటకవి 06:53, 11 సెప్టెంబర్ 2007 (UTC)

ఈ వ్యాసం పేరులో తప్పు దొర్లింది. చలమచర్ల వేంకట శేషాచార్యులు కి బదులుగా చలమచర్ల వెంకట శేషాచార్యులు అని ఉంది. పేజీ తరలించటమే మార్గమా? వికటకవి 19:31, 11 సెప్టెంబర్ 2007 (UTC)
పేరు తరలిద్దాం. వేంకట సరైన పేరైన, వెంకట అని వెతికేవారి సౌలభ్యం కోసం పేజిని తరలిద్దాం. నేను తరలింపు జరుపుతాను. --మాటలబాబు 19:48, 11 సెప్టెంబర్ 2007 (UTC)