చర్చ:సత్యజిత్ రాయ్
స్వరూపం
(చర్చ:సత్యజిత్ రే నుండి దారిమార్పు చెందింది)
సత్యజిత్ రే కాదు, సత్యజిత్ రాయ్ అని ఉండాలి
[మార్చు]సత్యజిత్ రాయ్ పేరును చాలామంది తప్పుగా రాసినట్టుగా మీరు కూడా సత్యజిత్ రే అని రాయడం నాకు ఆశర్యాన్ని కలిగించింది. అది ఇంగ్లీషు స్పెలింగు వల్ల వచ్చిన తిప్పలు. రాయుడు అన్న పేరును Rayudu అని రాసినట్టుగానే raay అన్న పేరును Ray అని రాస్తే విదేశీయులు దాన్ని రే అని పలికితే ఫరవాలేదు కానీ భారతీయులు కూడా దాన్ని రాయ్ అనకుండా రే అనడం అసహజం కదా. ఈమాట వంటి పత్రికల్లో ఎప్పుడూ సత్యజిత్ రాయ్ అనే రాయడం కనిపిస్తుంది. కావాలంటే హిందీ, తమిళ, బెంగాలి వికీ పేజీలు కూడా చూడండి. సురేశ్ కొలిచాల (చర్చ)